Skip to main content

Posts

Showing posts from October 13, 2019

రైతు భరోసాకు రూ. 5,510 కోట్లు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు  కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. 

బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌

  బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఈ షో చివరి దశకు వచ్చేసింది. ప్రతి వారం హౌస్‌ నుంచి ఒక్కొక్కరూ ఎలిమినేట్‌ అవుతుండగా, ఈ వారం హాస్యనటుడు మహేశ్‌ విట్టా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు నాగార్జున ప్రకటించారు.  ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టాలు నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న ముగ్గురూ బలమైన పోటీదారులే. అయితే, రాహుల్‌, వరుణ్‌లతో పోలిస్తే, మహేశ్‌కు కాస్త ఫాలోయింగ్‌ తక్కువ. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు మహేశ్‌కు పడటంతో ఈ వారం ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్‌, శివ జ్యోతి, రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితిక, అలీ రెజాలు మాత్రమే ఉన్నారు. అందరూ బలమైన పోటీదారులే.  ఈ నేపథ్యంలో వచ్చే వారం ఎవరెవరు నామినేట్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. 

ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!

  ఎయిర్ ఇండియాలో కొందరు పైలట్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. వేతనం, పదోన్నతుల విషయంలో పైలట్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వేతనం, పదోన్నతుల విషయంలో వారి డిమాండ్లను సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో దాదాపు 120 మంది ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాల పైలట్లు వారి రాజీనామా పత్రాలను దాఖలు చేశారు. రాజీనామా చేసిన ఒక ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి మేము చేసిన డిమాండ్లపై సంస్థ కచ్చితమైన హామీ ఇవ్వడంలో విఫలమైంది. అంతేకాకుండా మేము మా వేతనాల్ని సరైన సమయంలో పొందలేకపోతున్నాం. పైలట్లు మొదట ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన తక్కువ వేతనానికి ఉద్యోగంలో చేరారు. అలాంటి వారు ఇప్పుడు వేతనం పెరుగుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. అనుభవం పొందినా అందుకు తగ్గ వేతనం అందడం లేదు’ అని అన్నారు.  ప్రస్తుతం మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పైలట్లు తమకు ఇక్కడ కాకపోయినా మరో సంస్థలో ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఏసియా తదితర సంస్థలు కూడా ఏ...

కోడెల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్లు రికార్డు చేసిన తెలంగాణ పోలీసులు!

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి అనంతరం విచారణకు హాజరు కావాలని ఆయన కుమారుడు శివరాంప్రసాద్ కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ నోటీసులకు శివరాం స్పందించలేదు. దీంతో, బంజారాహిల్స్ పోలీసులు గుంటూరు వెళ్లారు. కోడెల భార్య, శివరామ్ స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. తన తండ్రితో తనకు ఎలాంటి గొడవలు లేవని, ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణం చెందారని చెప్పినట్టు సమాచారం. తన తండ్రి మృతి చెందడానికి ముందే తాను విదేశాలకు వెళ్లానని, ఆయన మృతి వార్త తన కుటుంబసభ్యులు చెబితేనే తెలిసిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో శివరామ్ పేర్కొన్నట్టు తెలిసింది. తన భర్త ఎప్పుడూ దేనికీ భయపడే వ్యక్తి కాదని, పోలీస్ కేసులతో తన భర్తను ఇబ్బంది పెట్టారని పోలీసులకు కోడెల భార్య చెప్పినట్టు సమాచారం.   

ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదు, ఇలాంటి కేసులకు భయపడతామా?: అఖిలప్రియ వ్యాఖ్యలు

  తన భర్తపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తాము ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదని, ఇలాంటి కేసులకు భయపడతామా? అంటూ వ్యాఖ్యానించారు. ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, తమ కుటుంబం పరువు తీయడానికే తప్పుడు కేసులు పెట్టినట్టు అర్థమవుతోందని ఆరోపించారు. "గతంలో భూమా నాగిరెడ్డి గారిపైనా ఇలాగే కేసులు పెట్టి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నా భర్తను లక్ష్యంగా చేసుకున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టారు. మా లాంటి వాళ్లకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? రేపు మాకేదైనా జరిగి ఫిర్యాదు చేయడానికి వెళితే కేసులు నమోదు చేస్తారా, చేయరా అనే సందేహాలు వస్తున్నాయి. పారిపోవాల్సిన ఖర్మ మా ఆయనకు పట్టలేదు. మేం ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు చూశాం. ఒక చిన్న సివిల్ కేసును అటెంప్ట్ మర్డర్ కేసుగా మార్చేందుకు పోలీసులు ఎందుకింతగా ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు అర్థం కావడంలేదు. మఫ్టీలో ఉన్న పోలీసు అధికారి ప్రైవేటు వాహనంలో హైదరాబాద్ వస్తే మా ఆయనకు వాళ్లు పోలీసులని ఎలా తె...

ఏపీలో టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్!

ఏపీలోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్ జారీ అయింది. మంగళగిరి దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో హెచ్చరించింది. 

మందుబాబుల రక్తం జగన్ తాగేస్తున్నాడా? ఆనాడు నువ్వేం తాగావు?: చంద్రబాబుపై ఉమ్మారెడ్డి ఫైర్

  రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం ద్వారా మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడంటూ సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని హితవు పలికారు.  ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిభ్రమించినట్టుందని అన్నారు. నాడు మహిళల సంక్షేమం కోరి ఎన్టీఆర్ మద్యనిషేధం ప్రకటిస్తే, దాన్ని ఎత్తేసిందెవరో ఓసారి చెప్పండి చంద్రబాబుగారూ అంటూ నిలదీశారు. మద్యనిషేధం తొలగించడమే కాకుండా, ఫలానా షాపులో ఇంత మేర అమ్మకాలు జరగాలని ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు కూడా ఇచ్చాడని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఆనాడు మద్యాన్ని ఒక ఆదాయవనరుగా చూసినప్పుడు మందుబాబుల రక్తాన్ని తాగుతున్నట్టు అనిపించలేదా? మరి ఆనాడు నువ్వు తాగింది రక్తమా? మంచి నీళ్లా? అని ప్రశ్నించారు. "అప్పట్లో ఆదాయం వస్తుంటే నీ కళ్లు బైర్లు కమ్మాయి. కానీ జగన్ మేనిఫెస్టోలో పెట్టి మరీ మద్య నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేయాలని నిశ్చయించాడు. జగన్ చెప్పి చేస్తున్నాడు. కానీ నువ్వు చెప్పకుండా వాళ్ల రక్తాన్ని పీల్చేశావ్. అలాంటి నువ్వు ఇవాళ జగన్ మందుబాబుల రక్తాన్ని తాగ...

చంద్రుడిపైకి రాకెట్ పంపితే మహారాష్ట్ర ప్రజల కడుపు నిండుతుందా?: కేంద్రంపై రాహుల్ ధ్వజం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చంద్రుడిపైకి రాకెట్ పంపినంత మాత్రాన మహారాష్ట్ర ప్రజల కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆర్టికల్ 370, చంద్రయాన్-2 గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు నిరుద్యోగంతో యువత బాధపడుతుంటే చందమామను చూడాలంటూ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరు లాభపడ్డారో ప్రధాని మోదీ చెప్పాలని నిలదీశారు. లాతూర్ జిల్లాలో ఎన్నికల సభ సందర్భంగా రాహుల్ గాంధీ పైవ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం సంక్షోభాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి ప్రాణత్యాగం తనను ఎంతో బాధించిందని ట్వీట్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులను ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండాల్సిందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు. ఇకనైనా ఈ సంక్షోభానికి ప్రభుత్వం ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు కొడుకు... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఛీత్కరించినా, మాడు పగలకొట్టినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలను  చంద్రబాబు  నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గాడితప్పిన వ్యవస్థలను సీఎం జగన్ సరిచేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను రౌడీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడంపై కొలుసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడడమే ఉన్మాదమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం సైకోలా కనిపిస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా కనీసం 10 వేల ఉద్యోగాలిచ్చావా అని ప్రశ్నించారు. పింఛన్లు ఇంటి వద్దనే అందజేస్తామంటే తప్పుగా కనిపిస్తోందా అని నిలదీశారు. ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని పార్థసార్థి మండిపడ్డారు.

రాష్ట్ర బంద్.. కేసీఆర్ కి వార్నింగ్ బెల్స్

ణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె తీవ్రరూపు దాల్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ జేఏసీ.. తమ ఉద్యమాన్ని ఇక తెలంగాణ సాధన ఉద్యమ పంథాలో జరపాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అలాగే ఈనెల 19న రాష్ట్ర బంద్ కి పిలుపు నిచ్చారు. కాగ ఆర్టీసీ జేఏసీ పిలుపిచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమాక్ర స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను అనుయాయులకు కట్టబెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఉద్యోగులను కుక్కతోకతో పోల్చడం దారుణమన్నారు

ఏపీ సర్కార్ మరో సచివాలయాల నోటిఫికేషన్

గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. ఆ పోస్టుల్లో ఇంకా మిగిలిన పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించింది జగన్ సర్కార్. ఈ మేరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెల్సింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ జూలైలో ఇంటర్వ్యూలో నిర్వహించి.. మొత్తం 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరగా.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

శ్రీను మాస్టర్ ఇక లేరు

టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. చెన్నైలోని టి నగర్‌లో ఉన్న స్వగృహంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1969లో నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్‌గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు ఆయన పనిచేశారు. స్వర్ణ కమలం, రాధా గోపాలం, శ్రీరామరాజ్యం చిత్రాలకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఆయన నంది అవార్డులను అందుకున్నారు.

పవన్ ధామ్ లో పవన్ బస

పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం హరిద్వార్‌లో పర్యటిస్తున్నారు. గత రెండ్రోజుల నుంచి ఆయన హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఆయన ఉదయాన్నే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిద్వార్‌లోని సాధారణ హోటల్ రూమ్‌లో ఆయన బస చేసి.. స్థానిక ఆశ్రమంలో ఆకులో అల్పాహారం, భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు రావడంలేనందు వల్లే.. ఆ లోటును తీర్చాలని మాత్రి సదన్ ఆశ్రమ ప్రతినిధులు తనను కోరారని.. అందుకనే.. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చానని చెప్పారు. కాగా హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు

జగన్ కు భారీ షాక్ త్వరలో కీలక నేత పార్టీకి గుడ్ బై....

credit: third party image reference ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపీకి త్వరలో ఓ కీలక నేత పార్టీకి గుడ్ బై కోట్టనున్నారు. ఆ కీలక నేత ఎవరో కాదు ఎన్టీఆర్ అల్లుడు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. త్వరలో ఆయన వైసిపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సంబంధించిన చర్చలు జరిపారు. ఓ మంచి ముహూర్తం చూసి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. వైసిపీ ప్రభుత్వం మీద పురంధేశ్వరి విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో దగ్గుబాటి నుంచి ఏలాంటి రియాక్షన్ లేవు. credit: third party image reference పురంధేశ్వరిని కూడా వైసిపీ లోకి తీసుకు రావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసిపీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. అయితే భార్య భర్తలు ఇద్దరూ జగన్ వద్ద చేరడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో పని చేయడం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కొత్తమి కాదు. గతంలో బిజెపితో కలిసి పని చేశారు.

సాక్షి మాజీ యాంకర్ , నటుడు శ్రీనివాస్ రెడ్డీలకు జగన్ కీలక పదవులు

తిరుమల , తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న , నటుడు ‌శ్రీనివాస్ రెడ్డీలను ఏపీ ప్రభుత్వం నియమించింది . ఎస్వీబీసీ చైర్మెన్ గా పృధ్వీరాజ్ బాలిరెడ్డీని గతంలో నియమించిన సంగతి తెలిసిందే.ఆయనతో కలిసి ఈ డైరెక్టర్స్ ఇద్దరూ పనిచేయనన్నారు . వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో చైర్మన్ తో పాటు టీడీపీ పాలకమండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తుంది . కానీ ప్రభుత్వం ఈసారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది . యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్ , టీవీ 9 లో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు . టీవీ 9 లో దాదాపు పదేళ్లకు పైగా పనిచేసి తరువాత సాక్షి ఛానల్లో చేరారు . కొన్నాళ్లు అందులో పనిచేసి బయటకి వచ్చినా సాక్షీకి కన్సెల్టెంట్ గా పనిచేయడం విశేషం . ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తున్న స్వప్న సొంతంగా ఓ వెబ్ చానల్ నడుపుతున్నారు . దీనిద్వారా జగన్ మీద విధేయతా చాటుకుంటూనే ఉన్నారు . నాటి టీడీపీ ప్రభుత్వాన్ని తన ఇంటర్వ్యూల ద్వారా ఇరుకున పెట్టి జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు . ఎన్న...

ఒకే రోజు ఒకే జిల్లాకు జగన్ చంద్రబాబు అసలు ఏం జరగబోతోంది

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజున ఒకే జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు రాజకీయం అంతా ఒకటే సారి గా ఎక్కినట్లు అయింది అటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష నేత బలాబలాలు వేదిక కాబోతోంది ఆ రోజు ఏం జరగబోతుంది అని ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వెళుతున్నారు ఇటు చంద్రబాబు కూడా సమీక్షలు నెల్లూరు జిల్లాకు వెళుతున్నారు రెండు రోజుల పాటు అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రైతు భరోసా సభ అటు చంద్రబాబు పర్యటన తో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఇరు పార్టీల నేతలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మెగాస్టార్ తో నాకు గొడవలు లేవ ఎమ్మెల్యే చెవిరెడ్డి

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమాన సంఘం పేరుతో చిరంజీవిని విమర్శిస్తూ ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్ని ఖండించారు. తన అభిమాన సంఘంపేరుతో సర్క్యలేట్ అవుతున్న పోస్టింగులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.తనకు ట్విట్టర్ అకౌంట్లు గానీ ఫేస్ బుక్ అకౌంట్లుగానీ లేవన్నారు. తాను తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు. ఆనాటి నుంచి చిరంజీవితో తనకు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. సీఎం జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని ప...

బాలయ్యపై జగన్ ఫోకస్ ..... ఈసారి ఎలాగైనా !

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఏకంగా 151 సీట్లు దక్కించుకుని సరికొత్త విజయాన్ని నమోదుచేసుకుంది . ఇక రాయలసీమలో కడప , కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరు , అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆ రికార్డును దక్కించుకోలేకపోయింది . దీంతో ఆ రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టారు జగన్ . వచ్చే ఎన్నికలనాటికి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట . ఆదిశగా వ్యూహాలు సిధ్ధం చేసుకుంంటున్నారంట . ముఖ్యమంగా నందమూరి బాలయ్య నియోజకవర్గంపైనా జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంట . వైయస్సార్సీపీ గాలిని కూడా నందమూరి బా‌లయ్య తట్టుకుని హిందూపురం నుంచి రెండోసారీ ఎమ్మెల్యేగా గెలిచారు . పాత ఇంచార్జ్ ను మైనార్టీ వ్యుహంతో మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను బరిలోకి దింపి ... వైయస్సార్సీపీ ఎన్నికలకి వెళ్లినా వర్కౌట్ కాలేదు . దీంతో ఈసారి ఎలాగైనా హిందూపురంలో పాగావేయాలని భావిస్తున్నారట అందుకే బాలయ్య నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట . హిందూపూర్ లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినా ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవిని క...

ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్ ను ఏం చేయాలి?:రేవంత్ రెడ్డి

టీఎస్సార్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు రాలేదని కార్మికులను తొలగిస్తానన్న సీఎం కేసీఆర్ ఆరేళ్లుగా సచివాలయానికి రావడం లేదుగా, మరి, ఆయన్ని ఏం చేయాలి? పీడీ యాక్ట్ పెట్టాలా? అని సెటైర్లు విసిరారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కేసీఆర్ కు ముఖం చెల్లట్లేదని, అందుకే, పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగా జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత హరీశ్ రావు గురించి ఆయన ప్రస్తావించారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ ఇంత జరుగుతున్నా నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీల వైపు చూడొద్దని, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా వారి బాధ్యతను వారు సక్రమంగా నేరవేర్చాలని సూచించారు.   

సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ రేపు పునఃప్రారంభం

దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే ఘడియలు మరెంతో దూరంలో లేవు! కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది. అక్టోబరు 17 లోపు ఇరువర్గాలు వాదనలు వినిపించడం పూర్తిచేయాలని సుప్రీం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కోర్టుకు దసరా సెలవులు రావడంతో విచారణకు విరామం వచ్చింది. ఇప్పుడు వారం రోజుల దసరా విరామం అనంతరం మరోసారి కేసు విచారణ షురూ కానుంది. రేపటినుంచి సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరగనుంది.   

దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగుతాయేమో!: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి సెటైర్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల పట్ల కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్న ప్రభుత్వం స్కూళ్లకు ఎందుకు సెలవులు పొడిగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కారు తీరు చూస్తుంటే సమ్మె ముగిసేవరకు ఇలా సెలవులు పొడిగించుకుంటూ పోతారేమో అనిపిస్తోందని తెలిపారు. దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగించేట్టుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంతాచారి తరహాలో ఆత్మత్యాగానికి పాల్పడితే ప్రభుత్వం దిగొస్తుందని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణత్యాగాలను తన స్వార్థం కోసం వాడుకోవడం కేసీఆర్ దొరగారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇలాంటి ప్రాణత్యాగాలు చూసి చలించే మనస్తత్వం కేసీఆర్ ది కాదని పేర్కొన్నారు. ఏదైనా బతికి సాధించాలని, కేసీఆర్ దొరతనానికి అంతం చూడాలంటే అదే మార్గమని తెలిపారు.

బెజవాడ అభిమాన సంద్రంలో మహేశ్ బాబు ఉక్కిరిబిక్కిరి!

  టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయన పబ్లిక్ లోకి వస్తే ఇసుకేస్తే రాలనంతగా జనాలు వస్తారు. తాజాగా విజయవాడలో ఆ విషయం నిరూపితమైంది. ఎంజీ రోడ్డులో కొత్తగా స్థాపించిన భీమ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు విచ్చేశారు. ఆయన రాకతో అభిమానులు పోటెత్తారు. షోరూం పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. అభిమానులను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, భీమ జ్యుయెలరీ సంస్థ త్వరగా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బెజవాడ తనకు ఎప్పుడూ ప్రత్యేకం అని, తన కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి  వస్తోందని, ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు.

రాఫెల్ యుద్ధ విమానంపై 'ఓం' రాశాను: రాజ్ నాథ్ సింగ్

  రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాశానని, దానికి 'రక్షా బంధన్' కట్టానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ రోజు ఆయన హర్యానాలోని కర్నాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేసిన విమర్శలపై స్పందించారు. 'దేశంలో కాంగ్రెస్ నేతలు రాఫెల్ విషయంపై వివాదం రేపుతున్నారు. దేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని వారు స్వాగతించాల్సిందిపోయి, అందుకు విరుద్ధంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్ కు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు. 'మన వద్ద ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే, ఉగ్రవాదులపై దాడులు జరపడానికి మనం బాలాకోట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడి ఉగ్రవాద శిబిరాలను మనం ఇక్కడి నుంచే రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా నాశనం చేసే వాళ్లం' అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన ఆయన.. తొలి రాఫెల్ విమానాన్ని అధికారికంగా అందుకుని, దానికి ఆయుధ పూజలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధ ...

కొందరు నేతలు మొసలి కన్నీరు కార్చుతున్నారు: మోదీ

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంపై కొందరు నేతలు మొసలి కన్నీరు కార్చుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జల్గావ్ లో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కశ్మీర్ లో భవిష్యత్తులో తిరిగి ఆర్టికల్ 370ని తీసుకురాగలరా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తీసుకొస్తామని తమ మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని ఆయన సవాలు విసిరారు. దేశ ప్రజలు ఇందుకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ లో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారి హక్కులను తాము పునరుద్ధరిస్తామని మోదీ చెప్పారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నేతలు మాట్లాడుతున్న మాటలు పాక్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లా ఉన్నాయని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లకే తమ ప్రభుత్వం సవాళ్లు విసురుతూ వాటిని పరిష్కరించేందుకు పని చేస్తోందని మోదీ చెప్పారు.   

వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని తెలిపారు. రామకావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ వ్యాఖ్యానించారు. వాల్మీకి గొప్ప కావ్యాన్ని రచించారంటూ కొనియాడారు. 

చెత్త ఏరుతున్నప్పుడు తన చేతిలో ఉన్న పరికరం ఏంటో చెప్పిన ప్రధాని మోదీ

చైనా అధినేత షీ జిన్ పింగ్ తో చర్చల కోసం మహాబలిపురం వెళ్లిన ప్రధాని మోదీ ఉదయం వ్యాహ్యాళి సందర్భంగా బీచ్ లో చెత్త ఏరడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో మోదీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ వంటి పరికరం కూడా అందరిలో ఆసక్తి కలిగించింది. అదేంటన్నది చాలామందికి తెలియలేదు. కొందరు టార్చ్ లైట్ అని, మరికొందరు లైట్ వెయిట్ డంబెల్ అని ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలే కాదు, మోదీ సన్నిహితుల్లోనూ ఇదే సందేహం కలిగింది. దీనిపై స్వయంగా మోదీనే వివరణ ఇచ్చారు. తన చేతిలో ఉన్నది ఆక్యుప్రెషర్ రోలర్ అని వెల్లడించారు. ఇది చేతిలో ఉంచుకోవడం వల్ల దేహంలో రక్తప్రసరణ క్రమబద్ధంగా కొనసాగుతుందని, తద్వారా ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు. విపరీతమైన ఉద్విగ్నత, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. తాను ఆక్యుప్రెషర్ రోలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటానని, అది తనకెంతో ఉపయుక్తంగా ఉంటోందని ట్వీట్ చేశారు.