Skip to main content

Posts

Showing posts from November 11, 2019

డిస్నీ సినిమాలో మహేష్ గారాలపట్టి సితార…!

కొన్ని హాలీవుడ్ సినిమాలకు సౌత్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే డిస్నీ నుంచి వచ్చే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి. కాగా… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో ఓ ఛానల్ కూడా ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. అడ‌పాద‌డ‌పా ఆమెకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌డం, వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోవ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య సొంతంగా యూట్యూబ్ లో A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సితార హాలీవుడ్‌కు చెందిన డిస్నీ స్టూడియోతో పని చేసే అవకాశం వచ్చింది. డిస్నీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ఫ్రోజెన్ 2″లో ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేష్ ముద్దుల కూతురు సితార గాత్ర దాన...

దెయ్యం ప్రాంక్‌ వీడియోలు.. యువకుల అరెస్టు!

  బెంగళూరు: యూట్యూబ్‌ ప్రాంక్‌ వీడియోల పేరుతో దెయ్యం వేషాధారణలో స్థానికులను భయపెడుతున్న కొందరు యువకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని యశ్వంత్‌పుర సమీపంలోని షరీఫ్‌నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు యూట్యూబ్‌ ప్రాంక్‌ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఈక్రమంలో వారు దెయ్యం వేషాధారణలో (పెద్ద గోళ్లు, తెల్ల గౌన్లు, రక్తపు మరకలతో) ప్రజలను భయపెట్టి వారి హావభావాలను వీడియోలు తీస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు ఆటోలో వెళ్లే ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై కొందరు స్థానికులు వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిలో ఏడుగురిని గుర్తించి అరెస్టు చేశారు. ఒకరి మొబైల్‌లో పలు ప్రాంక్ వీడియోలు సైతం గుర్తించారు. అరెస్టయిన వారిలో 18 నుంచి 25 మధ్య వయసున్న యువకులే ఉన్నారు. వారు ప్రాంక్‌ వీడియోలే చేయాలనుకున్నారు.. కానీ చేసిన విధానం చాలా ప్రమాదకరంగా ఉందని బెంగళూరు నార్త్‌ డీసీపీ శశికుమార్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని.. త్వరలో ఉత్తర్వులు?

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని నియమితులు కానున్నారని తెలుస్తోంది. సహాని ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. సహానీని తమ రాష్ట్రానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖలో కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సహానీ రాష్ట్రానికి బదిలీ కానున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కేంద్రం దీనిపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎం జగన్ ను కలవడంపై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఈ భేటీ రాజకీయంగా విపరీతమైన ఆసక్తి కలిగించింది. దీనిపై సోము వీర్రాజు స్వయంగా వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సీఎం జగన్ ను కలిశానని వెల్లడించారు. అంతేకాకుండా, రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు కూడా అందించానని, ఆ సలహాలను సీఎం జగన్ కు కూడా తెలిపానని పేర్కొన్నారు. దాంతో పాటే ఇంగ్లీష్ మీడియం అంశంపైనా సీఎంతో మాట్లాడానని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని అన్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఇంగ్లీషు ఎంతో అవసరమని వీర్రాజు అభిప్రాయపడ్డారు.  

శివసేనకు గడువు ముగియడంతో తాజాగా ఎన్సీపీని ఆహ్వానించిన మహారాష్ట్ర గవర్నర్!

  మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న శివసేన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించి, ఈ రోజు సాయంకాలం ఏడున్నర వరకు గడువు ఇచ్చిన సంగతి విదితమే. అయితే, ఆ సమయంలోగా శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో, గవర్నర్ తాజాగా ఎన్సీపీని ఆహ్వానించారు. గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం అందిందని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. పిలుపు మేరకు గవర్నర్ ను కలిసేందుకు వెళుతున్నామని, అయితే ఆయన ఎందుకు పిలిచారో తమకు తెలియదని పవార్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న శివసేన ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. తొలుత మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపిన కాంగ్రెస్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్సీపీతో కూడా చర్చించాల్సి ఉందంటూ కాంగ్రెస్ అధినాయకత్వం శివసేనకు నిరాశ కలిగించే సంకేతాలు పంపింది.  మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న శివసేన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వాని...

ఒక్క ఫొటో ఆ చిన్నారి జీవితాన్ని మార్చేసింది!

  ఇటీవల సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఖాళీ గిన్నె పట్టుకుని అతి దీనంగా ఓ క్లాస్ రూమ్ బయట నిలుచున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో... క్లాస్ రూమ్ లో తన ఈడు పిల్లలందరూ యూనిఫాం ధరించి చదువుకుంటూ ఉండగా, వారికి మధ్యాహ్న భోజనం పెట్టే వేళ తనకు కూడా ఇన్ని మెతుకులు వేయకపోతారా అని అత్యంత దయనీయ స్థితిలో ఆ బాలిక వేచిచూస్తుండడం చాలామందిని కలచివేసింది. ఇది ఓ జర్నలిస్ట్ తీసిన ఫొటో. 'ఆకలి చూపు' అనే టైటిల్ తో వచ్చిన ఈ ఫోటో చూసి వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త చలించిపోయారు. వెంటనే ఆ బాలిక అడ్రస్ కనుక్కుని వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ బాలిక పేరు మోతీ దివ్య. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ మురికివాడలో ఉండే ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుని బతికే  నిరుపేదలు. తల్లిదండ్రులు చెత్త ఏరుకోవడానికి వెళితే, ప్రతిరోజూ ఈ చిన్నారి స్కూలు వద్దకు వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం అలమటించిపోయేది. ఈ విషయం తెలుసుకున్న వెంకట్ రెడ్డి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి తాను ఏ స్కూల్ వద్దనైతే భోజనం కోసం పడిగాపులు పడేదో అదే స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు మోతి దివ్య అందరు విద్యార్ధుల్లా...

‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. హస్తం పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే దిల్లీలో స్పందించారు. ‘‘మహారాష్ట్ర రాజకీయాల వ్యవహారంపై  మా పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, మహారాష్ట్ర పీసీసీ సభ్యులతో మాట్లాడినట్టు ఇప్పటికే మీడియాకు ప్రకటన విడుదల చేశాం. మా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌తో ఇప్పటికే మాట్లాడారు. తదుపరి చర్చలు ముంబయిలో మంగళవారం జరుగుతాయి’’ అని ఖర్గే స్పష్టంచేశారు. సోమవారం ఉదయం దిల్లీలోని 10 జన్‌పథ్‌లో  రెండు పర్యాయాలు భేటీ అయిన కాంగ్రెస్‌ కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతోనూ సోనియా మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన లేఖలను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు రాజ్‌భవన్‌కు పంపినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇంకా శివసేనకు అలాంటి ...

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటి వాయిదా

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ చేస్తోన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రూట్లను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం రేపటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ రోజు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులపై నివేదికను కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య కోర్టుకు తెలిపారు. కోర్టు బదులిస్తూ.. న్యాయస్థానాలు చట్ట ప్రకారమే కేసులను పరిష్కరిస్తాయని తెలిపింది. భావోద్వేగాలు, సానుభూతితో కేసులను పరిష్కరింవని  స్పష్టం చేసింది. సమ్మె ప్రారంభంలోనే.. విధుల్లో చేరితే చేరండి లేకపోతే లేదని, ప్రభుత్వం కార్మికులకు చెప్పిందంటూ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయం తీసుకుందని కోర్టు ప్రస్తావించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది.  సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ కోర్టు, ట్రిబ్యునల్ ప్రకటించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ ను ఆర్టీసీ సమ్మె కేసుల వ...

లీడర్లకు నా అభ్యర్థన.. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ప్రతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. "మీ అభిప్రాయాలు వెలువరించే సమయంలో అప్రమత్తత అవసరం" అని అన్నారు. ‘నేతలు, విద్యావంతులకు నేను విన్నపం చేస్తున్నా.. మీ అభిప్రాయాలు చివరకు విధానాలుగా రూపాంతరం చెందుతాయి. అవి కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయి. అందుకే, ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నా

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విజయ్‌ చందర్‌

  కరుణామయుడు చిత్రంలో క్రీస్తుగా, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో సాయిబాబాగా నటించి తెలుగు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు, వైసీపీ నేత  తెలిదేవర విజయ్ చందర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చి గౌరవించింది. రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఛైర్మన్ గా నియమించింది. ఈ మేరకు సమాచార, పౌరసంబంధాల కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విజయ్ చందర్ ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడు కావడం గమనార్హం.

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రప్రభుత్వం తాజాగా నివేదిక సమర్పించింది. కోర్టు సూచించిన రీతిలో నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47కోట్లు ఆర్టీసీకి చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాదని తెలిపింది. ఆర్టీసీకి చెల్లింపులు, రుణాలు, నష్టాలను పూడ్చడానికి రూ.2,209 కోట్లు అవసరమన్న ప్రభుత్వం రూ.47 కోట్లు ఏమూలకు సరిపోవని నివేదికలో పేర్కొంది. కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భీష్మించుకుని కూర్చుంటే చర్చలు సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా కోర్టుకు వెల్లడించింది. మరోవైపు హైకోర్టు తన విచారణలో సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ లను కలిపి విచారణ జరుపుతామని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయిందని కోర్టు ప్రకటించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి హైకోర్టుకు ఉందన్న పిటిషనర్ తన వాదనను నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆర్టీసీ ఎస్మా(అ...

ఆసుపత్రిలో చేరిన శివసేన నేత సంజయ్ రౌత్

  శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఇంగ్లీషు మీడియం' అంశంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్

  ఏపీలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బాహాటంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు బదులుగా సీఎం జగన్ వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకువచ్చారు. ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు అంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా 'ఇంగ్లీష్ మీడియం' అంశంపై వ్యాఖ్యానించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వైసీపీ ఇంగ్లీషు మీడియం ప్రతిపాదనపై విరుచుకుపడిందని ఆరోపిస్తూ, 'మాతృభాషకు మంగళం' అంటూ 'సాక్షి'లో వచ్చిన కథనాన్ని పోస్టు చేశారు. అంతేకాదు, 'ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా?' అంటూ మరో కథనాన్ని కూడా ట్వీట్ చేశారు. అప్పుడు, ఇప్పుడు వైసీపీ కపట ధోరణికి ఇదే నిదర్శనం అంటూ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై జనసైనికులు స్పందించవద్దు: నాదెండ్ల మనోహర్

  విజయవాడలో జరిగిన అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ముగ్గురు భార్యలున్న పవన్ కల్యాణ్ తన ఐదుగురు పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో, జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు సంయమనం పాటించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విన్నవించారు. పవన్ పై జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని... భవన నిర్మాణ కార్మికులపై మన అధినేత చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చేసినట్టు భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీల గురించి పవన్ మాట్లాడుతుంటే.... ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... ఇది బాధాకరమని అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ... ప్రజాక్షేమం కోసం మనం భరిద్దామని పవన్ కల్యాణ్ చెప్పారని తెలిపారు. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశంలో పవర్ కల్యాణ్ అన్నింటికీ బదులిస్తారని చెప్పారు.  

సింగిల్స్ డే’ షాపింగ్ సందర్భంగా.. అలీబాబాలో ‘ఒక్క గంట'లో 12 బిలియన్ డాలర్ల అమ్మకాలు!

 గంటలోనే 12 బిలియన్ డాలర్ల( 84 బిలియన్ యువాన్లు) విలువైన అమ్మకాలు నమోదు చేసి, చైనా ఆన్ లైన్ విక్రయ సంస్థ అలీబాబా.కామ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సింగిల్స్ డే’ షాపింగ్ బొనాంజా ప్రకటించిన అలీబాబా హోల్డింగ్స్ కంపెనీ ఆన్ లైన్ అమ్మకాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.   ఈ మేరకు వివరాలను కంపెనీ ఛైర్మన్ డేనియల్ జాంగ్ వెల్లడించారు. 2009 నుంచి ‘సింగిల్స్ డే’ నిర్వహిస్తుమన్నారు. ‘సింగిల్స్ డే’ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒంటరి వారు ఇందులో కొనుగోళ్లు చేస్తూ.. వాటిని తమకుతామే బహుమతి తీసుకుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతిపెద్ద ఆన్ లైన్ కొనుగోళ్ల ఈవెంట్ గా పేరు పొందింది. అమెరికాలో నిర్వహించే ఆన్ లైన్ షాపింగ్ ఉత్సవాలు అకిన్ టూ బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి కార్యక్రమాల రీతిలో చైనాలో కూడా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు తేదీ 11, నెల 11 కాబట్టి ఈ అమ్మకాలను డబుల్ ఎలెవన్ గా కూడా పిలుస్తున్నారు.  

ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు పరిమితి విధించిన కేంద్రం

 విశిష్ట గుర్తింపు సంఖ్య 'ఆధార్' లో మార్పులు చేర్పుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పేరు, పుట్టినరోజు తేదీలు, ఇతర తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి పరిమితి లేదు. ఎవరు, ఎన్నిసార్లైనా అప్ డేట్ చేసుకునే వీలుండేది. అయితే ఈ సదుపాయం దుర్వినియోగం అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (ఉడాయ్) కొత్తగా నిబంధనలు ప్రవేశపెట్టింది.  దీని ప్రకారం, నిర్దేశించిన మేరకు మాత్రమే మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. కొత్త నియమావళి ప్రకారం.... పేరును సరిచేసుకోవడానికి రెండు అవకాశాలు మాత్రమే ఇస్తారు. పుట్టినరోజు తేదీలు, లింగం మార్చుకోవాల్సి వస్తే ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఒకవేళ సూచించిన మేర కంటే ఎక్కువసార్లు మార్పులు చేసుకోవాల్సి వస్తే సమీప ఆధార్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులకు తగిన కారణాలు వివరించాలి. మార్పులు చేర్పులకు సంబంధించిన ఆధారాలను పోస్టు ద్వారా, లేకపోతే ఈ-మెయిల్ ద్వారా అధికారులకు పంపాలి.  

పవన్ కల్యాణ్ కి ముగ్గురు భార్యలు' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శతఘ్ని ఘాటు వ్యాఖ్యలు.. పవన్ వీడియో పోస్ట్

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని టీమ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'పవన్ కల్యాణ్ ని కూడా అడుగుతున్నా.. అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తున్నారో అడుగుతున్నాను' అని జగన్ చేసిన వ్యాఖ్యలను శతఘ్ని వీడియోలో వినిపించింది. మరోవైపు, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్ కి గతంలో పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో పవన్... 'జగన్ ని అడగాలనుకుంటున్నాను నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లారా? తమాషాగా ఉందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని అన్నారు. 'వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్ గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్థ జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి...

అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?: జగన్ సంచలన వ్యాఖ్యలు!

  ఏపీ సీఎం వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రతిభావంతులకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్, ఇటీవలి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం వద్దని చెప్పడంపై విరుచుకుపడుతూ, "అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే, ఇవాళ, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనం. మన రాష్ట్రం నష్టపోతుంది. జాతి నష్టపోతుంది. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే, అతిగొప్ప ఆస్తి చదువు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి. ఏ పిల్లాడూ, తల్లీ అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే నా ఉద్దేశం" అని అన్నారు. డిసెంబర్ లో మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 40 వేల స...

ఉద్యోగం కోసం ‘నారాయణ’ వద్దకు వెళ్లా...ఆయనపైనే గెలిచి మంత్రినయ్యా : డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడినైన తాను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజూ అనుకోలేదని, కానీ అనుకోని ఘటనలు ఎదురు కావడంతో నా జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఒకప్పుడు నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని, అదే కళాశాల యజమాని నారాయణపై గెలిచి మంత్రిని కావడం యాధృశ్చికమన్నారు. ‘డాక్టర్‌ కోర్సు చదివాను. కానీ ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేయలేదు. మా నాన్నగారు చనిపోవడంతో డెంటిస్ట్‌గా వెళ్లేందుకు మనసు అంగీకరించ లేదు. దీంతో ఓ కూల్‌ డ్రింక్‌ షాపులో ఎప్పుడూ కూర్చుని కాలక్షేపం చేసేవాడిని’ అని మంత్రి తెలిపారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారని అడిగితే ‘డాక్టర్‌ చదివాడు, ఖాళీగా తిరుగుతున్నాడు’ అని  చెప్పేదన్నారు. దీంతో నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పారు. అయితే వారు మూడు నెలలు ఆగి వస్తే చెబుతామనడంతో అక్కడ చేరే అవకాశం రాలేదన్నారు. ఈలోగా మా బాబాయి చనిపోవడం, అనుకోకుండా...

కాచిగూడలో ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్‌ తప్పిన పెను ప్రమాదం

   నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు-హైదరాబాద్‌  హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. ఐదు బోగీల వరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాచిగూడ ఆస్పత్రికి తరలించారు. ఈ  ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

సేనకు సీఎం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ! ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన ప్రయత్నాలు

  ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తెలిపేందుకు శివసేనకు సమయం దగ్గరపడుతోంది. సర్కారు కొలువుతీరాలంటే సేనకు కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్‌తో చర్చల తర్వాతే తమ వైఖరి తెలియజేస్తామని చెబుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్సీపీతో శివసేన బేరసారాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రెండు పార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే ఎన్పీసీ, కాంగ్రెస్‌లకు చెరొకటి చొప్పున రెండు డిప్యూటీ సీఎం పదవులిస్తామని శివసేన ఆఫర్‌ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవికి కూడా సేన నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ఏర్పడిన తర్వాత మిత్రపక్షాల మద్దతుతోనే సీఎం ఎన్నిక ఉంటుందని శివసేన వర్గాలు చెబుతున్నాయి.  గవర్నర్‌ను కలవనున్న ఏక్‌నాథ్‌ మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరి తెలియజేసేందుకు శివసేన...

మాట తప్పి.. ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటున్నారు: శివసేన ఫైర్

  బీజేపీపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. అహంకారపూరితంగా బీజేపీ వ్యవహరిస్తోందని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షంలో కూర్చుంటామని చెబుతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు కుదిరిన 50:50 ఫార్ములాకు కట్టుబడకుండా, పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తోందని అన్నారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు మరింత సమయాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇస్తే బాగుంటుందని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం 72 గంటల సమయం ఇచ్చిన గవర్నర్... తమకు మాత్రం తక్కువ సమయాన్నే ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలనే బీజేపీ యోచనలో ఇదొక భాగమని చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాసక్తతను వ్యక్తం చేసిన నేపథ్యంలో, శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  

ఎన్డీయే నుంచి వైదొలుగుతున్న శివసేన?.. కేంద్రమంత్రి రాజీనామా.. కాసేపట్లో ఉద్ధవ్ థాకరే ప్రకటన

  బీజేపీ మిత్రపక్షం శివసేన.. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర పదవుల్లో ఉన్న తమ నేతలతో శివసేన రాజీనామా చేయిస్తోంది. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తాను ప్రధాని మోదీ సర్కారు నుంచి బయటకు వస్తున్నానని ఈ రోజు ఉదయం అరవింద్ సావంత్ ప్రకటించారు. అసంబద్ధమైన వాతావరణంలో తాను కేంద్ర మంత్రిగా కొనసాగలేనని చెప్పుకొచ్చారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు పొందాలనుకుంటే శివసేన.. ఎన్డీయే నుంచి వైదొలగాలని ఎన్సీపీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్డీయే నుంచి శివసేన బయటకు వస్తున్నట్లు శివసేన అధ్యకుడు ఉద్ధవ్‌ థాకరే కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.  

ఇంకా ఎంత కాలం ప్రయత్నిస్తారు బాబూ?: విజయసాయి రెడ్డి

  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియంను ప్రవేశ పెడుతున్నామని సీఎం జగన్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనిపై టీడీపీ నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. 'ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం  ప్రతి విద్యార్థి హక్కు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధన జరగాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా బలహీన వర్గాల వారిని ఉంచాలని ఇంకా ఎంత కాలం ప్రయత్నిస్తారు బాబూ?' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.