Skip to main content

Posts

Showing posts from August 7, 2020

కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో రెండు ముక్కలైన విమానం... పైలెట్ సహా ఇద్దరి మృతి

 వీడియో చూడండి:  https://youtu.be/K03pgzNfVaQ భారీ వర్షాలతో అల్లాడిపోతున్న కేరళలో విమాన ప్రమాదం జరిగింది. కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం రన్ వేపై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ సహా ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.  దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. ప్రమాదంలో ఈ బోయింగ్ విమానం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం కోజికోడ్ విమానాశ్రయంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన వారిని కోజికోడ్ లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు కరోనా

  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది, ఆ విషయం ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని… డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే

బీర్లకు తగ్గిన డిమాండ్..ఎందుకంటే..!

కరోనా ఎఫెక్ట్ బీర్ల అమ్మకాలపై కూడా పడింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ విషయం తెలంగాణ మద్యం అమ్మకాల లెక్కల ద్వారా భయటపడింది. ఆల్కహాల్ బెవరేజస్‌లో విపరీతంగా అమ్ముడుపోయే ఆల్కహాల్ బీర్ కాగా ఇప్పుడు బీర్లు కొనాలంటేనే భయపడుతున్నారు. చల్లని బీర్లు తాగితే జలుబు రావచ్చనే కారణంగానే వాటిని తాగటానికి మందుబాబులు భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో బీర్ల అమ్మకాలు తగ్గాయని షాపు యజమానులు చెబుతున్నారు. మరోవైపు సాధారణ రోజుల్లో జరిగిన పార్టీలు, వేడుకలతో పోలిస్తే ప్రస్తుతం పార్టీలు, వేడుకలు కూడా తగ్గటం మరో కారణమని అంచనావేస్తున్నారు. హైదరాబాద్ లోను గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగగా 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగగా బీరు అమ్మకాలు మాత్రం 22.99 లక్షల కేసులు జరిగాయి. ఈ లెక్కలు చూస్తుంటే బీర్ల అమ్మకాలు సగానికి పడిపోయినట్టు తె...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ

  ఏపీలో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ సర్కారు ఇంతకుముందే పేర్కొంది. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ ప్రకటించారు. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రిమండలి నిర్ణయం మేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఈ అధ్యయన కమిటీకి సీఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. కాగా, 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు నిర్దేశించారు.

అర్ధనగ్న శరీరంపై బొమ్మలు వేయించుకున్న ఉద్యమకారిణికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

 సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అర్ధనగ్న శరీరంపై తన పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న కేసులో బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇలాంటి కేసు రావడం వల్ల కొంచెం కంగారు పడ్డామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల మన దేశ సంస్కృతిపై పిల్లలు ఎలాంటి భావాన్ని ఏర్పరుచుకుంటారని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు రావడమే దారుణమని చెప్పింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చని... అయినప్పటికీ ఇలాంటి వాటిని అనుమతించలేమని తెలిపింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం ధరలు

  బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి బంగారం ధర చేరగా.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర(24 క్యారెట్లు) రూ.58,330కు చేరింది. రెండ్రోజుల వ్యవధిలో రూ.వెయ్యి పెరిగిన బంగారం ధర.. భవిష్యత్తులో రూ 65000 వరకు వెళ్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు కిలో వెండి ధర రూ.78,300కు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఏకంగా 2055 డాలర్ల ఆల్‌టైం హై కి చేరింది. అంతర్జాతీయం అమెరికన్‌ డాలర్‌ కూడా బలహీనపడటం, మదుపరులు పెట్టుబడులు షేర్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ సేఫ్ గా భావించడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అటు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికన్‌ డాలర్‌ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశం ఆశిస్తున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ సహా 31 మందిపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు

కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. జేసీ విడుదల సందర్భంగా కడప జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కడప జైలు వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, జేసీ పవన్ సహా 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు.  కొవిడ్ నియమావళిని ఏమాత్రం పట్టించుకోలేదన్న కారణంతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. నిన్న జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి అంతలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. కడప నుంచి ఆయన తాడిపత్రికి చేరుకునే క్రమంలో భారీ కాన్వాయ్ తరలి వచ్చింది. దీనిపై తాడిపత్రి సీఐ దేవేందర్ అభ్యంతరం వ్యక్తం చేయగా, జేసీ ఆయనపైకి దూసుకెళ్లడం మీడియాలో కనిపించింది. ఈ అంశంలోనూ జేసీపై కేసు నమోదైంది.  

పవన్ కల్యాణ్ ను కలిసిన సోము వీర్రాజు

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పవన్ ను సోము వీర్రాజు కలవడం ఇదే తొలిసారి. ఏపీలో జనసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ ను వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజుకు శాలువా కప్పి పవన్ అభినందించారు. అనంతరం ఇరువురు కలిసి పలు విషయాలపై చర్చించారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీలు ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, నిన్న సినీ నటుడు చిరంజీవిని కూడా సోము వీర్రాజు  కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజును అభినందించిన చిరంజీవి... ఏపీ అభివృద్ధిలో జనసేన, బీజేపీ భాగస్వాములు 

ఒకే దేశం - ఒకే విద్యా విధానం: మోదీ

 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విద్యా విధానంతో విద్యా వ్యవస్థ రూపు రేఖలు మారిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ విద్యా విధానంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విద్యా విధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కొత్త విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని... ఇదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని మోదీ చెప్పారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని  తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుందని చెప్పారు. నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. ఒకే దేశం - ఒకే విద్యా విధానం ఉండాలనేదే జాతీయ విద్యా విధానం లక్ష్యమని చెప్పారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని అన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు....

చైనాపై గూగుల్ ఉక్కుపాదం: 2500 ఛానళ్లు తొలగింపు

కరోనా మహమ్మారికి చైనా అడ్డుకట్ట వేయకపోవడం, ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణం కావడంతో అమెరికాతో అనేక దేశాలు చైనాను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ విమర్శలను పక్కదోవ పట్టించేందుకు చైనా, ఇండియా బోర్డర్ లో అలజడులు సృష్టించింది.  దీంతో ఇండియా ఆ దేశానికీ చెందిన ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టాలని చూసింది.  ఇందులో భాగంగానే ఒకసారి 59, మరోసారి 47 చైనా యాప్స్ పై నిషేధం విధించింది.  మరో 250 యాప్స్ ను మానిటరింగ్ చేస్తున్నది ప్రభుత్వం.   ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు గూగుల్ సైతం చైనాపై ఉక్కుపాదం మోపింది.  ఆ దేశానికీ చెందిన 2500 యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు ప్రకటించింది.  త్రైమాసిక బులెటిన్ ను గూగుల్ ఈ విషయాన్ని పేర్కొన్నది.  స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను ఆయా ఛానల్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది.  దీంతో ఆయా ఛానల్స్ ను తొలగించినట్టు గూగుల్ పేర్కొన్నది.