Skip to main content

Posts

Showing posts from August 13, 2020

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here

అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్… చిరంజీవి

  తాజా గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో ప్రతి ఒక్కరు సంజయ్ తొందర గా కోలుకోవాలి అని సోషల్ మీడియా వేదికలో ఓదార్పు వచనాలు తెలియచేస్తున్నారు. అదే నేపథ్యం లో టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి కూడా సంజయ్ దత్ పరిస్థితి పట్ల చలించిపోయారు. “అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్… నువ్వింతటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నావని తెలిసి ఎంతో బాధగా ఉంది. కానీ నువ్వో ఫైటర్ వి. ఎన్నో ఏళ్లుగా అనేక సంక్షోభాలను అధిగమించావు. ఎలాంటి సందేహం లేదు, దీని నుంచి కూడా నువ్వు తప్పకుండా బయటికి వస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ లో ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు ?

సర్కార్కు ప్రతిపాదనలు పంపిన బోర్డ్ ముందు సర్కార్ కాలేజీల్లో ..తర్వాతే ప్రైవేటులో..  అడ్మిషన్ ప్ర‌క్రియలో మార్పులు చేసే యోచనలో బోర్డు అధికారులున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు ఓకే చెప్పిన వెంటనే, ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటుకు చెక్ పెట్టేందుకే.. కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థంగా మారింది. జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ ఇప్పటికీ షురూ కాలేదు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితులు లేవు. టెన్త్ రిజల్ట‌స్  ప్ర‌కటించి రెండు నెలలు దాటింది. అప్పటి నుంచి వారంతా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్స్ ను పాస్ చేయడంతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పుడే చేరితే ఫీజు తగ్గిస్తామంటూ పేరెంట్స్ ను ఒప్పించి, కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. సర్కారు కా...

గాలి ద్వారా కరోనా.. రెండు మీటర్ల భౌతికదూరంతో ఉపయోగం లేదు:..

  ప్రస్తుతం మనం పాటిస్తున్న రెండు మీటర్లు లేదా ఆరు అడుగుల భౌతికదూరం వల్ల ఉపయోగం లేదని ఫ్లోరిడా యూనివర్శిటీ వైరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు అన్నారు. ఇండోర్ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల వరకు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే... ఇప్పుడు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సవరించాలని సూచించారు. ఈ మేరకు మెడ్ రెక్సివ్ లో ప్రచురితమైన తమ పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ మాట్లాడేవారి సమీపంలో గాలిని పీల్చడం ద్వారా కరోనా సోకుతుందని పరిశోధకులు చెప్పారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని... ముఖాన్ని కవర్ చేసుకోవడంలో కూడా జాగ్రత్త అవసరమని సూచించారు. కార్యాలయాల్లో మనం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరం... ఉద్యోగుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పారు. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించిన సంగతి తెలిసిందే. అయితే, గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని 239 మంది శాస్త్రవేత్తలు లేఖలు రాయడంతో... ఈ వాదనను డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది. ...

పెండింగ్ లో ఉన్న బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీంకోర్ట్

  దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆటోమొబైల్ డీలర్లకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మార్చిలో విక్రయించినా, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కు నోచుకోని బీఎస్4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని న్యాయస్థానం వెల్లడించింది. మార్చి 12 నుంచి మార్చి 31 మధ్య కాలంలో దేశంలో 9,56,015 వాహనాలు అమ్ముడవగా, వాటిలో రిజిస్ట్రేషన్ పూర్తయినవి 9,01,223 మాత్రమే. కేంద్రం సరికొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలు చేయాలని సంకల్పించడంతో బీఎస్4 వాహనాల అమ్మకాలను మార్చి 31తో నిలిపివేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో తాము బీఎస్4 వాహనాలను విక్రయించలేకపోయామని, తమ వద్ద మిగిలివున్న వాహనాలను అమ్ముకునేందుకు అనుమతించాలని ఆటోమొబైల్ వర్గాలు సుప్రీంను ఆశ్రయించాయి. దాంతో 10 రోజుల్లో 10 శాతం వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. కానీ, ఆటోమొబైల్ డీలర్లు ఆ కాస్త గడువులో 10 శాతం కంటే మించి వాహనాలు విక్రయించడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా బీఎస్4 వాహనాల ర...

అచ్చెన్నాయుడికి కరోనా.. ఆందోళనలో కుటుంబసభ్యులు

  టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రతివారం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ఆసుపత్రి నివేదిక ఇస్తోంది. ఈ నేపథ్యంలో, అచ్చెన్నకు కరోనా సోకడంపై హైకోర్టుకు లేఖ రాయనున్నారు. రమేశ్ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని తెలియడంతో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.  

రిలయన్స్‌తో టిక్‌టాక్‌ చర్చలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పునరాగమనానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఉన్న తన యూజర్‌ బేస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు  భారత్‌లో తన వ్యాపారాన్ని విక్రయించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ చర్చలు జరిపినట్లు ‘టెక్ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. గత నెలలోనే ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది. అయితే, ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది. దీనిపై అటు రిలయన్స్‌గానీ, ఇటు బైట్‌ డ్యాన్స్‌ గానీ స్పందించలేదు. మరోవైపు అమెరికాలో సైతం ఈ యాప్‌ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో ఆ సంస్థ చర్చలు జరుపుతోంది. అదే క్రమంలో ఇండియా కార్యకలాపాలను కూడా మైక్రోసాఫ్టే కొనుగోలు చేయనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి...

జడ్జి రామకృష్ణ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

  ఏపీ హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమాఖ్య సభ్యుడు లక్ష్మీనరసయ్య హైకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య హైకోర్టు న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేశారంటూ జడ్జి రామకృష్ణ తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ మేరకు ఓ పెన్ డ్రైవ్ ను ఆయన కోర్టుకు సమర్పించారు. తాజాగా, ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జడ్జి రామకృష్ణ సమర్పించిన పెన్ డ్రైవ్ లోని సంభాషణలు నిజమా, కాదా అనేది నిర్ధారించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ ను న్యాయాధికారిగా నియమించింది. వీలైనంత త్వరగా నిగ్గు తేల్చాలని జస్టిస్ రవీంద్రన్ కు స్పష్టం చేసింది. తప్పనిసరి అయితే ఈ వ్యవహారంలో సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు సహకరించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మరో 4 వారాలకు వాయిదా వేసింది.  

విశాఖ శంకుస్థాపనకు మోదీని పిలుస్తాం: బొత్స

  ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తామని... అదే విధంగా విశాఖ శంకుస్థాపనకు కూడా ప్రధాని మోదీతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అమరావతిని కూడా చంద్రబాబు గ్రాఫిక్స్ మాదిరి కాకుండా నిజంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అమరావతిలో పెండిగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాని, ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా, ఆర్బాటాలకు పోయి, అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని చెప్పారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని చెప్పారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను తామే పోషించుకుంటూ, న్యాయస్థానాలకు లోబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజం, నిజాయతీనే ఎప్పటికీ నిలుస్తాయని చెప్పారు.  

కొవిడ్ సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు

  ఏపీలో కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్ కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనాపై సమాచారమే కాదు సహాయం కూడా పొందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ కి రాజమౌళి కొత్త ఐడియా

దర్శక ధీరుడు యస్‌.యస్‌ రాజమౌళి కరోనాను జయించారు. తిరిగి యధావిధిగా పనుల్లో పడ్డారు. తమ తాజా ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయమై ఆయన ఈ సారి సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన అనువైన, ఏ విధమైన ఇబ్బందులు రానటువంటి ప్లానింగ్ చేయబోతున్నట్లు సమచారం. అందుకోసం ఓ కొత్త ఐడియా ఆలోచించినట్లు సమాచారం.  బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ..తాజా చిత్రం బెల్ బాటమ్ షూటింగ్ ...కరోనా ప్రభావం లేని యూరప్ దేశాల్లో నిశ్చింతగా మొదలైంది. వారు ధైర్యంగా అక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు. అదే విధంగా తాము కూడా అటువంటి దేశం ఎంచుకుని అక్కడ క్రూని సమకూర్చుకుని షూటింగ్ లో చాలా భాగం ఫినిష్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాధ్యా సాధ్యాలను రాజమౌళి టీమ్ పరిశీలిస్తోందని వినికిడి. కరోనా కేసులు లేని దేశంలో లొకేషన్ ఎంపిక చేసి, ఫర్మిషన్స్ తీసుకోవటం పై ప్రస్తుతం నిర్మాత దానయ్య టీమ్ ముందుకు వెళ్తోంది. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  ...

హ్యాపీ నెస్ట్‌ భవనాల నిర్మాణం పూర్తి చేయండి’ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి  మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి  సంస్థపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ప్రస్తుత నిర్మాణాల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించారు. నిర్మాణలు పూర్తి చేయడం కోసం నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హ్యాపీ నెస్ట్‌ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

అమరావతి రైతులకు శుభవార్త..! వంద‌శాతం అమరావతే రాజ‌ధాని..!

వంద‌శాతం రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రాలేద‌ని గుర్తుచేశారు. అమరావతి రైతులకు శుభవార్త.. రేపు రాష్ట్ర హైకోర్టు దీనిపై తీర్పు వెల్ల‌డించ‌నుంద‌న్న ఆయ‌న‌.. ఇక‌, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు. రాజ్యాంగం రైతులకు అనుకూలంగా ఉంది.. రైతుల వైపు న్యాయం ఉంటుంది.. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే మాట్లడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతీఒక్కరి భాధ్యత అన్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. రాష్ట్రానికి అమరావతి మాత్రమే వందశాతం రాజధానిగా ఉంటుందనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.  ఇక‌, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి.. వైఎస్సార్ పార్టీ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భాధ్యత మరిచి నా పై పిచ్చి ప్రకటనలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. దేవేంద్ర రెడ్డి తను ప్రేమించే వాళ్లకంటే నేను అందంగా ఉండడం తట్టుకోలేక పిచ్చి ప్రకటనలు చేస్తున్నార‌ని.. “రాజుగారి విగ్గు” ఊడినట్లేనా అన...

చౌక ధరలో రెమెడిసివిర్ ఇంజక్షన్ ను ఆవిష్కరించిన జైడస్ కాడిలా

  శరీరానికి సోకిన కరోనా మహమ్మారిని తరిమేసేందుకు గిలియన్ సైన్సెస్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్ ను జైడస్ కాడిలా చౌక ధరకు ఆవిష్కరించింది. 100 ఎంజీ ఇంజక్షన్ ను తాము రూ. 2,800కు అందించాలని నిర్ణయించామని మార్కెట్లో ఇది 'రెమ్ డాక్' పేరిట అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కరోనాకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ఔషధాన్ని విక్రయిస్తామని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో సంస్థ పేర్కొంది. కాగా, ఇప్పటికే రెమెడిసివిర్ ను నాలుగు కంపెనీలు ఇండియాలో మార్కెటింగ్ చేస్తుండగా, ఇప్పుడు జైడస్ కాడిలా ఐదవ సంస్థగా నిలిచింది. హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లు ఇప్పటికే ఈ డ్రగ్ జనరిక్ వర్షన్ ను విడుదల చేశాయి. గిలియడ్ సైన్సెస్ మొత్తం 127 దేశాల్లోని కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుని రెమెడిసివిర్ తయారీకి అనుమతులను ఇచ్చింది.  

4G-Only iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లో చౌకైన ఫోన్ కావచ్చు

4G -Only iPhone 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని రూమర్ iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని ఊహిస్తున్నారు ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది. iPhone 12 గురించి  నెట్టింట్లో వస్తున్న రూమర్లు నిజమైతే కనుక, ఈ సారి iPhone తీసుకురానున్న iPhone 12 లైనప్ చాలా విస్తృతమైనది మరియు ఉత్తేజకరమైనదిగా ఉండవచ్చు. నెక్స్ట్ జెనరేషన్ ఐఫోన్ సరికొత్త డిజైన్, సన్నని బెజెల్ మరియు 5G  సపోర్ట్ కలిగి ఉందనే రూమర్ ఉంది. ఏదేమైనా, 2021 ప్రారంభంలో 5 జి మద్దతు లేకుండా చౌకైన ఐఫోన్ 12 వస్తుందని కొత్త నివేదిక సూచిస్తుంది.  ఈ ఐఫోన్ 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని, ఈ మోడల్ ధర సుమారు $ 800 (సుమారు రూ .60,000) ఉందవచ్చని మరియు ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది. ఆపిల్ 2021 ప్రారంభంలో, చౌకైన 4G -Only iPhone 1...

Mi TV Lux OLED: అద్దం లాంటి టీవీలను ప్రకటించిన Xiaomi

Mi TV Lux OLED టీవీని, షియోమి ప్రపంచంలో మొట్టమొదటి భారీ 55-అంగుళాల మాస్- ప్రొడ్యూస్ ట్రాన్ఫరెంట్ (పారదర్శక) టీవీలు విడుదల చేసింది. షియోమి యొక్క 10 వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా Mi 10 Ultra మరియు Redmi K30 Ultra స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఈ టీవీని విడుదల చేసింది. ఈ విధమైన ఫీచర్లతో, టెలివిజన్లను భారీగా తయారు చేసిన మొదటి సంస్థగా షియోమి నిలిచింది Mi TV Lux OLED టీవీని, షియోమి ప్రపంచంలో మొట్టమొదటి భారీ 55-అంగుళాల మాస్- ప్రొడ్యూస్ ట్రాన్ఫరెంట్ (పారదర్శక) టీవీలు విడుదల చేసింది. షియోమి యొక్క 10 వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా Mi 10 Ultra మరియు Redmi K30 Ultra స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఈ టీవీని విడుదల చేసింది. క్లియర్ గా చెప్పాలంటే, Xiaomi తీసుకోచైనా ఈ టీవీ  ఆన్ చేసినప్పుడు మీకు Hi-res కంటెంట్ అందిస్తుంది మరియు ఆఫ్ చేసినప్పుడు ఒక గ్లాస్ (అద్దం) మాదిరిగా కనిపిస్తుంది. అంటే, మన కిటికీ అద్దంలాగా అన్నమాట. ఈ విధమైన ఫీచర్లతో, టెలివిజన్లను భారీగా తయారు చేసిన మొదటి సంస్థగా షియోమి నిలిచింది. షియోమి యొక్క ఈ పారదర్శక 55-అంగుళాల టీవీ LG యొక్క పారదర్శక OLED Digital Signage మీద ఆధారపడ...

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

చైనా లో క‌ల‌క‌లం : ఆరు నెల‌ల త‌రువాత విజృంభిస్తున్న క‌రోనా

ఆరునెల‌ల త‌రువాత చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ట్లు తేలింది. చైనా కు చెందిన 68ఏళ్ల మహిళ క‌రోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. చైనా హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌జౌ కు చెందిన బాధితురాలి ఆరు నెల‌ల క్రితం వైర‌స్ సోకి న‌య‌మైంది. మ‌ళ్లీ అదే మ‌హిళ‌కు వైర‌స్ సోక‌డంపై డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వృద్ధురాలి కరోనా సోక‌డంతో ఆమెతో సంబంధం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి వైర‌స్ టెస్ట్ చేసిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ మానవ శరీరం నుండి కరోనావైరస్ ను తొలగించడానికి చాలా సమయం పడుతుందని, ఇది ఒక‌ అరుదైన కేస‌ని ఓ వైరాలజిస్ట్ చైనా స్టేట్ మీడియాతో చెప్పారు. కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురించేస్తోంది. కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని సందర్భాల్లో శరీరంలో వైరస్ మిగిలే ఉంటుందా.. అదే నిజమైతే దేహం నుంచి కరోనా పూర్తిగా తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి...

అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మన కమలా హ్యారీస్

సెలెక్ట్ చేసిన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ కాలిఫోర్నియా సెనెటర్ కు అరుదైన గౌరవం ఈ పదవికి పోటీ పడుతున్న తొలి బ్లాక్ వుమెన్ గా రికార్డు ఇండియన్-అమెరికన్లు, బ్లాక్స్ ను ఆకర్షించేలా బిడెన్ వ్యూహం ఇదినాకు గొప్ప గౌరవం: కమలా హ్యారీస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇండియన్‑అమెరికన్ సెనెటర్ క‌మలా హ్యారీస్ ఎంపికయ్యారు. ఆపార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జోబిడెన్..తన రన్నింగ్ మేట్ గా హ్యారీస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన 55 ఏండ్ల కమలా హ్యారీస్ ప్రొఫెషన్ రీత్యా లాయర్. కమలా హ్యారీస్ తండ్రిది జమైకా. తల్లి ఇండియన్. డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇండియన్–అమెరికన్ సెనెటర్ క‌మలా హ్యారీస్ ఎంపికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జోబిడెన్.. తన రన్నింగ్ మేట్ గా హ్యారీస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. మంగళవారం ఒక టెక్ట‌స్ మెసేజ్ ద్వారా బిడెన్ ఈ విషయాన్ని తన సపోర్ట‌ర్ల‌కు వెల్లడించారు. నవంబర్3న జరిగే అమెరికా ప్రెసిడెన్షియ‌ల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్న బిడెన్.. ఇండ...

నెట్ లో వెతికితే మీ వివరాలు వస్తాయి

వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్న గూగుల్ గూగుల్ ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రతి ఒక్కరి సమాచారం తన సెర్చింజన్ లో దొరికేలా వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనుంది . వీఐపీలు, ఎంట ర్ ప్రిన్యూ ర్ల మొదలుకొని సాధారణ జనం వరకు అంతా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఈ వర్చువల్ విజిటింగ్ కార్డ్ లను ‘పీపుల్ కార్డ్స్ ’గా పిలుస్తారు . ఉదాహరణకు శ్రీనివాస్ అనే వ్యక్తి గూగుల్ ద్వారా వర్చువల్ విజిటింగ్ కార్డ్ తయారు చేసుకుంటే.. ఆయన పేరు ను గూగుల్ లో వెతికితే వివరాలన్నీ వస్తాయి. అంటే సాధారణ విజిటింగ్ కార్డ్ లోఉండే సమాచారం ఆన్ లైన్ లో కనిపిస్తుంది. నెట్లో​ తన వివరాలు ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్ట్​ తెలియజేసింది. ఎలా తయారు చేసుకోవాలంటే .. మొదట గూగుల్ పేజీని ఓపెన్ చేసి మన వివరాలతో సైన్ ఇన్ కావాలి. తరువాత ‘యాడ్ టు మీ టూ సెర్చ్​’ అని టైప్​ చేస్తే, వివరాలు నింపాల్సిందిగా సూచిస్తూ ఒక పేజీ వస్తుంది. ఆ పని పూర్తి చేస్తే పీపుల్ కార్డు తయారవుతుంది. దీనికి ఫొటోలను, సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లనూ జతచేసుకోవచ్చు. వెరిఫికేషన్ కోసం ఫోన్ నంబరు, ...

నిజాయితీగా పన్ను చెల్లించే వారికోసం 'ట్రాన్స్‌పరెంట్' స్కీం.. 'ట్యాక్స్‌పేయర్ చార్టర్'

దేశంలో నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గౌరవించేందుకు, అలాగే ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు(ఆగస్ట్ 13) కొత్త పన్ను పథక ప్లాట్‌ఫాంని ప్రారంభిస్తున్నారు. 'పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం' అనే పేరుతో ఏర్పాటయిన ఓ ప్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్నారు. ప్రధాని దీనిని ప్రారంభించడం ద్వారా దేశంలో ప్రత్యక్ష పన్ను సంస్కరణల ప్రయాణంలో మరో అడుగు ముందుకు పడుతుంది. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల గౌరవం కోసం ట్యాక్స్‌పేయర్ చార్టర్‌ను తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫాం రూపుదిద్దుకుంది. పన్నుచెల్లింపుదారులకు మోడీ థ్యాంక్స్ పన్నుచెల్లింపుదారులకు మోడీ థ్యాంక్స్ నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములు అని, దేశాన్ని కరోనా పీడిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు ఇచ్చిన ఉచిత ఆహారధాన్యం వంటి ప్యాకేజీ పన్ను చెల్లింపుదారుల నిజాయితీతోనే సాధ్యమైందని కూడా ప్రధాని మోడీ ఇదివరకే ప్రశంసించారు. వారికి థ్యాంక్స్ చెప్పారు. ట్యాక్స్‌పేయర్ చార్టర్ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ అసో...

గుడ్‌న్యూస్‌... భారీగా ప‌డిపోయిన ప‌సిడి ధ‌ర‌

వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుడు అందుకోనంత ఎత్తుకు దూసుకెళ్లిన బంగారం ధ‌ర క్ర‌మంగా కింద‌కు దిగుతోంది. ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన ప‌డిసి ధ‌ర‌.. నాలుగు రోజులుగా ప‌డిపోతోంది... నిన్నటి వ‌ర‌కు వంద‌ల్లో త‌గ్గ‌గా.. ఇవాళ ఏకంగా వేల‌ల్లో ప‌డిపోయింది. పసిడి ప్రేమికులకు శుభార్త చెబుతూ రూ.3వేల‌కు పైగా త‌గ్గింది. హైద‌రాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించి రూ.54,680కి ప‌డిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 ప‌డిపోయివ‌డంతో రూ.50,130కు దిగివ‌చ్చింది. అయితే, ప‌సిడి ధ‌ర ప‌డిపోయినా వెండి కాస్త పైకి క‌దిలింది.. రూ.50 పెర‌గ‌డంతో.. కిలో వెండి ధ‌ర రూ.72,550కు చేరింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ప్ర‌భావం దేశీ మార్కెట్ల‌పై స్ప‌ష్టంగా చూపిస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1944 డాలర్లకు దిగివ‌చ్చింది.. ఇక‌, కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ధ‌ర ప‌డిపోయినా చాలా ప్ర‌భావాన్ని చూపించ‌నుంది.. బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ పై స్ప‌ష...

సుశాంత్ సింగ్ పై అభిమానం... 'సడక్-2'పై ఆగ్రహమైంది!

  సంజయ్ దత్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా, ఆలియా తండ్రి మహేశ్ భట్ నిర్మించిన 'సడక్-2' ట్రయిలర్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డులను క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదల కాగానే, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై ఉన్న అభిమానం, ఈ ట్రయిల్ పట్ల శాపమైంది.  బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారన్న ఆరోపణలు, గతంలో మహేశ్ భట్, సుశాంత్ కు అన్యాయం చేశారన్న పుకార్ల నేపథ్యంలో, ఈ వీడియోకు అత్యధిక డిస్ లైక్స్ రావడం గమనార్హం. ఇక ఈ సినిమా ట్రయిలర్ కింద సుశాంత్ కు న్యాయం జరగాల్సిందేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రయిలర్ కు ఏకంగా 30 లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక డిస్ లైక్ లు వచ్చిన ట్రయిలర్ గా ఇది నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.  

నటుడు దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం

  టాలీవుడ్ యువ నటుడు దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనేందుకు హైదరాబాద్‌లోని మణికొండ వచ్చాడు. అక్కడ కారు యజమానిని కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని సతీశ్ అనే స్నేహితుడితో కలిసి వెళ్లాడు.  ఈ క్రమంలో పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బీఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నిన్న సాయంత్రం రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు, అభిరామ్‌లకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా ఎవరూ మద్యం మత్తులో లేరని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరో సినీ ద‌ర్శ‌కుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ

  ఆర్ఎక్స్ -100 సినిమా దర్శకుడు అజ‌య్ భూప‌తికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'త్వ‌ర‌లో వ‌స్తా.. ప్లాస్మా ఇస్తా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయ‌న కరోనా నుంచి త్వరగా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆర్ఎక్స్ -100 టైటిల్‌తో తీసిన తొలి సినిమాతోనే అజయ్ భూపతి సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆయన ప్ర‌స్తుతం 'మ‌హా స‌ముద్రం' అనే సినిమా ప‌నుల‌ను పూర్తి చేసుకుంటున్నారు. క‌రోనా వ్యాప్తి కట్టడయ్యాక ఈ సినిమా షూటింగ్ కొనసాగించనున్నారు. కాగా, ఇప్పటికే సినీ పరిశ్రమలో పలువురికి కరోనా సోకిన విషయం తెలిసిందే.  

ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త!

గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త....  గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఈ కంపెనీలు రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై ప్రస్తుతం చర్చిస్తున్నాయి. ఎన్‌పీసీఐతో ఈ కంపెనీల చర్చలు సఫలం అయితే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నెలవారీ బిల్లులను సులభంగా చెల్లించొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్ గా చెల్లించవచ్చు. వాటి చెల్లింపులకు చివరి తేదీ ఎప్పుడు, ఎలా చెల్లించాలి తదితర విషయాల గురించి ఇక ఆలోచించాల్సిన పని ఉండదు. దాదాపు నెల రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా కంపెనీల వర్గాల ద్వారా తెలుస్తోంది .