Skip to main content

Posts

Showing posts from October 27, 2019

ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ కావాలో ముందే ప్లాన్ చేసుకున్నారు: బిగ్ బాస్ షోపై హేమ వ్యాఖ్యలు

  తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ మరో వారంలో ముగియనుంది. ఈ షోలో తొలివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని, శ్రీముఖి బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని వివరించారు. తాను బలమైన కంటెస్టెంట్ గా మారతానని తెలుసుకుని, తనను బయటికి పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలో అప్పుడే నిర్ణయించుకున్నారని వెల్లడించారు. తనతో హౌస్ లో కావాలనే గొడవకు దిగేవాళ్లని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీముఖి గేమ్ కు ఇతర కంటెస్టెంట్లు బలవుతున్నారని, శ్రీముఖి బయట ఒకలా, లోపల మరోలా మాట్లాడుతుందని ఆరోపించారు.  హిమజ ఎలిమినేట్ అయ్యాక 

చంద్రబాబును లోపల వేయడానికి బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి: జేసీ వ్యాఖ్యలు

ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ రాజకీయవేత్త జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబును లోపలికి పంపే యత్నాలు జరగడం సాధారణమేనని, ఇందులో బీజేపీ పాత్ర ఉందో, లేదో సరిగా చెప్పలేను కానీ, వైసీపీ మాత్రం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుందని జేసీ వివరించారు. తాను ఇదే విషయాన్ని చంద్రబాబును కూడా అడిగినట్టు వెల్లడించారు. "ఏం బాబూ ఎప్పుడు లోపలికి వెళ్లేది అని చంద్రబాబును అడిగితే, నేను లోపలికి పోను దివాకర్ రెడ్డీ, వీళ్లు నన్నేమీ చేయలేరు అని చెప్పారు. నేను ఏ విషయాన్ని దాచుకోను. అందుకే చంద్రబాబును అడిగితే ఆయన నేనేమీ తప్పు చేయలేదు, నాకేమీ కాదు అని ధీమా వ్యక్తం చేశారు" అంటూ జేసీ వివరించారు. అప్పట్లో అమాయకుడైన జగన్ ను చంద్రబాబు, సోనియా అందరూ కలిసి జైల్లో వేశారని వైసీపీ వాళ్లు అనుకుంటుంటారని వెల్లడించారు. అందులో నిజం ఎంతో తనకు తెలియదు కానీ, 45 ఏళ్ల నవయువకుడైన జగన్ కు కోపమో, తాపమో ఉండడం సహజమేనని, అతని ఆవేశాన్ని తాను త...

సరిహద్దుల్లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సరిహద్దుల్లో జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు జిల్లా రాజౌరి వెళ్లిన ఆయన అక్కడి సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో కనిపించిన మోదీ జవాన్లకు మిఠాయిలు పంచిపెట్టారు. స్వయంగా ఆయన వారికి తినిపించారు. సైనికులతో ఉల్లాసంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర సైనికాధికారులు ఉన్నారు. మోదీ రాజౌరి రాకకు కొద్ది ముందు పాకిస్థాన్ వైపు నుంచి సైనిక పోస్టులపై గుళ్ల వర్షం కురిసింది. ఈ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదు, వ్యక్తిగతంగా అండగా ఉంటా: వంశీకి లేఖ రాసిన చంద్రబాబు

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంపై చంద్రబాబునాయుడు స్పందించారు. రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. ఈ మేరకు వంశీకి చంద్రబాబు లేఖ రాశారు. సమస్యలకు ఎదురు నిలిచి పోరాడాలని సూచించారు. వైసీపీపై పోరాటంలో అండగా ఉంటామని వంశీకి ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేద్దామని సూచించారు.

భారత్ కు తప్పిన 'క్యార్' ముప్పు!

    అరేబియా సముద్రంలో కొనసాగుతున్న క్యార్ తుపాను మరింత భీకర రూపు దాల్చింది. ఇది మరింత బలపడి ఈ ఉదయం పెను తుపానుగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. గంటకు 230 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో క్యార్ అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కాగా, ప్రస్తుతం భారత పశ్చిమ తీరానికి సమీపంగా ఉన్న క్యార్ ఒమన్ దిశగా వెళుతుందని ఐఎండీ వెల్లడించింది. దాంతో గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు ముప్పు తప్పింది. అయితే, క్యార్ తుపాను కారణంగా గోవా, కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పెను తుపాను ముంబయికి నైరుతి దిశలో 620 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 2007 తర్వాత అరేబియా సముద్రంలో ఓ సూపర్ సైక్లోన్ ఏర్పడడం ఇదే ప్రథమం.

తన ముగ్గురు పిల్లలను చంపి బాగ్దాదీ ఆత్మాహతికి పాల్పడ్డాడు: ట్రంప్ వెల్లడి

ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. అమెరికా సైనిక దాడుల సమయంలో బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని ట్రంప్ వెల్లడించారు. తొలుత తన ముగ్గురు పిల్లలను చంపి, ఆపై తనను తాను పేల్చుకున్నాడని వివరించారు. ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిన బాగ్దాదీ భయంతో పిరికిపందలా కుక్క చావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. బాగ్దాదీ తన చివరి క్షణాల్లో భయంతో వణికిపోయాడని, ప్రాణభయంతో భీతిల్లిపోయాడని వివరించారు. అమెరికా దళాలను చూడగానే ఓ సొరంగంలో దాక్కున్నాడని, రెండు గంటల ఆపరేషన్ అనంతరం బాగ్దాదీ ఆత్మాహుతితో చనిపోయాడని ట్రంప్ పేర్కొన్నారు. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో బాగ్దాదీ హతుడైనట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇవాళో పెద్ద ఘటన జరిగిందని ట్రంప్ పేర్కొనడంతో బాగ్దాదీ మరణంపై కథనాలకు మరింత బలం చేకూరింది. కాగా, బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా వారం క్రితమే వ్యూహరచన చేయగా, ట్రంప్ ఆమోదంతో కమాండోలు రంగంలోకి దిగి విజయవంతంగా పని పూర్తిచేశారు.  మృతి చెందింది బాగ్దాదీయేనని డీఎన్ఏ టెస్టులు కూడా నిర్ధార...

వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌

    వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ను గూగుల్‌ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్‌ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్‌, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు.  గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరన్‌ భాటియా మాట్లాడుతూ టైలర్‌ను ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. 

ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 23వ రోజుకు చేరింది. అటు సర్కారు నుంచి కానీ, ఇటు ఆర్టీసీ కార్మికుల నుంచి కానీ ఎలాంటి చొరవ కనిపించకపోవడంతో నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీతో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. అంతేకాకుండా, కోర్టులో సమ్మెపై వినిపించాల్సిన వాదనలను కూడా సీఎంతో చర్చించారు.

మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్... మోదీ విమానానికి అనుమతి నిరాకరణ

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్ పై విద్వేషంతో రగిలిపోతున్న పాకిస్థాన్ మరోసారి తన వైఖరి చాటుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి తమ గగనతలంపై నుంచే వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా పాక్ మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ వర్గాలు కోరగా, తాము భారత విజ్ఞప్తిని తిరస్కరించామని పాక్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన నేటికీ ఆగలేదని, అందుకే పాక్ గగనతలాన్ని మోదీ ఉపయోగించుకునేందుకు అనుమతించబోవడంలేదని పాక్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. గత నెలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా పాక్ ఇలాగే అనుమతించలేదు. కాగా, మోదీ విమానానికి అనుమతి నిరాకరణపై తమ వైఖరిని భారత హైకమిషనర్ కు తెలియజేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.

టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా... చంద్రబాబుకు లేఖ

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు వల్లభనేని వంశీ తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తనను, తన అనుచరులను కొందరు వైసీపీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేసినా ఎన్నికల్లో గెలిచానని, ఇప్పటికీ వేధింపులు ఆగలేదని వంశీ తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన తన లేఖలో తెలిపినట్టు సమాచారం. వంశీ ఇటీవలే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. దాంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు షికారు చేశాయి. వైసీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  వంశీ హయాంలో వైసీపీ కార్యకర్తలపై అనేక కేసులు నమోదయ్యాయని యార్లగడ్డ అంటున్నారు.అటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితోనూ వంశీ సమావేశం కావడంతో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారేమోనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  

హర్యానా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖత్తర్

  హర్యానా రాజకీయ అనిశ్చితికి తెరపడింది. బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకగా, ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖత్తర్ ప్రమాణస్వీకారం చేశారు. ఖత్తర్ తో రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఖత్తర్ సీఎంగా వ్యవహరించడం ఇది రెండోసారి. గత ప్రభుత్వంలోనూ ఆయనే ముఖ్యమంత్రి అన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో స్థానిక పార్టీ అయిన జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కాగా,  ఖత్తర్ ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.  

ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన పవన్ కల్యాణ్

  ఏపీలో ఇసుక కొరత లక్షలాదిమంది కార్మికుల పొట్ట కొడుతోందని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ నాగ బ్రహ్మాజీ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. నాగ బ్రహ్మాజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్న పవన్, ఈ సందర్భంగా మేస్త్రీ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఏపీలోని భవన నిర్మాణ రంగ కార్మికుల దయనీయ స్థితికి నిదర్శనం అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ తెలిపారు. పనిలేని కార్మికుల కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారని విమర్శించారు.

బోటు ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగుంటే ధర్మాడి పేరు ఎవరికీ తెలిసేది కాదు: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

     గోదావరి నదిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం విజయవంతంగా వెలికితీసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గోదావరి నది నుంచి బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం నైపుణ్యానికి, ఆయన శ్రమకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ట్వీట్ చేశారు. అయితే, ఇదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ధర్మాడి సత్యానికి పేరొచ్చేది కాదని తెలిపారు. చంద్రబాబే బోటును వెలికితీసినట్టు ప్రచారం జరిగేదని, ధర్మాడి సత్యం పేరు ఎవరికీ తెలిసేది కాదని పేర్కొన్నారు. చంద్రబాబే దగ్గరుండి డైవర్లకు మార్గదర్శనం చేసి గొలుసులు వేసి పడవను బయటికి లాగాడని కులమీడియా బాకాలు ఊదేదని విమర్శించారు.

మానవతను చూపుతూ కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

  దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై మానవతను చూపుతూ వారందరికీ పెన్షన్ ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, సివియర్ హెమోఫీలియా వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పెన్షన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇదే సమయంలో బిలాటరల్ ఎలిఫాంటరియాసిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, మంచం పట్టిన పక్షవాత రోజులు, ప్రమాదాల బాధితులకు రూ. 5 వేల చొప్పున నెలవారీ సాయం చేయాలని ఆయన నిర్ణయించారు. జనవరి 1 నుంచి ఈ పెన్షన్లు అమలుకానున్నాయి. ఈలోగా లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. దేశంలోనే ఈ తరహా వ్యాధిగ్రస్థులకు పెన్షన్ మంజూరు తొలిసారని అధికారులు అంటున్నారు. కాగా, ఈ సందర్భంగా పోస్ట్ ఆపరేషన్ అలవెన్స్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఏదైనా ఆపరేషన్ జరిగిన తరువాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో రోజుకు రూ. 225 చొప్పున రోగులకు చెల్లిస్తారు. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఎన్ని రోజుల్లోనో చెప్పలేను గానీ... దేశమంతా గర్వపడేలా అయోధ్య తీర్పు: నరేంద్ర మోదీ

    దీపావళి పండగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, ప్రజలందరికీ తన శుభాకాంక్షలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జాతిని ఉద్దేశించి, ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా 'మన్ కీ బాత్'ను మోదీ వినిపించారు. దీపావళి పండగ, భారత సంస్కృతిలో భాగమని అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, తక్కువ కాలుష్యాలు వెదజల్లే టపాకాయలను ఎంచుకోవాలని సూచించారు. మహిళా సాధికారత దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలని తాను గత 'మన్ కీ బాత్'లో కోరిన తరువాత వేలాది మంది స్పందించారని తెలిపారు. నవంబర్ 12న గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల 85 దేశాల ప్రతినిధులు ఢిల్లీ నుంచి అమృతసర్ కు ప్రయాణించి, గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారని, వారంతా భారత సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో కొనియాడారని మోదీ వ్యాఖ్యానించారు. వారంతా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిపారు. ఇదే సమయంలో అక్టోబర్ 3...

చర్చలు జరుగుతుండగా మేము మధ్యలో వెళ్లిపోలేదు.. ఐఏఎస్ లు అబద్ధాలు చెప్పొద్దు: అశ్వత్థామరెడ్డి

    చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి టీఎస్ఆర్టీసి కార్మిక నేతలు వెళ్లిపోయారని, తిరిగి రాలేదని నిన్న అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. నిన్న చర్చల సమయంలో తాము మధ్యలో వెళ్లిపోలేదని, బాధ్యతగల ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెప్పవద్దని అన్నారు. చర్చలకు మళ్లీ పిలుస్తామన్న అధికారులు పిలవలేదని వివరించారు. జేఏసీ ఇచ్చిన డిమాండ్లపై చర్చించాలని తాము కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఎప్పుడు పిలిచినా వెళ్తామని, రేపు కోర్టు ప్రారంభమయ్యే సమయంలోపు పిలిచినా చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కాగా, కోర్టుకు నివేదిక ఇవ్వాలి కాబట్టే, నామ మాత్రంగా తమను చర్చలకు పిలిచారని కార్మిక నేతలు నిన్న కూడా మీడియాకు తెలిపారు.

తీహార్ జైలు నుంచి విడుదలైన దుష్యంత్ చౌతాలా తండ్రి

    హర్యానాలో సంచలన విజయం సాధించి, కింగ్ మేకర్ గా అవతరించిన జననాయక జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పెరోల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కేసులో వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో, ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ 10 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆయన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులను దుష్యంత్ కు ఆఫర్ చేసింది. ఫలితాలు వెల్లడైన వెంటనే జైలులో ఉన్న తండ్రిని దుష్యంత్ కలుసుకున్నారు. ఆయన సూచన మేరకే బీజేపీతో చేతులు కలిపారు. నేడు జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు దుష్యంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

శశికళ జైలు నుంచి బయటకు రావడం తథ్యం: దినకరన్

    బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సత్ప్రవర్తన మీద విడుదల అవుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆమె విడుదలవుతారన్న ప్రచారంపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ స్పందించారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో శశికళ పేరు లేదని తెలిపారు. ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలను ఆమె కూడా పాటిస్తున్నారని దినకరన్ తెలిపారు. ఖైదీల వస్త్రధారణ నిబంధనలను కూడా పాటిస్తున్నారని అన్నారు. గతంలో శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అయితే, ఆమె పూర్తి శిక్షా కాలం ముగిసే వరకు జైలులోనే ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుపుతామని న్యాయవాది రాజచెందూర్‌ పాండియన్‌ కూడా అన్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా, ఇప్పటికే రెండున్నరేళ్ల శిక్ష పూర్తయింది.   

పొద్దుపొద్దున్నే టపాసుల పేలుళ్లతో మోతెక్కిపోయిన తమిళనాడు!

    తమిళనాడులో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఉదయం పేలుళ్లతో వీధులన్నీ మోతెక్కిపోయాయి. చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొద్దున్నే ప్రజలు టపాసుల మోత మోగించారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి పండగను ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణసంచా కాల్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతించగా, ఈ ఉత్తర్వులు సడలించాలని, ఉదయం పూట కాల్చడం తమ సంప్రదాయమని తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును సడలిస్తూ, రోజులో ఎప్పుడైనా రెండు గంటల పాటు టపాసులు కాల్చుకునేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.

ఐసిస్‌ అధినేత హతం..?

ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రసంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీని అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో మట్టుబెట్టినట్లు సమాచారం. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్లో యూఎస్‌ ఆర్మీ..అబు బకర్‌ను హతమార్చినట్లు అధికారులు తెలిపారని ‘న్యూస్‌ వీక్‌’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు శ్వేతసౌధానికి చేరవేసినట్లు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కథనంలో పేర్కొంది. అబుబకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు . ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని తెలిపింది. తాజాగా ట్రంప్‌ ‘ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది’ అని ట్విటర్‌లో పేర్కొనడం దీనికి బలాన్నిస్తోంది.   సిరియాలో ఆపరేషన్‌.. వాయువ్య సిరియాలో శనివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో బగ్దాదీని మట్టుబెట్టారు. అయితే, దీన్ని ధ్రువీకరించడానికి డీఎన్‌ఏ, బయోమెట్రిక్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాడులు జరిపే సమయంలో అతడు ఆత్మాహుతికి యత్నించాడని అధికారులు పేర్కొన్నారు. బగ్దాదీని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడ...