వివాదాస్పదమైన తన నివాసంపై హైకోర్టును ఆశ్రయించారు వ్యాపార వేత్త లింగమనేని రమేష్. తనకు సమాచారం ఇవ్వకుండా తన ఇంటిని కూల్చివేస్తున్నారంటూ పిటీషన్ దాఖలు చేశారు. ప్రాపర్టీ స్టే కోసం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
ఇకపోతే మంగళవారం లింగమనేని రమేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరకట్ట పై ఉన్న అతిధి గృహం కూల్చివేత నోటీసులపై 5పేజీలు లేఖ రాశారు.
కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది తన ఒక్క కుటుంబం మాత్రమే కాదని చెప్పుకొచ్చారు.
కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది తన ఒక్క కుటుంబం మాత్రమే కాదని చెప్పుకొచ్చారు.
సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేస్తుందని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాత్మకంగా సాగుతుంది అనుకున్న ప్రభుత్వం కూల్చివేతకే ప్రాధాన్యం ఇస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో ఉదయించిందని చెప్పుకొచ్చారు.
కరకట్టపై మొదలైన ఈ ప్రక్రియ తమ ప్రాంతాలకు వేర్వేరు కారణాలతో వస్తుందనే ఆందోళన రాష్ట్రమంతా మొదలైందని లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరని హితవు పలికారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏ మేరకు సబబు అంటూ సీఎం జగన్ ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment