Skip to main content

Posts

Showing posts from September 29, 2019

వైఎస్ ప్రాణ స్నేహితుడు వైసీపీలో చేరబోతున్నాడా ?

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రభుత్వంలో చక్రం తిప్పేవారు.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో షాడో సీఎం గా కేవీపీ పెత్తనం చేస్తుండేవారు.రాజశేఖర రెడ్డి కూడా అదే స్థాయిలో కేవీపీకి ప్రాధాన్యం ఇస్తూ తన ఆత్మ కేవీపీ అంటూ చెబుతుండేవారు. అయితే రాజశేఖర రెడ్డి మరణం అనంతరం కేవీపీ హవా మొత్తం తగ్గిపోయింది.వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ వైసీపీని స్థాపించినప్పుడు కేవీపీ చేరుతారని, జగన్ కు అండగా ఉంటారని అంతా భావించారు.అయితే ఆయన మాత్రం కాంగ్రెస్ ను విడిచిపెట్టలేదు. 2019 ఎన్నికలకు ముందు వరకు కేవీపీ రామచంద్రరావు యాక్టివ్ గా ఉండేవారు.కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు.అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పై ఆయన నిప్పులు చెరిగేవారు.తరచు లేఖలను విడుదల చేస్తూ టీడీపీ ప్రభుత్వం పై హీటు పెంచేవారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడును ముప్పుతిప్పలు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఏపీ లో జగన్ ప్రభుత్వం కొలువుతీరడంతో కేవీపీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపి...

పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందంట..!

గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రెవిన్యూ రికార్డులను తారుమారు చేసిందనీ, రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్ని సమస్యలున్నా అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షా

జమ్ము కశ్మీర్ విలీనం అంశంపై మరోసారి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా మాజీ ప్రధాని నేహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం కొరడంపై మండిపడ్డారు... కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐరాస మద్దతు కోరారని అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. కశ్మీర్ సమస్యపై ఎవ్వరితో కనీసం సంప్రదింపులు కూడ జరపలేదని తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇది హిమాలయాల కంటే చాల పెద్దతప్పుని విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత పటేల్ 630 సంస్థాలను దేశంలో విలీనం చేయగలిగితే, నెహ్రు ఒక్క కశ్మీర్‌ను విలీనం చేయలేక పోయాడని ఆరోపణలు చేశారు. అయితే నెహ్రు అప్పుడు చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ చేసి చూపించిందని అన్నారు. మరోవైపు స్వర్గీయ ప్రధాని ఇంధిరా గాంధిని ఆయన పొగిడారు. సిమ్లా ఒప్పందం ద్వార కశ్మీర్‌ను రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా చేశారని తెలిపారు. కశ్మీర్‌లోని మొత్తం 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు చెప్పారు. కేవలం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 144సెక్షన్ అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతిన...

జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండగే పండుగ

జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల లోపే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే కీలకమైన నిర్ణయాలు చాలావరకు అక్టోబర్ నెలలో అమలు కానున్నాయి. సమూల మార్పులు దిశగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇచ్చిన హామీల ప్రకారం అక్టోబర్ నెలలో ఏపీలో పండుగ వాతారణం నెలకొల్పేలా చేస్తున్నది. ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. మొదటగా అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసలు ఆ పేరే వినిపించకుండా.. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా.. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేలా జగన్ తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది. తద్వారా బెల్ట్‌ షాపులు లేకుండా చేసి మద్యం అమ్మకాలను తగ్గించి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది సీఎం కోరిక. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్య...

చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి బలం పుంజుకోవడానికి టానిక్ అందిస్తున్నారా? గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అందుకు ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మంగళం పాడడంతోపాటు కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూలగొట్టడానికి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం వంటివి పరిశీలిస్తే అవన్నీ చంద్రబాబుకు కలసివచ్చేలా ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి చివరి రెండు విడుతల చెక్కులకు జగన్ చెక్ పెట్టారు. 4, 5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్లను నిలుపుదల చేశారు. సెప్టెంబర్ 25న దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తుంది. కాబట్టి, పాతదాన్ని రద్దు చేశామని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సహజంగా రైతులు దేనికదే అనే భావనలో ఉంటారు. రుణమాఫీ హామీ ఐదేళ్ల క్రితం నాటిది. రైతు భరోసా ఎన్నికల ముందు నాటిది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి హామీకి సంబంధించిననిధులు చివరి నిమిషంల...

అనేక దేశాధినేతలకు భారత్ ఓ పెద్ద మార్కెట్... మనుషుల కంటే వ్యాపారమే ముఖ్యమైపోయింది: ఇమ్రాన్ ఖాన్ నిర్వేదం

ఐక్యరాజ్యసమితిలో వీరావేశంతో ప్రసంగించినా తమ వాదనకు ఎవరూ మద్దతు పలకకపోవడం పట్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యంలో మునిగిపోయారు. కశ్మీర్ విషయంలో తగిన విధంగా మద్దతు రాబట్టలేకపోయామని అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్, ఏదో ఒకరోజున ప్రపంచ దేశాలన్నీ నిజాన్ని తెలుసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. "అనేక దేశాల అధినేతలకు భారత్ అంటే ఓ పెద్ద మార్కెట్. 120 కోట్ల మందితో కూడిన ఆ వాణిజ్య కేంద్రానికి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వరా? మనుషుల కంటే వ్యాపారమే ముఖ్యమైపోయిందా?" అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు: బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినా ఆరోపణలు చేయడం అర్థరహితమని అన్నారు. 300 అడుగుల లోతున గోదావరిలో మునిగిన బోటును వెలికితీయడం కష్టంగా మారిందని, దాన్ని కూడా ప్రభుత్వ అసమర్థత కింద విమర్శలు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే అది చంద్రబాబు అసమర్థతేనా? అని ప్రశ్నించారు. దురదృష్టకర ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వ విధానాలు మాకు గుదిబండలుగా మారాయి: మంత్రి బాలినేని వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని అన్నారు. విద్యుత్ రంగాన్ని సరిదిద్దేందుకు సీఎం జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. అయితే, గత ప్రభుత్వం చేసిన పొరబాట్లు తమకు గుదిబండలుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ వస్తున్నామని బాలినేని తెలిపారు. 2019 మార్చి నాటికి రూ.20,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలన్నింటికి చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నామని ఆయన వివరించారు.

కూన రవికుమార్ పై అక్రమ కేసు : చినరాజప్ప

వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప ప్రజా పాలన అందించడం లేదని, టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూన రవికుమార్ తో పాటు మరో 11 మంది వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ… కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రవిని కలిశామని, వైసీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపులు తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని చినరాజప్ప ఆరోపించారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది..లీక్ అయిన వీడియో

బిగ్‌బాస్‌ షోలో జరిగే ఎలిమినేషన్‌ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ ఎవరన్నది తెలుస్తోంది.గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్‌ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ పదోవారానికి ఓ విశిష్టత ఉంది. అదేంటంటే.. లీకువీరుల కంటే ముందే ప్రేక్షకులూ గెస్‌ చేశారు. నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన మరుక్షణమే ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో అందరూ పసిగట్టేశారు. పదోవారానికి గానూ బాబా భాస్కర్‌, శ్రీముఖి, వరుణ్‌, రవికృష్ణలు నామినేట్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది..లీక్ అయిన వీడియో ఆ నలుగురిలో రవికృష్ణకే కాస్త తక్కువ ఫాలోయింగ్‌ ఉన్నది అందరికీ తెలిసిందే. దీంతో రవికృష్ణ ఈ వారం ఇంటి నుంచి వెళ్లడం ఖాయమని ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్‌ అయ్యారు. ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే రవికృష్ణ ఎలిమినేట్‌ అయ్యాడని సోష...

వైఎస్ వివేకా హత్య కేసును నీరు గార్చాలని చూస్తున్నారు: ఆలపాటి రాజా

వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చాలని చూస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ఆలపాటి రాజా ఆరోపణలు గుప్పించారు. వివేకా హత్యపై వైసీపీ ఎన్నో రాజకీయాలు చేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. వివేకా హత్య కేసు విచారణపై నాడు తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, ఇందుకు జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను, శాంతి భద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొరత లేకుండా చూశామని, జగన్ పాలనలో రాష్ట్రాన్ని  అంధకారంగా మారుస్తున్నారని విమర్శలు చేశారు.

టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం!

ఏపీ దేవాదాయ శాఖ పొరపాటు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులుగా మరొకరికి అధికారులు సమాచారమివ్వడంతో ఈ గందరగోళం తలెత్తింది. టీటీడీ సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు పంపింది. అజెండాతో పాటు ప్రమాణ పత్రాన్ని ఆయనకు పంపారు. అక్టోబర్ 3న రాజేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, టీటీడీ అధికారులను ముంబైకి చెందిన రాజేష్ శర్మ సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.

ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న కేసులో చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ దాఖలైన కేసులో హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తన ఆదాయ వివరాలను అఫిడవిట్‌లో చూపించకుండా గోప్యత పాటించారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తరపున ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన విద్యాసాగర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిహెచ్‌.మానవేంద్రరాయ్‌ శనివారం విచారణ చేపట్టారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు. అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి ఓటర్లకు పంపిణీ చేశారని, ఆ విధంగా తనకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగేందుకు మభ్యపెట్టారంటూ ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వంశీకి కూడా నోటీసు జారీ చేసింది.

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో తప్పిన ప్రమాదం!

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో వంట గ్యాస్ లీక్ అయింది. స్థానిక అర్జునవీధిలో దుర్గ గుడి ప్రసాదం పులిహోర తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకైన విషయం పసిగట్టిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గ్యాస్ వాల్వ్ ను కట్టేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. ప్రసాదం తయారీ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రసాదం తయారీ కేంద్రంలో దాదాపు 40 నిండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు సమాచారం. గ్యాస్ లీకైన సమాచారం మేరకు దుర్గగుడి ఈవో అక్కడికి వెళ్లి పరిశీలించారు. కాగా, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది. మహామండపంలోని ఆరో అంతస్తులో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నగరోత్సవం నిర్వహించనున్నారు.

చంద్రబాబు, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి హైకోర్టు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికపై ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ  వైఎస్ఆర్సీపీ  అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ ఏఎస్ విద్యాసాగర్ దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఆదాయ మార్గాల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడ్‌విట్‌లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యత పాటించారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి మ...

గోదావరిలో బోటు ముంచి ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి సిగ్గుండాలి: అవంతిపై మంతెన ఫైర్

గోదావరిలో పడవ ప్రమాదానికి మంత్రి అవంతి శ్రీనివాసే కారకుడని టీడీపీ నేత మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. గోదావరిలో బోటు ముంచి ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. టీడీపీ చేసిన అభివృద్ధికి వైసీపీ వాళ్లు అవార్డు తీసుకోవడం శోచనీయం అని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో అవార్డు ఎవరి కృషి వల్ల వచ్చిందో ఆలోచించాలని అన్నారు. గోదావరికి ఉద్ధృతమైన వరద వస్తున్న సమయంలో బోటుకు ఎలా అనుమతినిచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మంతెన వ్యాఖ్యానించారు. బోటు మునిగి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు బోటును బయటికి తీయలేదని విమర్శించారు.

హౌడీ-మోదీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్: ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, తన కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడికి తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగొచ్చిన సందర్భంలో ఈ ఘనస్వాగతం మరువలేనిదని పేర్కొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఓసారి ఐక్యరాజ్యసమితికి వెళ్లానని, ఇప్పుడు మరోసారి వెళ్లానని, ఈ ఐదేళ్లలో పెద్దమార్పు చూశానని మోదీ వివరించారు. అమెరికాలో నిర్వహించిన హౌడీ-మోదీ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. హూస్టన్ లో భారతీయులు ప్రదర్శించిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. దసరా నవరాత్రుల సందర్భంగా దేశప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

నేటి నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 8 వరకు కొనసాగనున్నాయి. పది అవతారాల్లో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీ భక్తులకు ప్రత్యేక దర్శన సమయాలు కేటాయించారు. ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏపీ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను ఏపీ సీఎం జగన్ రేపు సమర్పించనున్నారు.