బ్రాండ్ అంటే..? ఆ పేరులో ఒక గుర్తింపు ఉంటుంది. ఆ పేరుకి ఒక గౌరవం ఉంటుంది. ఆ పేరుకి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న కంపనీనే మేఘా ఇంజినీరింగ్. ప్రస్తుతం దేశంలో భారీ ప్రాజెక్ట్స్ అన్నిటికి ఈ సంస్థే కేరాఫ్. అలాంటి మేఘా చుట్టూ ఇప్పుడు వివాదాలు. అయితే అవి రాజకీయ వివాదాలు. సంస్థ పేరుని దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు, ప్రత్యర్దులు సృష్టిస్తున్న వివాదాలు.అందుకే ఇప్పుడు అసలు మేఘా చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందాం. దేశంలో అన్లిస్టెడ్ కంపెనీల్లో మొదటిస్థానానికి చేరుకుని ఎన్నో వేల కుటుంబాకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశం ప్రగతిలో తాము సైతం అని ముందుకు వెళుతున్న మేఘా వెనుక ఉన్న ఏకైక శక్తి ఆ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యం కోసం ఈ సంస్థను నడపడం లేదు. యాజమాన్యం కోసం ఈ కంపెనీ పనులు చేయాల్సిన పరిస్థితులు లేవు. యాజమాన్యం ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉంది. ఇప్పుడు కంపెనీ నడుస్తున్నదల్లా అందులో పనిచేస్తున్న 15 00 వేలకుపైగా ఉద్యోగులు, పరోక్షంగా దాదాపు 2 లక్షల మంది కి రోజూ పనికల్పించడంకోసం. ఇక ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఏటా వేలకోట్ల రూపాయలు సమకూరుస్తోంది. అదే...