Skip to main content

Posts

Showing posts from November 4, 2019

ఉద్యోగాలు కాపాడుకోవడమా, కోల్పోవడమా కార్మికులే తేల్చుకోవాలి: సీఎం కేసీఆర్

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నవంబరు 5 అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరాలని గడువు విధించామని, గడువు లోపు విధుల్లో చేరని ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కాపాడుకుంటారో, కోల్పోతారో కార్మికులే తేల్చుకోవాలని అన్నారు. నవంబరు 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరకుంటే ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ఆర్టీసీ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.   

సీఎస్ బదిలీపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా బదిలీ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీఎస్ ను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా గానీ, ఇలా జరిగివుండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించినందుకు ప్రతిఫలంగానే సీఎస్ ను బదిలీ చేసినట్టయితే మరీ దారుణం అని భావించాల్సి ఉంటుందని తెలిపారు. బాధ్యత లేకుండా అధికారం చెలాయించే సీఎం కార్యాలయం ముఖ్యమంత్రుల మెడకు ఉచ్చులా మారుతోందని వ్యాఖ్యానించారు.  

పప్పువర్మ' చిత్రాన్ని ఆమెకు అంకితం ఇస్తా: జొన్నవిత్తుల వెల్లడి

  తనను జొన్నవిత్తుల చౌదరి అన్నాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గీత రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వర్మపై బయోపిక్ తీస్తానని, దానికి పప్పువర్మ అనే పేరు పెడతానని ఇప్పటికే జొన్నవిత్తుల ప్రకటించారు. తాజాగా ఓ మీడియా చానల్ చర్చా కార్యక్రమం నుంచి మాట్లాడుతూ, పప్పువర్మ అనే చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని, ఆ సినిమాను మియా మాల్కోవా అనే నటీమణికి అంకితం ఇస్తామని వెల్లడించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీసి బాలకృష్ణకు అంకింతం ఇచ్చినప్పుడు, తాను పప్పువర్మ చిత్రాన్ని మియా మాల్కోవాకు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు. ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని జొన్నవిత్తుల చానల్ సాక్షిగా ప్రకటించారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పువర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్ని తమాషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని జొన్నవిత్తుల వెల్లడించారు.  వర్మ అభిమానులు ఎంతో అమాయకులు అని, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అ...

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత

 ముఖ్యమంత్రి పీఠంపై శివసేన పట్టువీడకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో కమళదళం ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ధూలే జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా ఈ డిమాండ్‌ వ్యక్తమైనట్లు సీఎం ఫడణవీస్‌కు సన్నిహితుడైన మంత్రి జయకుమార్‌ రావల్‌ ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోకూడదని, తమకు ఓ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేసి గెలిచి చూపిస్తామని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వెలిబుచ్చినట్లు రావల్‌ తెలిపారు. శివసేన కారణంగా కొన్ని చోట్ల పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు ...

ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రం!

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే బదిలీ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఏపీ సర్కారు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేసింది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. "ఏపీ సీఎస్ ఓ అంశంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సీఎస్ నే బదిలీ చేశారు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్పిడి అంశంలో చోటుచేసుకున్న వివాదమే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కారణమని తెలుస్తోంది. సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత వారం ఓ వివాదాస్పద జీవో రిలీజ్ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు పంపారు. షోకాజ్ నోటీసులకు జవాబు చెప్పాల్సిన సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఏకంగా సీఎస్ నే బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి సంచలనం సృష్టించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో ఐదు నెలలు సర్వీసు ఉంది. ఈ లోపే ...

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసింది. ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించింది. మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు. తక్షణమే విధుల నుంచి తప్పుకుని, నీరబ్ కుమార్ కు బాధ్యతలను అప్పగించాలని సుబ్రహ్మణ్యంకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఆయనను బదిలీ చేయడం గమనార్హం.  

తహసీల్దార్‌ సజీవ దహనం

   హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఓ దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తో పాటు అటెండర్‌ను హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.  అబ్దుల్లాపూర్‌మ...

త్వరలో అయోధ్య వివాదంపై తీర్పు... నెటిజన్లకు పోలీసుల హెచ్చరికలు

ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదంపై మరి కొన్నిరోజుల్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అయోధ్య అంశంపై ఇతరుల మనోభావాలు గాయపడేలా అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతిభద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని యూపీ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా సైట్లపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.  

అమరావతిలో పవన్ కల్యాణ్ ఆమరణ నిరహార దీక్ష"... అసలు విషయం చెప్పిన 'శతఘ్ని'!

  ఏపీలో ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో ఆయన ఆదివారం భారీస్థాయిలో లాంగ్ మార్చ్ నిర్వహించి ఇతర రాజకీయ పక్షాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే, మరో రెండు వారాల్లో అమరావతిలో పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతోంది. దీనిపై జనసేన మీడియా విభాగం శతఘ్ని వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ ప్రెస్ నోట్ అని, జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వచ్చిన సమాచారమే అధికారికం అవుతుందని శతఘ్ని వెల్లడించింది. జనసేన ఫేక్ అని చెబుతున్న ప్రెస్ నోట్ ఇదే...

పవన్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలి: మంత్రి అవంతి

విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఆదివారం జరిగిన సభలో పవన్ అనుభవలేమి, అజ్ఞానం బయటపడ్డాయని, పవన్ ఓ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరూ రాజకీయనాయకులు కాలేరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్ కల్యాణ్ ఓ సినిమా ఉచితంగా చేశాననుకుని ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వవచ్చు కదా అని హితవు పలికారు. పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటికే పరువు కోల్పోయిన పవన్, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ద్వారా మరింత దిగజారిపోతున్నాడని విమర్శించారు. పవన్ ఇంకా సినిమా మాయలోనే ఉన్నాడని, వైసీపీ నేతలకు ఇసుక రవాణాతో సంబంధం ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. లాంగ్ మార్చ్ అని చెప్పి కేవలం 2 కిలోమీటర్లు కూడా నడవలేకపోయారని, కానీ సీఎం జగన్ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు.  

ఇసుక కొరతపై జగన్ స్పందన

ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోందని, అన్ని నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచిందని... ఇసుక ఉచితం అని చెప్పి మాఫియాను నడిపించారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇసుక సమస్య తాత్కాలికమేనని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా మర్గదర్శకాలను రూపొందించామని చెప్పారు.

అల వైకుంఠపురములో' నుంచి టబు ఫస్టులుక్

  తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా 'టబు' ఒక వెలుగు వెలిగింది. నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లోనూ తన సత్తాను చాటి చెప్పింది. కొంత కాలంగా ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ రోజున ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'అల వైకుంఠపురములో' టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీమంతురాలైన 'అలకనందాదేవి' పాత్రలో టబు కనిపించనుంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనున్నట్టు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ఖాయమేనట

ఇటీవల సురేందర్ రెడ్డి నుంచి వచ్చిన 'సైరా' తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చారిత్రక నేపథ్యం కలిగిన భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి సమర్థవంతంగా తెరకెక్కించాడంటూ ప్రశంసలు దక్కాయి. అలాంటి సురేందర్ రెడ్డి ఇక తనదైన స్టైల్లో ఒక కథను సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ దిశగా దిల్ రాజు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్లో ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. ప్రభాస్ హీరోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగా .. సురేందర్ రెడ్డి మార్క్ స్టైలీష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.  

కేరళకు మహేశ్ బాబు అండ్ టీమ్

మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం చకచకా జరిగిపోతోంది. రీసెంట్ గా ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేసినట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. ఆల్రెడీ ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరినట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.  విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.  

పవన్ కల్యాణ్ ఓ 'ప్యాకేజీ స్టార్': లాంగ్ మార్చ్ పై విజయ సాయిరెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత సమస్యపై నిరసన తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్... విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి... పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వేశారు. 'చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో వైజాగ్ షో పూర్తి అయిందనిపించాడు ప్యాకేజీ స్టార్. రాజకీయాల్లో ‘కాల్షీట్’ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయతీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తక్కువ చేసి చూడొద్దట. ఈ మాట ప్రజలను అడుగుతున్నావా?' అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 2.5 కి.మీ.మేర  ఇది కొనసాగింది. అయితే, కేవలం 2.5 కి.మీ.మేర చేసిన మార్చ్ కు లాంగ్ మార్చ్ అంటూ పేరు పెట్టడంపై కూడా విజయ సాయిరెడ్డి నిన్న సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?.. సాయంత్రం గవర్నర్ తో భేటీ

  మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన నేతలు ఈ రోజు సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు తెలిసింది. భగత్ సింగ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ సహా ఆరుగురు నేతలు సమావేశం అవుతారు. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ డిమాండ్ కు బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు. ఇటీవల శివసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా గవర్నర్ తో భేటీ అయ్యారు. కాగా, మహారాష్ట్రలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సంజయ్ రౌత్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

బీజేపీలోకి రావాలంటూ కిషన్‌రెడ్డి ఆహ్వానం.. నేడు కాషాయ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లి?

  తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. వారి ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడు ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు, తెలంగాణలోని అసంతృప్త కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మోత్కుపల్లిపై దృష్టిసారించింది. ఆయనను చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. దీంతో ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించింది. ఓ ప్లాట్‌ఫాం కోసం ఎదురుచూస్తున్న మోత్కుపల్లి కూడా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల ఆహ్వానాన్ని మన్నించినట్టు సమాచారం.  

ఏపీ నుంచి పెట్టుబడులు తరలిపోతుండడంపై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు

  ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతుండడంపై ఏపీ బీజేపీ సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో రూ. 70 వేల కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హయాంలో ప్రకటించిన ఆదానీ గ్రూప్, రూ.15 వేల కోట్ల విలువైన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తాజాగా ఏపీ నుంచి తరలిపోవడంపై సునీల్ దేవ్‌ధర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్ర సొంత ఆదాయం జీతాలకు, అప్పుల వడ్డీలకే సరిపోవడం లేదన్నారు. సంపాదించిన సొమ్మును నవరత్నాలకు ఖర్చు చేయాలని, అప్పులు చేసి కాదని ఆయన విమర్శించారు. రాష్ట్రంపై రూ. 3.5 లక్షల కోట్ల మేర అప్పుల భారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ మేలుకుంటే మంచిదని దేవ్‌ధర్ ట్వీట్ చేశారు.