Skip to main content

నేనైతే అలాంటి ఇంట్లో ఉండను.. చంద్రబాబు ఖాళీ చేయాలి!: బీజేపీ ఎంపీ సుజనా చౌద



ఉండవల్లి కరకట్టపై ఇంట్లో చంద్రబాబు నివాసం ఉండటంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే, అక్కడ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టలేదని తెలిస్తే ‘నేను అయితే అలాంటి ఇంట్లో ఉండను. అప్పుడు వారు (చంద్రబాబు) ఉన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలి. దాని గురించి ఇంత చర్చ ఏంటి?’ అని ప్రశ్నించారు. ఆ ఇంటిని ప్రభుత్వం కనుక పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇంటి గురించి లేదా రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయన్న ఆరోపణలపైనా మాట్లాడటమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాపైనా విమర్శలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ దొందూదొందేనని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

Comments