Skip to main content

Posts

Showing posts from November 23, 2019

ఈ ఉద్యమంలో మిగిలిన పార్టీలు కూడా పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలి: జొన్నవిత్తుల, మండలి బుద్ధప్రసాద్

తెలుగుభాష పరిరక్షణ, నదీజలాల స్వచ్ఛ సంరక్షణ ప్రధానధ్యేయంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన 'మన నుడి-మన నది' కార్యక్రమానికి తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భాషాభిమాని మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. భాష నశించిన రోజున జాతి కూడా నశిస్తుందని, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మిగిలిన పార్టీలు కూడా పవన్ తో కలిసి పనిచేయాలని సూచించారు. జొన్నవిత్తుల, మండలి హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  

మన నుడి-మన నది' ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి: పవన్ కల్యాణ్

ప్రపంచీకరణ నేపథ్యంలో జాగ్రత్త పడకపోతే తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జలవనరుల కోసం మన నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 'మన నుడి-మన నది' పేరిట ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. దీనికి అందరి నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 'మన నుడి-మన నది' ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు

అజిత్ పవార్ పై వేటు.. పార్టీ నుంచి బహిష్కరించిన ఎన్సీపీ

మహారాష్ట్రలో ఎన్సీపీ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించిన అజిత్ పవార్ పై వేటు పడింది. అజిత్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతుందని శరద్ పవార్ ప్రకటించారు. కొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని ఆయన చెప్పారు. అజిత్ నీతిమాలిన చర్యకు పాల్పడ్డారన్నారు. ఆయన నిర్ణయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సాయంత్రం 4.30 గంటలకు శరద్ పవార్ తన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలను లెక్కించి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు  సమాచారం.  

అమిత్ షా నమ్మినబంటు... 'మహా' రాజకీయాల్లో చక్రం తిప్పిన భూపేంద్ర యాదవ్!

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యరీతిలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటులో చాపకింద నీరులా వ్యవహరించిన కీలక నేత ఎంపీ భూపేంద్ర యాదవ్. రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నమ్మినబంటుగా ముద్రపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదని బీజేపీ వెనక్కితగ్గడం వ్యూహాత్మకమేనని ప్రత్యర్థులు గ్రహించేలోపే సీఎం పీఠంపై ఫడ్నవీస్ చిద్విలాసం చేశారంటే అందుకు కారణం భూపేంద్ర యాదవే! ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని పదేపదే చెబుతుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన వ్యాఖ్యల ఆంతర్యం ఇప్పుడర్థమవుతోంది. గత కొన్నిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో భూపేంద్ర యాదవ్ రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. నిన్న రాత్రి బీజేపీ, అజిత్ పవార్ మధ్య ఒప్పందం కుదరడంలో భూపేంద్ర కీలకభూమిక వహించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్ అంతటివాడు కూడా ఏం జరుగుతుందో అంచనా వేసేలోపే సొంత పార్టీలో చీలిక వచ్చిందంటే భూపేంద్ర యాదవ్ ఏ స్థాయిలో చక్రం త...

బీజేపీ ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింది: ఉద్ధవ్ థాకరే

ప్రజా తీర్పును అవమానించారని మాపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని, కానీ బీజేపీయే ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. పాక్ పై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తరహాలో మహారాష్ట్ర ప్రజలపై మెరుపుదాడి చేశారని, ప్రజలే బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు. 'శివసేన ఎమ్మెల్యేల్లో కూడా చీలిక తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందా? ప్రయత్నించనివ్వండి.. మహారాష్ట్ర ప్రజలు హాయిగా నిద్రపోకుండా చేస్తోందా? చేసుకోనివ్వండి. వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతాం. అప్పట్లో తనను వెన్నుపోటు పొడవాలని చూసిన వారితో ఛత్రపతి శివాజీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఇంతకు ముందు బీజేపీ ఈవీఎంలతో ఆట ఆడింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింది' అని ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు.  

అజిత్ పవార్ కు షాక్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. రాజ్ భవన్ వరకు వెళ్లి తిరిగి శరద్ పవార్ వద్దకు వచ్చేసిన వైనం

ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆయనకు షాక్ ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. ఏదో పని ఉందంటూ అజిత్ పవార్ ఫోన్ చేశారని, దీంతో తాము రాజ్ భవన్ కు వెళ్లామని చెప్పారు. తమకు అంతకు మించి ఏమీ తెలియదని వివరించారు. రాజ్ భవన్ కు వెళ్లి మళ్లీ వచ్చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 'అజిత్ పవార్ నాకు ఫోన్ చేసి ఓ విషయంపై చర్చించాలని పిలిచారు. దాంతో రాజ్ భవన్ కు వెళ్లాను. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. దీంతో నేను వెంటనే తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లిపోయాను. నేను శరద్ పవార్ తోనే ఆయనకు మద్దతుగా ఉంటానని చెప్పాను. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయం కూడా మాకు తెలియదు' అని వ్యాఖ్యానించారు.  

ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి.. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ ఎవరు? ఆయన ప్రస్థానం ఏమిటి?

అజిత్ పవార్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు షాకిస్తూ... బీజేపీని అధికారంపీఠంపై కూర్చోబెట్టిన నేత అజిత్ పవార్. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన నాయకుడు. ఈ ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. గంటల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన అజిత్ పవార్ ఎవరో తెలుసుకుందాం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ కు విద్యా పరంగా ఎస్ఎస్సీ (మహారాష్ట్ర బోర్డు) సర్టిఫికెట్ ఉంది. ఆ తర్వాత చదువును కొనసాగిస్తున్న సమయంలో ఆయన తండ్రి హఠాన్మరణం చెందారు. దీంతో, విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. అదే సమయంలో కాంగ్రెస్...

బీజేపీలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు రంగంలోకి దించాడు: విజయసాయి రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు నాయుడు ఇప్పుడు రంగంలోకి దించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని ఆయనకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పించాడని, అబద్ధానికీ ఒక హద్దుండాలని ట్వీట్ చేశారు. లులూ గ్రూప్ విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ... 'లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని చంద్రబాబు ఉదారంగా కట్టబెట్టాడు. దీనికి ఎంత కమీషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుంది. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నాడు' అని అన్నారు.  

వైసీపీ ఆరు నెలల పాలన గురించి ఈ ఆరు పదాల్లో చెబుతున్నాను: పవన్ కల్యాణ్

వైసీపీ ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో చెప్పొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'శ్రీ జగన్ రెడ్డిగారి ఆరు నెలల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుడుకు తనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నముగా చెప్పొచ్చు' అని ట్వీట్ చేశారు. ఒక్కో పదంపై ఆయన వివరణ ఇచ్చారు. కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వక వరద నీరుతో రాజకీయ క్రీడలు కార్మికుల ఆత్మహత్యలు విధ్వంసం కింది వస్తాయని అన్నారు. కాంట్రాక్టు రద్దులు, అమరావతి రాజధాని, జపాన్ రాయబారి-సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు దుందుడుకుతనం కిందకు వస్తాయని పవన్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో సామాన్యకార్యకర్తతో మొదలు కొని ఎమ్మెల్యే రాపాకపై కేసులు బనాయించడం, పోలీసుల వేధింపులు వంటివి కక్ష సాధింపుతనం కిందకు వస్తాయన్నారు. గ్రామ వాలంటీర్లు అంటూ 5 లక్షల ఉద్యోగాలు ప్రకటించి, 2,89,000 మాత్రమే ఇవ్వడం, 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టడం మానసిక వేదన కిందకు వస్తాయన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందా? ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుందా? అన్న విషయాలు అనిశ్చితి కిందకు వస్తాయని పవన్ తెలిపారు. ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాష, సం...

అజిత్‌పవార్‌ది వెన్నుపోటు:సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘నిన్న రాత్రి 9గంటల వరకు ఆ మహాశయుడు(అజిత్‌ పవార్‌) మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో అలాగే మాట్లాడారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే టచ్‌లోనే ఉన్నారు. ఈరోజు కూడా వారు భేటీ అవుతారు. ఇద్దరూ కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అజిత్‌ పవార్‌, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారు’’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై సంజయ్‌ రౌత్‌ ఈరోజు ఉదయం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.  మహారాష్ట్రలో రాజకీ...

అది ఎన్సీపీ నిర్ణయం కాదు:శరద్‌ పవార్‌

మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్‌ పవార్‌ వ్యక్తిగత నిర్ణయం అని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్‌ పవార్‌ని తాము సమర్థించడం లేదన్నారు. ఈ మేరకు ఆయన తాజా పరిణామాలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. మరోనేత ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. భాజపాతో కలిసి నడవడం ఎన్సీపీ పార్టీ నిర్ణయం కాదన్నారు. దీనికి శరద్‌ పవార్‌ మద్దతు లేదని వెల్లడించారు.

బిగ్‌ బ్రేకింగ్: మహా రాజకీయాల్లో ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర..!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ నిలిచింది. రాత్రికి రాత్రే.. రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీలో చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడిచింది. శరత్ పవార్ తమ్ముడు.. అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో.. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చే.. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రెండోసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు..  ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. శివసేన ప్రజా తీర్పును అవమానించిందన్నారు. మహారాష్ట్రకు స్థిరమైన ప్రభుత్వం కావాలి.. బలహీన ప్రభుత్వం కాదన్నారు. బీజేపీ-ఎన్సీపీ కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. స్థిరమైన ప్రభుత్వం కోసమే ఎన్సీపీ బీజేపీకి మద...