Skip to main content

Posts

Showing posts from October 1, 2019

సైరా' సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

చిరంజీవి హీరోగా వస్తున్న సైరా చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. అయితే, తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎదురయ్యే రద్దీ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కొణిదెల ప్రొడక్షన్స్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పట్ల ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించింది. సైరా చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేసింది. వారం రోజుల పాటు సైరా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటలవరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. తద్వారా రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ సులభతరం అవుతుందని ప్రభుత్వం కూడా అంగీకరించింది.

మార్కెట్‌లోకి బొంగు బాటిళ్లు.. ప్లాస్టిక్‌కు గుడ్‌ బై చెప్పండి..

వీటితో పాటు ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూల వంటి ఉత్పత్తులను అక్టోబరు 2 నుంచి ఖాదీ స్టోర్లలో అమ్ముతారు. ఇలాంటి వాటితో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి సింగిల్ యూస్ (ఒకసారి మాత్రమే వాడగలిగే) ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది కేంద్రం. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు. వాడకూడదు. నిల్వ చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ కోసమే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే ప్లాస్టిక్‌ బ్యాన్ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది కేంద్రం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు శాఖ (MSME) కింద పనిచేసే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) వెదురు బాటిళ్లను తయారు చేస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు శాఖమంత్రి నితిన్ గడ్కరీ బొంగు బాటిల్‌ను లాంచ్ చేశారు. కేవీఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బాటిళ్లను తయారు చేశారు. ప్రకృతిలో పెరిగే ఈ బొంగులతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పైగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 750 మిల్...

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

రైలు ఆలస్యమైతే పరిహారం... రైల్వేమంత్రి సంచలన ప్రకటన.

భారత రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-లక్నో మధ్య నూతనంగా ప్రారంభం కానున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రైలు ఆలస్యమైతే పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రైలు గంట ఆలస్యమైతే ప్రయాణికులకు రూ.100 రూపాయలు, 2 గంటలు ఆపైన ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.   అంతేకాదు.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా ఐఆర్‌సీటీసీ అందించనుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికుల వస్తువులు చోరీకి గురైనా, దోపిడీ జరిగినా ఇదే ప్రయాణ బీమా ద్వారా రూ.లక్ష వరకు పరిహారమిచ్చే అవకాశం కూడా ఉంది. తాజా నిర్ణయంతో రైలు ఆలస్యానికి పరిహారం చెల్లించే తొలి రైలుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలిచ్చింది. రెండు వారాలపాటు సచివాలయం కూల్చివేత పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయవద్దని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరుపరి ఉత్తర్వులు దసరా సెలవుల తర్వాత వెల్లడిస్తామని, అప్పటివరకు ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది.

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతాం... సీపీఐ నారాయణ

హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ క్రమంలో సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమతో సరిగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలిసివచ్చే పార్టీలను సమన్వయం చేయడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలం అయ్యారని నారాయణ ఆరోపించారు. సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో వారికి మద్దతు ఇవ్వలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతామని స్పష్టం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు సీపీఐ ముఖ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ దోస్తీ స్పష్టమైంది.

భారతీయత ఆత్మ పల్లెల్లోనే ఉందన్న మహాత్ముడి పలుకులే మాకు ఆదర్శం: సీఎం జగన్

అక్టోబరు 2న జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బాపూజీ బోధనలే స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. బాపూజీ 150 జయంతి వేళ ఆయన స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని, గ్రామస్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ద్వారా నెరవేర్చుతున్నామని తెలిపారు. భారతీయత ఆత్మ పల్లెల్లోనే ఉందన్న గాంధీజీ పలుకులే తమకు ఆదర్శం అని వ్యాఖ్యానించారు. రైతులు, పేదలు, బలహీనవర్గాల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మద్యపాన నిషేధంలో భాగంగా 4 నెలల్లోనే 43 వేల మద్యం బెల్టు షాపులను మూసివేశామని వెల్లడించారు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా 4,380 నుంచి 3,500కి తగ్గించామని జగన్ చెప్పుకొచ్చారు

వివేకాను చంపినవాళ్ల పేర్లను జగన్ దాచిపెడుతున్నారు: వర్ల రామయ్య

ఎన్నికల ముందు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. తన బాబాయిని చంపింది ఎవరో జగన్ కు తెలుసని, కానీ ఆయన వాళ్ల పేర్లను దాచిపెడుతున్నారని ఆరోపించారు. కేసు విచారణ కీలకదశలో ఉన్న తరుణంలో కడప ఎస్పీని బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హంతకులు ఎవరన్నది ఎస్పీకి తెలుసని, అందుకే ఆయనను బదిలీపై పంపించి వేశారని తెలిపారు. ఎన్నికల ముందు విపక్షంలో ఉన్న జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

‘సైరా’ పూర్తయింది.. బాధేస్తోంది: చరణ్‌ సినిమాకు ఒక్కరోజు ముందు చెర్రీ ఎమోషనల్‌ పోస్ట్‌

‘సైరా’ పూర్తయింది.. బాధేస్తోంది: చరణ్‌ సినిమాకు ఒక్కరోజు ముందు చెర్రీ ఎమోషనల్‌ పోస్ట్‌ చదవండి

కోడెల కుమారుడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్

మొత్తం ఐదు నాన్ బెయిలబుల్ కేసులలో హైకోర్టు కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా నరసరావుపేటలో అడుగుపెట్టకూడదన్న కోర్టు మూడు నెలల పాటు వారంలో మూడు రోజులు విజయవాడ సీపీ ఆఫీసుకెళ్లి సంతకం చేయాలని షరతులు విధించింది.

ఏపీలో బార్ల విషయంలో మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: మంత్రి నారాయణస్వామి వెల్లడి

రాష్ట్రంలో నేటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను 20 శాతం తగ్గించామని, దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయని వివరించారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్యానించిన మంత్రి, నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్ముందు మద్యపాన నిషేధంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్ముతామని చెప్పారు. అయితే, రాష్ట్రంలో బార్ల విషయంలో మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల వరకు బార్లకు అనుమతిచ్చారని నారాయణస్వామి వెల్లడించారు. దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

కేసీఆర్ కు తెలియని బ్రాండ్లా... జగన్ తో మాట్లాడింది మద్యం బ్రాండ్ల గురించే!: పంచుమర్తి అనురాధ విసుర్లు

ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించారు. రూ.50, రూ.60 ఉన్న మద్యం సీసాలపై రూ.250 పెంచితే రాష్ట్రంలో మద్యం మాఫియా పెరగదా అని నిలదీశారు. ఓ బాటిల్ పై ఏకంగా రూ.250 పెంచడం అంటే నిరుపేదలను దోపిడీ చేయడమేనని అన్నారు. నిషేధం ముసుగులో మద్యం తయారీదారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. "ప్రజలు ఏ బ్రాండు తాగాలో జగన్ చెబుతారంట! ఏ బ్రాండు తాగాలో మీకెందుకు? ఉద్యోగ కల్పన చేయాల్సిన ముఖ్యమంత్రి బ్రాండ్లు నిర్ణయించడమేంటి? ఆ బ్రాండ్ల ముసుగులో రూ.2000 కోట్లు దోచేస్తారా? మొన్న కేసీఆర్, జగన్ గంటల కొద్దీ చర్చించింది బయటపెట్టలేదు, కానీ ఇప్పుడర్థమవుతోంది ఇద్దరూ మాట్లాడుకుంది బ్రాండ్ల గురించేనని. ఎందుకంటే కేసీఆర్ కు ఏ బ్రాండైనా తెలుసు. ఏ బ్రాండ్ కు ఎంతొస్తుంది? ఏ బ్రాండ్ ఏ కంపెనీ అమ్ముతుంది? మనకొచ్చే లాభమెంత? మన జేబులో ఎంత వేసుకోవచ్చు?... ఇవీ కేసీఆర్, జగన్ మధ్య జరిగిన చర్చలు" అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 20 శాతం మద్యనిషేధం చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు, ఎక్కడ మద్య నిషేధం అమలు చేశార...

గాంధీ కోరుకున్న సుపరిపాలన అందించడమే నిజమైన నివాళి: పవన్ కల్యాణ్

అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సందేశం అందించారు. మహాత్ముని మార్గం సదా ఆచరణీయం అంటూ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అనే పేరు స్మరించుకుంటే చాలని, భారతీయుల మనసంతా పవిత్రంగా మారిపోతుందని తెలిపారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసింది గాంధీయేనని, ఆయన 150వ జయంతిని ప్రతి ఒక్క భారతీయుడు ఓ వేడుకలా జరుపుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఐన్ స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మేధావులను సైతం గాంధీజీ ప్రభావితం చేశారని, ఆయన బోధించిన అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి ఆయుధాలు, స్వతంత్ర సాధనలో ఆయన అనుసరించిన మార్గాలు ఇవాళ్టికీ ఆచరణీయమేనని కొనియాడారు. ఆ మహనీయుడు కోరుకున్న సుపరిపాలన అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సైరా' విడుదల నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్ర పోషించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది. ఈ నేపథ్యంలో, సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. తన మిత్రుడు చిరంజీవి మంచి నటుడని కితాబిచ్చారు. 'చిరంజీవి కుమారుడు చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన 'సైరా' అత్యద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు. నిర్మాతగా వ్యవహరించిన చరణ్ కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరుప్రఖ్యాతులు కూడా రావాలని మనసా వాచా కోరుకుంటున్నానని బెస్టాఫ్ లక్ చెప్పారు.

జగన్ సంచలన నిర్ణయాలు.సంకట స్థితిలో సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు. ప్రధానంగా పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: పరశీలించడం లాంటి నిర్ణయాలను అమలు చేయడానికి మిగితా రాష్ట్రాలు పూనుకుంటున్నాయి.ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమో గాని జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పొరుగు రాష్ట్రం తెలంగాణా సీఎం కేసీఆర్ ను చిక్కుల్లోకి నెడుతున్నాయి. ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా జగన్ ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఇందులో ప్రధానమైనది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని పనిని చేసి చూపించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు తాను హామీ ఇచ్చిన విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.ఆర్టీసి విలీనానికి తోడు తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే…గన్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు...

వచ్చే 60 రోజుల్లో మార్పు కనిపించాలి: సీఎం జగన్‌

రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారులు ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చడానికి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణ చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని అన్నారు. సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయండి. జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి ...

12 కొత్త జిల్లాలకే జగన్ పరిమితం: ఆ జిల్లాలు ఇవే....

గత కొన్ని రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక చర్చలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై  ప్రభుత్వ వర్గాలనుంచి వచ్చిన ఒక లీకు నేపథ్యంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం గురించి గవర్నర్ విశ్వభూషణ్ కు కూడా వివరించాడనే వార్త వెలుగులోకి రావడంతో నూతన జిల్లాల ఏర్పాటు ఖాయమని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే వార్త దాదాపుగా ఖచ్చితమని తేలేలా కనపడడంతో ఇప్పుడు చర్చ ఇంకాస్త ముందుకెళ్లి కొత్త జిల్లాలుగా వేటిని ప్రకటిస్తారనే కుతూహలం సర్వత్రా నెలకొంది. జగన్ ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఈ విషయమై అధికారంలోకి రాగానే అధికారులను ఈ విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వవలిసిందిగా ఆదేశించారు. జగన్ ఆదేశాలను అందుకున్న అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు కూడా. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జనాభా నిష్పత్తి, నియోజకవర్గాల రేజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకొని నూతనంగా 12 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది....

ప్రజాధనంతో ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారు: జగన్ సర్కార్ పై కన్నా ఫైర్

జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రజా ధనంతో కేవలం ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు. నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చి నెల రోజులు కావస్తున్నా... సామాన్యుడికి ఇసుక లభ్యం కావడం లేదని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఏపీలో అమలు కావడం లేదని... ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 4న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఇసుక కొరతపై 7న భిక్షాటన చేపడతామని... 11న పోలవరంలో పర్యటిస్తామని తెలిపారు. పారిపాలనలో టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి తేడా లేదని అన్నారు. ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి బీజేపీ అద్దె మైకులా పని చేయదని చెప్పారు.

అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే.. ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు: విజయసాయిరెడ్డి

అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎన్టీపీసీ సహా విద్యుత్ సంస్థలకు రూ. 20 వేల కోట్లపైనే బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. జెన్ కోను ధ్వంసం చేసి ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టారని అన్నారు. డిస్కమ్ లను అప్పుల్లో ముంచిన చంద్రబాబు... ఇప్పుడు చీకటి రోజులు వచ్చాయంటూ దొంగ ఏడుపు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ తో 1.27 లక్షల ఉద్యోగాలు వచ్చాయని... ప్రతి ఏటా నియామకాలు ఉంటాయని సీఎం జగన్ ప్రకటించారని విజయసాయి అన్నారు. బిగ్గరగా ఏడవండి చంద్రబాబు గారూ... మీ శాపనార్థాలు నిరుద్యోగులకు ఆశీర్వాదాలుగా మారతాయి అని వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్మారక సభలో కూడా పోలవరం రివర్స్ టెండరింగ్ నే చంద్రబాబు కలవరించారని సాయిరెడ్డి అన్నారు. గతంలో రూ. 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా సంస్థ ఇప్పుడు తక్కువకు ఎలా కోట్ చేసిందని గగ్గోలు పెడుతున్నారని... కమిషన్ల కోసం అప్పుడు మీరు కక్కుర్తి పడ్డారని, ఇప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్...

సైరా నరసింహారెడ్డి’ విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు బయోపిక్ అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా ఎవరి జీవితంపై తెరకెక్కింది కాదని సైరా చిత్ర యూనిట్ ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన తెలుగు సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిఈ సినిమా విడుదల చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై హైకోర్టు స్పందించి సినిమా చూడాలా లేదా అనే విషయం ప్రజలపై ఆధారపడి ఉంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ సినిమాను ఆపలేమని స్పష్టం చేసారు.

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్

ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం కోర్టు ఎదుట లొంగిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని శివరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. కేట్యాక్స్ పేరుతో ఆయన వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అతనితో పాటు ఆయన సోదరిపై కూడా పలువురు బాధితులు 19 కేసులు పెట్టారు. అయితే ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో శివరామ్ ఇవాళ గుంటూరు జిల్లా నరసరావు పేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపొయారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.అయితే శివరామ్‌కు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్‌.. మోదీ అలా అన‌లేదట‌

ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన హౌడీ మోదీ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అని ప్ర‌ధాని మోదీ అన్న విష‌యం తెలిసిందే. అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ రెండ‌వ సారి పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ స‌భ‌లో మోదీ మాట్లాడుతూ ఆ కామంట్ చేశారు. అయితే మోదీ అలా అన‌లేద‌ని ఇవాళ విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోదీ కామెంట్‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌న్నారు. మోదీ చెప్పిన మాట‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన్నారు. 2020లో జ‌ర‌గ‌నున్న అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా మాట్లాడ‌ర‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. అయితే మోదీ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన‌డాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థ‌త్వాన్ని క‌ప్పిపుచ్చుత‌న్న కేంద్ర మంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంత‌ర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో కాస్త మోదీకి నేర్పాలంటూ జైశంక‌ర్‌ను కోరారు.

విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి..!

లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌వోసి) రాష్ట్రప్రభుత్వం ఇవ్వడంతో కేంద్రప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ముందస్తుగా నగదు చెల్లించలేదని కెఎస్‌కె అనే ప్రైవేట్‌ కంపెనీ ఫిర్యాదు చేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యుత్‌ సంస్థలను కేంద్రప్రభుత్వం బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా పవర్‌ ఎక్సైంజ్‌లో రాష్ట్రం విద్యుత్‌ కొనుగోలు చేసుకునేందుకు వీలు లేకుండా కేంద్రం చేసింది. రాష్ట్రప్రభుత్వం నగదు జమచేయడంతో కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నట్లు సోమవారం సదరన్‌ రీజనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఆర్‌ఎల్‌డిసి) వెబ్‌సైట్‌లో పేర్కొంది. కెఎస్‌కె థర్మల్‌ కేంద్రానికి రూ.120 కోట్లు రాష్ట్రప్రభుత్వం సోమవారం చెల్లించడంతో ఎక్సెంజ్‌లో రాష్ట్ర డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో శని, ఆదివారాలతో పోల్చుకుంటే సోమవారం రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు కూడా తగ్గాయి. ఆదివారం 6879 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా అందుబాటులో 6670 మెగావాట్లు ఉంది. 200 మెగావాట్లు లోటు ఉంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం డిమాండ్‌ పెరిగింది. 7,200 మెగవాట్ల అవసరం కాగా అందుబాటులో 6,940 మెగావాట్లు ఉంది. 9...

శ్రీవారికి ముఖ్యమంత్రి తులాభారం: జగన్ వెయిట్ ఎంతంటే....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి తులాభారం సమర్పించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం అనంతరం స్వామివారికి తులాభారం సమర్పించారు. బియ్యాన్ని స్వామివారికి తులాభారంగా సమర్పించారు. 80 కేజీల బియ్యాన్ని సీఎం జగన్ తులాభారంగా సమర్పించారు. జగన్ తులాభార సమయంలో మంత్రులు ప్రజా ప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు. తులాభారం వేస్తున్నప్పుడు సీఎం జగన్ ముసిముసి నవ్వులు ప్రదర్శించారు. నాయకులు తన వెయిట్ తెలుసుకుంటున్నారని తెలుసుకుని జగన్ అటూ ఇటూ చూస్తు నవ్వసాగారు. అటు ప్రజాప్రతినిధులు సైతం జగన్ వెయిట్ పై ఆసక్తిగా చూశారు. ఇకపోతే అంతకుముందు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయ ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ తలపై స్వామివారి శేష వస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్లారు సీఎం జగన్. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన సీఎం జగన్ గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకు పట్టు వస్త్ర...

వైసీపీ ప్రభుత్వానికి జనసేన వార్నింగ్, జనసైనికులకు నాదెండ్ల సూచన

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శించినందుకు గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన వాసా శ్రీనివాసరావు అనే జనసేన పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. పోలీస్ శాఖపై జనసేన పార్టీకి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు వాక్ స్వతంత్రాన్ని హరించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన రాజకీయ విమర్శల ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయరాదని స్వయంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సైతం మంగళగిరి పోలీసులు కాలరాశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక రాజకీయ విమర్శపై ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం సరికాదని హితవు పలికారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగష్టు 24న వైసీపీ సోషల్ మీడియాలో విభాగం సోషల్ మీడియాలో రాసిన...

నేటి నుంచి అన్ని బ్యాంకులకు ఒకే రకమైన పనివేళలు

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళలు నేటి నుంచి మారనున్నాయి. ఇక నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నేటి నుంచి ఇదే సమయ పాలనను పాటిస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. ఇక, ప్రతి ఆదివారంతోపాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులు యథావిధిగా మూతపడతాయి.

మూల విరాట్‌ను తాకని సూర్యకిరణాలు.. అరసవిల్లిలో భక్తుల నిరాశ

శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి భక్తులు నేడు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేడు స్వామి వారి మూలవిరాట్‌ను తాకాల్సిన సూర్యకిరణాలు మేఘాల కారణంగా ప్రసరించలేదు. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో భానుడి కిరణాలు స్వామి వారి పాదాలను తాకలేకపోయాయి. రేపు కూడా సూర్యుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్‌ను తాకుతాయి. అయితే, ఇందుకు వాతావరణం కరుణించాల్సి ఉంటుంది.

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన జగన్ సర్కార్.. హర్షం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలంటూ... ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, నేడు పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు తమ సర్వీసుల్లో మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. మరోవైపు, పదవీ విరమణ వయసును పొడిగించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీలోని 52 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ఈ సందర్భంగా తెలిపారు.