Skip to main content

Posts

Showing posts from August 4, 2020

సీక్రెట్‌ రివీల్‌: తన వయసెంతో చెప్పిన హాట్‌ యాంకర్ అనసూయ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న హాట్ బ్యూటీ అనసూయ. జబర్థస్త్ షోతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. అయితే గ్లామర్ ఫీల్డ్‌ ఉన్న బ్యూటీ తన వయసు గురించి కామెంట్ చేసేందుకు పెద్దగా ఇష్టపడరు, కానీ ఇటీవల ఓ షోలో పాల్గొన్న అనసూయ తన వయసెంతో బయటపెట్టింది. న్యూస్‌ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఎంటర్‌టైన్మెంట్‌ యాంకర్‌గా మారిన బ్యూటీ అనసూయ. జబర్దస్త్‌ షోతో అనసూయ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. గ్లామరస్‌ యాంకర్‌గా కొనసాగుతూనే ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది అనసూయ. అయితే అందరికీ అనసూయ న్యూస్‌ యాంకర్‌గా మాత్రమే పరిచయం, కానీ అంతకు ముందే ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన నాగ సినిమాలో చిన్న రోల్ లో నటించింది. అంటే 16 ఏళ్ల కిందే నటిగా వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ ఈ నేపథ్యంలో అనసూయ వయసెంత అన్న అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలపై ఇటీవల ఓ షో ద్వారా క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఓ టీవీ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనసూయ షోలో భాగంగా తన వయసు ఎంతో వెల్లడించింది.

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ హైకోర్టు స్టే

మూడు రాజధానుల బిల్లుపై  ఈ నెల 14 వరకూ  స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

చైనాకు చెందిన యాప్‌లను నిషేధించాలంటూ అమెరికాలో డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సంస్థ కార్యాలయాన్ని వేరే దేశానికి మార్చాలని టిక్‌టాక్‌ ప్రయత్నిస్తుండగా,  టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు చేశారు. తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తామని చెప్పారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను తమ దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి 6 వారాల గడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అంటే సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగియాలని చెప్పారు. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్ద సంస్థకు విక్రయించాలని ఆయన చెప్పారు. భద్రత విషయంలో తమకు ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని తెలిపారు. కాగా, టిక్‌టాక్‌ యాప్ కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్‌ కూడా తెలిపిన విషయం తెలిసిందే....

కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కరోనా మృతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ. 15 వేలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్లాస్మాను దానం చేసే వారికి రూ. 5 వేలు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. దీని కోసం జిల్లా కలెక్టర్లకు రూ. 12 కోట్ల చొప్పున విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

గుంటూరు జిల్లాలో దారుణం.. అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టరుతో తొక్కి చంపిన వైనం!

గుంటూరు జిల్లా నకిరేకల్లు శివారులోని శివాపురం తండాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. పొలం తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ట్రాక్టరుతో తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రమావత్ మంత్య్రానాయక్ , మంత్రుబాయి (55) దంపతులు తమకున్న రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. సాగుతోపాటు ఇతర అవసరాలకు రెండేళ్ల క్రితం వీరు నకిరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద పొలం తాకట్టుపెట్టి రూ. 3.80 లక్షలు అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించాలంటూ గత కొంతకాలంగా శ్రీనివాసరెడ్డి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. లేకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ క్రమంలో బాధిత దంపతులు పొలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి ట్రాక్టరుతో తండాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించాడు.  అయితే, పొలం సాగు చేసుకుని కొంచెంకొంచెంగా అప్పు తీరుస్తామని చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో వారి మధ్...

దారి పొడుగునా జడ్జిలకు దణ్ణాలు పెట్టిన అమరావతి రైతులు

 అమరావతి రైతుల మానవహారం మూ డు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్‌ యాక్సిస్‌ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు.  ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా  సీఆర్డీఏ బిల...

ప్రజాకవి వంగపండు ప్రసాదరావు కన్నుమూత

ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన  ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు. 1972లో  జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు  2017లో కళారత్న పురస్కారం లభించింది. వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.