Skip to main content

Posts

Showing posts from October 31, 2019

విశాఖలో పవన్ తలపెట్టిన ర్యాలీకి టీడీపీ మద్దతు ఇస్తుంది: చంద్రబాబు

  ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా జరిగిన ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తామని అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇసుక కొరత సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తలపెట్టిన ర్యాలీకి టీడీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. టీడీపీ తరఫున సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గొంటారని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందని, మరి తెలంగాణలో వర్షాలు పడుతున్నా ఇసుక కొరతలేదని, దీనికి ప్రభుత్వం ఏంచెబుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీడీపీ తరఫున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, రాష్ట్ర...

పోలవరం పనులకు తొలగిన అడ్డంకి

పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలగిపోయింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది. ఆ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ గురువారం నిర్ణయం తీసుకోంది. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టరుతో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణ ముగించింది. దీంతో నవయుగ సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.  విచారణ సందర్భంగా ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ను పక్కకు పెట్టింది. దిగువ కోర్టును తప్పుబట్టింది. కాగా, పోలవరం కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌తో ప...

ముగిసిన గీతాంజలి అంత్యక్రియలు

  గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందిన సినీనటి గీతాంజలి అంతక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు నందినగర్‌లోని గీతాంజలి నివాసం నుంచి భౌతికకాయాన్ని  అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌తో పాటు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, శివాజీరాజా, రమాప్రభ, ఉత్తేజ్‌, బాబూమోహన్‌, అన్నపూర్ణ, ప్రభ, కవిత సహా పలువురు నటీనటులు, అభిమానులు గీతాంజలి పార్థివదేహానికి నివాళుర్పించారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

గీత రచయిత జొన్నవిత్తులపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

  ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఓ నా బుజ్జి జొన్న" అంటూ మొదలుపెట్టి 'స్త్రీ సాంగత్యం' వరకు వెళ్లారు. "నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్! నీకు అప్పుడప్పుడు, కనీసం దశాబ్దానికోసారైనా స్త్రీ సాంగత్యం అవసరం, లేకపోతే అసహనంతో చచ్చిపోతావ్ జొన్నా" అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. "అయినా నిన్ను నీ భార్యాపిల్లలు ఎలా భరిస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు. వాళ్ల మీద జాలి కలుగుతోంది అంటూ వెటకారం ప్రదర్శించారు. చివర్లో "ఐ లవ్యూ డా" అంటూ ట్వీట్ ముగించారు. వర్మ వ్యాఖ్యలకు కారణం ఉంది. ఇటీవలే జొన్నవిత్తుల మీడియాతో మాట్లాడుతూ, దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడంటూ వర్మపై మండిపడ్డారు. వర్మ ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు. వర్మ తనకు టీవీ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడని, అందుకే వర్మపై పప్పు వర్మ అనే బయోపిక్ తీస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే వర్మ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.

నేను సంపాదించిన దాంట్లో చాలా వరకూ ఈ సినిమాపైనే పెట్టాను: విజయ్ దేవరకొండ

  ఒక వైపున హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగాడు. ఆయన నిర్మాతగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో 'మీకు మాత్రమే చెప్తాను' రూపొందింది. తరుణ్ భాస్కర్ .. అనసూయ .. వాణి భోజన్ .. అభినవ్ గోమఠం ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'పెళ్లి చూపులు' సమయంలోనే షమ్మీర్ సుల్తాన్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి మాట ఇచ్చాను. అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కథ నచ్చడంతో .. నేను ఇంతవరకూ సంపాదించిన దానిలో చాలా వరకూ ఈ సినిమాపైనే పెట్టాను. టీమ్ అంతా కష్టపడి మంచి అవుట్ పుట్ తెచ్చారు. ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకు వుంది" అని చెప్పుకొచ్చాడు.  

బంగారం’ వార్తలపై స్పందించిన కేంద్రం

పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఓ సరికొత్త పథకం తీసుకురానున్నట్లు వస్తున్న వార్తలను ఆర్థికశాఖ వర్గాలు కొట్టిపారేశాయి. బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదని తేల్చిచెప్పాయి. బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని సంబంధిత అధికారులు తెలిపారు.  నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు నిన్న ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. నిర్ణీత పరిమాణానికి మంచి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కథనాలు వచ్చాయి. దీని ప్రకారం.. పరిమితికిమించి బంగారం ఉన్నవారు దానిని బయటపెట్టి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అధికారిక వర్గాలు.. అలాంటి ఆలోచనేమీ లేదని స్పష్టం చేశాయి. 

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...

కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికుల కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఇస్తా: పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తనకు గట్టి నమ్మకం ఉందని, కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని, అప్పటికీ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమైన విషయం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్ ను బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో కలిశారు. సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరగా, పవన్ సానుకూల ధోరణి ప్రదర్శించినట్టు తెలుస్తోంది.  

మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా: తమిళిసై

    హైదరాబాద్ ముషీరాబాద్ లో జాగృతి ఫౌండేషన్ నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగులో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఆమె... మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మహిళలు ప్రతి రంగాన్ని సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు తమకు నచ్చిన ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో నైపుణ్యతను సాధించాలని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ చూపాలని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ధ్రువపత్రాలను తమిళిసై అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ముద్ర రుణాలు తీసుకోవచ్చని చెప్పారు. శిక్షణ పొందిన వారంతా ఇతర మహిళలు కూడా శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని కోరారు.

కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ విజయం.. పాక్ కు అంతర్

  గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ విజయం సాధించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్పష్టం చేసింది. ఆయన నిర్బంధం అక్రమమని పాక్ ను ఎండగట్టింది. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాక్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, భారత గూఢచార సంస్థ 'రా' కోసం గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ ఆయనను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన విషయం విదితమే. అనంతరం 2017లో పాక్ మిలిటరీ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన భారత్.. నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో వున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిగింది. ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై అప్పట్లో ఐసీజే స్టే విధించింది. భారత్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.  

వల్లభనేని వంశీకి మేము చెప్పాల్సింది చెప్పాం: కేశినేని నాని

  గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొన్ని రోజుల క్రితం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయనతో టీడీపీ ఎంపీ కేశినేని నాని చర్చించారు. ఈ విషయంపై కేశినేని మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా రాటుదేలడానికి పోరాడాల్సి ఉంటుందని, ఒత్తిళ్లు ఎదుర్కోవడం సహజమని వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పోరాడి, గెలిచిన వ్యక్తి ఇప్పుడు వెన్ను చూపడం సరికాదని అన్నారు. ఆయనకు తాము చెప్పాల్సింది చెప్పామని తెలిపారు. వంశీ ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కేశినేని నాని తెలిపారు. ఆయనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. వంశీకి టీడీపీ ఎంత అవసరమో, టీడీపీకి కూడా ఆయన అంతే అవసరమని వ్యాఖ్యానించారు. 

హైకోర్టుతోపాటు రాజధాని కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్‌

  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైకోర్టుతోపాటు రాష్ట్ర రాజధానిని కూడా రాయల సీమలో ఏర్పాటు చేయడం మంచిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ డిమాండ్‌ చేశారు.  రాజధాని కోసం అధ్యయనం పేరుతో కాలయాపన చేయడం కంటే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ చేసే పరిస్థితులు తేవొద్దని హితవు పలికారు. రాయలసీమ డిక్లరేషన్‌ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాయల సీమపై అభిమానం ఉంటే రాంగోపాలవర్మ మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని  వెంకటేశ్ అన్నారు. వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.  

ఆర్టీసీపై ఎల్లుండి కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

 తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 50 శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె, 20 శాతం ప్రైవేట్  స్టేజ్ కేరియర్లు ఉండాలని యోచిస్తోంది. ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెట్విన్ సర్వీసుల సేవలు వినియోగించుకోవడం వంటి అంశాలను సర్కారు పరిశీలిస్తోంది. వీటితో పాటు మునిసిపల్ ఎన్నికలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

ఇంతకంటే దౌర్భాగ్యం లేదు.. నారా లోకేశ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు: మంత్రి మోపిదేవి

  ఇసుకను రాజకీయం చేస్తే టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడటం దౌర్భాగ్యమని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఆయన వ్యఖ్యలపై స్పందించాల్సి అవసరం లేదని చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించింది లోకేశ్ అని... ప్రతి రోజు కోట్లాది రూపాయల ముడుపులను తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఏం చేయాలో అర్థంకాక... ఇసుక అంశంపై నానా యాగీ చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే మంచిదని అన్నారు. విపక్షాలు ఇచ్చే సలహాలను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేవారపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుటకు ఇప్పటికే ఆదేశాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ.. ముహూర్తం ఖరారు

  టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి. కానీ, టీడీపీలో కొనసాగేందుకు వంశీ సుముఖత చూపలేదు. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ తో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా వంశీ చర్చలు జరపడంతో... ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ సందేహాలకు వంశీ ఫుల్ స్టాప్ పెట్టారు. వైసీపీలో చేరబోతున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు.

అధికారికంగా రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్.. ఇకపై అక్కడ ఎవరైనా ఆస్తులు కొనొచ్చు!

  భారతదేశానికి శిరస్సు వంటి జమ్మూకశ్మీర్ అధికారికంగా రెండు ముక్కలైంది. బుధవారం అర్ధరాత్రి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూకశ్మీర్, లడక్) అవతరించింది. ఈ నేపథ్యంలో భారత్ లో రాష్ట్రాల సంఖ్య ఒకటి తగ్గగా... కేంద్రపాలిత ప్రాంతాలు మరో రెండు పెరిగాయి. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన మూడు నెలల తర్వాత ఈ రాష్ట్రం నేటితో రెండుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్ శాసనసభ ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కాగా, లడక్ శాసనసభ లేని యూటీగా ఏర్పడింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధ్యర్యంలో ఉంటాయి. నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇకపై జమ్మూ కశ్మీర్ ప్రజలు పర్మినెంట్ రెసిడెంట్స్ హోదాను కోల్పోతారు. అంతేకాదు, ఇకపై అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అధికారం ఇతర రాష్ట్రాల్లోని ప్రజలందరికీ లభిస్తుంది. అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని దాదాపు 560 సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా జమ్మూకశ...

బగ్దాదీని ఇలా వెంటాడాం.. ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన అమెరికా!

  ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని ఎలా వెంటాడిందీ అమెరికా బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా సైనికులు బగ్దాదీ ఇంటిని చుట్టుముడుతుండడం, ఓ జాగిలం పరుగులు పెట్టడం, ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరపడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే, దాడికి ముందు, ఆ తర్వాత బగ్దాదీ ఇంటిని కూడా చూపించారు. బగ్దాదీ ఇంటిని చుట్టుముట్టిన తర్వాత అతడి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినట్టు పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. బగ్దాదీ తనకు తాను పేల్చుకున్నప్పుడు అతడితో పాటు చనిపోయింది ముగ్గురు పిల్లలు కాదని, ఇద్దరేనని స్పష్టం చేశారు. వారి వయసు 12 ఏళ్ల లోపేనని తెలిపారు. అదే కాంపౌండ్‌లో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు హతమైనట్టు తెలిపారు. హెలికాప్టర్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వైమానిక దాడి జరపక తప్పలేదని పేర్కొన్నారు. బగ్దాద...

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు

  తె లుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే నటి ‘గీతాంజలి’. ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తనదైన నటనతో మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హాస్యనటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నవ్వులు పూయించారు. పెళ్లయిన తర్వాత గృహిణిగా మారిన ఆమె.. ఆ తర్వాత  కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ‘పెళ్లైన కొత్తలో..’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి, పలు టెలివిజన్‌ సీరియల్స్‌లోనూ నటించి అలరించారు. గురువారం ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అసలు గీతాంజలి తొలి సినిమా అవకాశం ఎలా దక్కించుకున్నారు? ఎన్టీఆర్‌, సావిత్రిలతో ఆమెకున్న అనుబంధం ఎలాంటిది? మణి.. అనే పేరు గీతాంజలిగా ఎలా మారింది? ఇలా ఎన్నో విశేషాలను ఆమె ఓ సందర్భంలో పంచుకున్నారు అవన్నీ ఆమె మాటల్లోనే... అలా ఎన్టీఆర్‌ పక్కన సీతగా.. ‘‘అవునండీ, నన్ను ఇప్పటికీ చాలామంది ఎన్టీఆర్‌గారి సీత అనే అనే పిలుస్తారు. ఆ సినిమా నాకు తెచ్చిన పేరు అలాంటిది. అయితే, ఆ గొప్పదనమంతా ఆ పాత్రకు నన్ను ఎంపిక చేసి సీతగా తీర్చిదిద్దిన ‘పెద్దాయన’దే. హీరో...

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి గీతాంజలి (72) ఇకలేరు. గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.     1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గీతాంజలి జన్మించారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం,హిందీ చిత్రాలలో ఆమె నటించారు. తెలుగులో 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. బొబ్బిలి యుద్ధం, దేవత, లేతమనసులు,తోడు-నీడ, గుఢచారి-116 వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. గీతాంజలి నటించిన తొలి సినిమా సీతారామ కల్యాణం అయితే.. తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మీ చివరి సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. తమిళంలో 13,హిందీలో5,మళయాలంలో 3సినిమాల్లో గీతాంజలి నటించారు. తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్నార్,రామకృష్ణ సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు.