తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి రెండు పేజీల లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని, రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దిగజారాయన్నారు. ప్రాథమిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రతినిధులు, సంఘవిద్రోహ శక్తుల ద్వారా...శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చీరాలలో వైసీపీ నేత ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, గతంలో ఏపీ పోలీసులకు సమర్థులు అనే పేరు ఉండేదన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని చంద్రబాబు సూచించారు.
Comments
Post a Comment