Skip to main content

Posts

Showing posts from September 3, 2020

పవన్ కల్యాణ్ ట్వీట్ తో ఆనందంలో మునిగిపోయిన సత్యదేవ్!

 టాలీవుడ్ లో తనను తాను నిరూపించుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సత్యదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యదేవ్ ట్వీట్ పై పవన్ స్పందించారు. 'థాంక్యూ సత్యదేవ్ గారు. మీ తాజా చిత్రం 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'లో మీ పర్ఫామెన్స్ ను చాలా ఎంజాయ్ చేశా. ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశారు. పవన్ స్పందనపై సత్యదేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'ధన్యవాదాలు సార్. మీ బర్త్ డే సందర్భంగా మీరు ఇచ్చిన బహుమతిని మర్చిపోలేను. మీ ట్వీట్ తో మా 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' టీమ్ మొత్తం సంతోషపడుతోంది' అని సత్యదేవ్ ట్వీట్ చేశారు.

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. సీఎం జగన్‌కు సుబ్రహ్మణ్య స్వామి కృతజ్ఞతలు

 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరిగే ఆడిట్‌పై విమర్శల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆడిట్‌ను ఇకపై నుంచి  కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ద్వారా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాలకమండలి సిఫార్సు చేసింది. 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించారు. దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి కోరింది. వీటిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక టీటీడీ తాజా నిర్ణయంపై సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్నది గొప్ప నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం వెల్లడి చేసినందుకు ఏపీ సీఎం జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో కాగ్‌తో ఆడిట్ చేయించడానికి అంగీకరించారని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దీనిపై స్పందించిన వైవీ సుబ...

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ

సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించారు. తెలుగులో బోధన వల్ల పాఠశాలల్లో నమోదు తగ్గిపోతోందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టేకూడా ఇవ్వాలని విశ్వనాథన...