పాకిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో పలువురు మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లిలోని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఒక పోస్టుచేసింది. భారత్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ భూకంపం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని తెలిసి తానెంతో బాధపడ్డానని మోడీ పేర్కొన్నారని ఆ ట్వీట్‌లో రాశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారని, గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ అన్నారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో భూకంపం వల్ల 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
Comments
Post a Comment