Skip to main content

వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉండేవి : శివాజీ రాజా

ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ చాలా గొప్ప వ్యక్తి అని నటుడు శివాజీ రాజా కొనియాడారు. వేణు మృతిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ...  వేణుమాధవ్ చనిపోయినప్పుడు తాను ఆస్పత్రిలోనే ఉన్నానని చెప్పారు. వేణు.. ఆర్టిస్టు కాకముందునుంచే ఆయన మిమిక్రీ చేసేవాడని అన్నారు. దర్శకుడు కృష్ణారెడ్డి వేణు టాలెంట్‌ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారని.. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు.వేణు మానవతావాది అని, ఎంతో మందికి సహాయం చేశాడని శివాజీ రాజా చెప్పారు. వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉంటాయని, పేదవాళ్లకు పంచిపెట్టేవాడని తెలిపారు. ‘మా’ అసోషియేషన్‌లో తనతో కలిసి వేణు పనిచేశాడన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించాడని, కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళదామని చెప్పినా రానన్నాడని, బలవంతంగా తీసుకువచ్చామని వారు చెప్పారని శివాజీ రాజా తెలిపారు.

Comments