Skip to main content

Posts

Showing posts from November 3, 2019

త్వరలో మూడో ప్రపంచ యుద్ధం.. కే ఏ పాల్ వీడియో.. ఆర్జీవీ ట్వీట్..

త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.  త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే ఏడుగురు దేశాధినేతలను కలిశానని వెల్లడించారు. అందుకే తాను పలు కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నానని, అందుకు క్షమించాలని అన్నారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేఖ కూడా రాయబోతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి, దండాలు అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా, ఆర్జీవీ కేఏ పాల్‌పై పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ఆయన గతంలో...

చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌

 కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ..  ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతల తీరుపై పవన్‌ నిప్పులు చెరిగారు. అద్భుత పాలన అందిస్తే నేను.. సినిమాలు చేసుకుంటా ‘‘అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నాయకులంతా బాధ్యతగా ఉండుంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది. సీఎం జగన్‌ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఇసుక కొరత వల్లే అభివృద్ధి ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాక...

జనసేన లాంగ్‌మార్చ్‌ లైవ్‌ వీక్షించండి

తెలుగుతల్లికి పూలమాల వేసి లాంగ్ మార్చ్ ప్రారంభించిన పవన్ కల్యాణ్

  రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ లాంగ్ మార్చ్ కొద్దిసేపటి క్రితమే మద్దిలపాలెం నుంచి ప్రారంభమైంది. మొదట పవన్ కల్యాణ్ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. జనసేన నిర్వహిస్తున్న ఈ లాంగ్ మార్చ్ మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ప్రస్తుతం విశాఖ నగరం జనసంద్రంగా మారింది. భారీగా తరలివచ్చిన భవన నిర్మాణ రంగ కార్మికులు, జనసేన కార్యకర్తలతో మద్దిలపాలెం వద్ద కోలాహలం నెలకొంది. లాంగ్ మార్చ్ లో మొదటి వరుసలో పవన్ తో పాటు భవన నిర్మాణ కార్మికులు నడవనున్నారు. రెండో వరుసలో మహిళలు, మూడో వరుసలో జనసైనికులు ఉంటారని తెలుస్తోంది. లాంగ్ మార్చ్ అనంతరం ఓల్డ్ జైల్ రోడ్ లో జనసేన బహిరంగ సభ ఉంటుంది

పవన్ కల్యాణ్ రెండున్నర కి.మీ నడుస్తూ లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  ఇసుక సమస్యతో ఏపీలో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని నిరసన తెలుపుతోన్న జనసేన పార్టీ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ ఉంటుంది. దాదాపు 2.5 కి.మీ.మేర  ఇది కొనసాగుతుంది. అయితే, దీనికి లాంగ్ మార్చ్ అంటూ పేరు పెట్టడంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. 'లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఈ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు' అని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  

అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..! మంత్రులకు యూపీ సీఎం యోగి వార్నింగ్‌

కొన్ని రోజుల్లో అయోధ్య కేసు తుది తీర్పువెలువడనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరాదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ తన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తీర్పు వచ్చే వరకు నోర్లకు పనిచెప్పకండని కాస్తగట్టిగానే హెచ్చరించారని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు. ‘అధికార ప్రభుత్వానికి అనూకూలంగా సుప్రీం తీర్పు వస్తుందని అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకండని మా ముఖ్యమంత్రి యోగిజీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంత్రులందరూ వ్యక్తిగతంగా దిక్కత్‌ జారీ చేశారు. ఈ విషయంలో భాజపా అధిష్ఠానం కూడా హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా..అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలు చేసుకోకూడదనే నిబంధన విధించారు. హిందూ, ముస్లిం వర్గాలకు ప్రభుత్వం తరఫున మా విన్నపం ఇదే. వేడుకలు చేసుకొని మరొకరి మనోభావాలు దెబ్బతీయకండి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ దీనిపై సమావేశాలు కూడా నిర్వహించింది. భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించింది. 

నందమూరి వారసుడు ఎంట్రీ ఎప్పుడు?

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో మోక్షజ్ఞ, అదిగో మోక్షజ్ఞ అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తూనే ఉన్నారు. బాలయ్య నూరో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకో సినిమా కోసం కూడా అదే ప్రచారం కంటిన్యూ అయ్యింది. బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం షురూ కావడం లేదు. అసలింతకీ మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? లేదా? అనే ఆలోచనకి అభిమానులు వచ్చేశారు. అసలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదనీ, కావాలని బలవంతం చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. మరి ఈ గుసగుసలకు చెక్‌ పెట్టాలన్నీ, రూమర్స్‌కి సడెన్‌ బ్రేక్‌ ఇవ్వాలన్నా ఒక్కటే మార్గం, మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కావడమే. కానీ ఎప్పుడు.? అందుకు సమయమొచ్చిందంటున్నారిప్పుడు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్‌.రామారావు దర్శకత్వంలో 'రూలర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుతో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమాతో పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం. ...

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపై మరింత ఆసక్తిని పెంచేసిన నిర్వాహకులు.. సర్ ప్రైజ్ కు సిద్ధమా?

తెలుగు బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.  గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్, క్యాథరిన్ తో పాటు పలువురు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ షో నిర్వాహకులు విడుదల చేసిన ఓ ప్రోమోను చూస్తే బుల్లితెర యాంకర్లు కూడా గ్రాండ్ ఫినాలేకు వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ షోకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సినీనటుడు శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను షూటింగ్‌ అయినా మానేస్తా కానీ బిగ్‌బాస్‌ మాత్రం మాననని అన్నాడు. గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీల హంగామాతో మామూలుగా ఉండదని తెలుస్తోంది. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్ కే అధికంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్ విజేత ఎవరో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. టైటిల్ పోరులో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి నిలిచారు. వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం జరిగే గ్రాండ్‌ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్...

170 మంది ఎమ్మెల్యేల మద్దతు: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన నౌత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని దీంతో ఆ  సంఖ్య 175కు చేరే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ విఫలమైతే రెండో పెద్ద పార్టీగా శివసేన... ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' లోనూ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సిద్ధాంతాలు వేర్వేరైనా మహారాష్ట్రలో కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని శివసేన చెప్పింది. కాగా, మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే.వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోంది

5100 రూట్లకు అనుమతులిస్తే కార్మికుల పరిస్థితి ఏంటి?: కేసీఆర్ ప్రకటనపై ఆశ్వత్థామరెడ్డి స్పందన

కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని, కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఆర్టీసీలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. 5100 రూట్లకు అనుమతులు ఇస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ డిమాండ్లను కేసీఆర్ అంగీకరిస్తే యూనియన్లు ఉండవని ఆయన చెప్పారు. కాగా, నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. ఆర్ట...

పొలిటికల్ జర్నీకి బ్రేక్.. ‘పింక్’ రీమేక్‌కు రెడీ

పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సినిమాల్లోకి ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాదు దర్శకుడు, నిర్మాత కూడా ఖరారు అయ్యారు. మీరు చదువుతున్నది నిజంగా నిజం. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎమ్‌సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్కాగా హిందీలో ఘన విజయం సాధించిన పింక్‌ను తమిళ్‌లో ఇటీవల అజిత్ రీమేక్ చేశాడు. ‘నేర్కొండ పావై’ పేరుతో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీ రాబోతుంది. అయితే పవన్ చివరగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఙ్ఞ్యాతవాసిలో కనిపించారు. ఆ తరువాత పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన ఆయా స్థానాల్లో ఓడిపోయారు. అయినప్పటికీ.. ప్రజల తరఫున సమస్యలపై ఆయన పోరాడుతున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. రాజకీయాలకు పూర్...

మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం

ప్రధాని మోదీ తీరు పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు, ‘ గాన గంధర్వ ‘ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని కలిసిన సందర్భంలో ఆయన, మరికొందరు తమపట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని బాలు తన ఫేస్ బుక్ లో మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. తమ సెల్ ఫోన్లన్నీ లాక్కున్నారని, వాటికి టోకెన్లు ఇచ్చారని, అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం ప్రధానితో సెల్ఫీలు దిగారని ఆయన అన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ ఈనాడు ‘ చీఫ్ రామోజీరావుకు నేనెంతో కృతజ్ఞుడిని.. ఆయన చేసిన ఏర్పాట్ల కారణంగా నేను గత నెల 29 న ఢిల్లీలో మోదీ నిర్వహించిన రిసెప్షన్ కి వెళ్లాను.. కానీ వెళ్ళగానే మా సెల్ ఫోన్లను వదిలేయాలని అక్కడి సెక్యూరిటీ కోరారు. వాటికి మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ అదే రోజున బాలీవుడ్ స్టార్స్ మోదీతో సెల్ఫీలు దిగడం చూసి ఆశ్చర్యం వేసింది ‘ అని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీయిజాన్ని ప్రమోట్ చేసేందుకు మోదీ గతవారం తన నివాసంలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ...

అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ ‘.. 50 : 50 పై ఒవైసీ సెటైర్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ-శివసేన మధ్య కొనసాగుతున్న సిగపట్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెరైటీగా స్పందించారు. ‘ 50 : 50 అన్నది మార్కెట్ లో కొత్త బిస్కెట్ లా ఉంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. (అధికారాన్ని చెరి సగం పంచుకునేందుకు శివసేన.. బీజేపీతో 50 : 50 షేరింగ్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన సంగతి విదితమే. అయితే ఈ ఫార్ములా పట్ల బీజేపీ విముఖత చూపుతోంది.) తాము బీజేపీకి గానీ, శివసేనకు గానీ మద్దతు తెలుపబోమని ఒవైసీ స్పష్టం చేశారు. ‘ 50 : 50 అంటే ఏమిటి ? ఇది మార్కెట్లో లభించే కొత్త బిస్కెట్టా ? ముందు మహారాష్ట్ర ప్రజలకోసం ఏదో ఒకటి చేయండి.. సతారా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిల్చిన నష్టాల గురించి బీజేపీ గానీ, సేన గానీ పట్టించుకున్నాయా ? సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ‘ అంటే ఇదేనా ? ‘ అని ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం రెండు సీట్లను గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో ఫడ్నవీస్ గానీ, మరొకరు గానీ సీఎం అవుతారా కారా అన్న విషయం తనకు తెలియదని, అంతా ‘ మ్యూజికల్ చైర్స్ ‘ ఆట ఆడుతున్నారని ఒవైసీ పేర్కొన్నా...

రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

మహేష్ ఫ్యాన్స్‌కు నిర్మాత భరోసా ఇచ్చేశాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఆయన ఊరించాడు. ఇక ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అసలు ఆ నిర్మాత ఏం చెప్పాడు..? మహేష్ ఫ్యాన్స్‌కు ఏ ట్రీట్ ఇవ్వబోతున్నాడు..? అనుకుంటున్నారా..? మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం పై వస్తోన్న వార్తలు మహేష్ అభిమానులను కాస్త కలవరపాటుకు గురిచేశాయి. ఈ సినిమా పాటల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు మనస్ఫర్థలు వచ్చాయని.. ఈ మూవీ ఆల్బమ్‌పై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురం’లో చిత్రం కూడా మహేష్ మూవీతో పోటీ పడనుండగా.. ఇప్పటికే వారు ప్రమోషన్లలో దూసుకుపోతూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్...

దూసుకొస్తున్న పెను తుఫాన్.. తెలంగాణకు వర్ష సూచన

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ భారత తీరం వైపున కదులుతూ రాగాల 24 గంటల్లో పెను తుఫాన్‌‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అటు తెలంగాణాలో ఆదివారం, సోమవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇకపోతే హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కోస్తాంధ్రాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట పొలాలు అన్నీ నీటిపాలయ్యాయి.

బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్.. రన్నరప్‌గా శ్రీముఖి

ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకంకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి అవుతుందని అందరూ కూడా అనుకోగా.. ఊహించని విధంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే అనూహ్యంగా లక్ రాహుల్‌ని వరించింది. సీజన్ విన్నర్‌గా ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే.. రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఫైనల్ రేసులో రన్నరప్‌గా అవుతాడని అనుకున్న రాహుల్ టైటిల్ సొంతం చేసుకోగా.. శ్రీముఖి రెండు పర్సెంట్ ఓట్లు తేడాతో రన్నరప్‌గా నిలిచినట్లు సమాచారం. ఇక వరుణ్ సందేశ్ మూడో స్థానంలో.. బాబా భాస్కర్ నాలుగో స్థానంలో.. అలీ రెజా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మెగాస్టార్ చ...

కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం

. ఢిల్లీలో వాయు కాలుష్యం అతి పెద్ద సమస్యగా మారింది. దీపావళి పండుగ అనంతరం ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో జనం ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. అలాగే.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. యూపీ, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కాగా.. ప్రస్తుతం ఈ లేఖలపై పెద్ద దుమారమే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకే ఉమ్మడిగా కృషి చేయాలని ఢిల్లీ పరిసర రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా.. హర్యాణా, పంజాబ్‌ రాష్ట్రాల కారణంగా.. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని.. ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు.. విద్యార్థులచే ల...

నటుడు విజయ్ సేతుపతిపై వ్యాపారుల ఆగ్రహం.. ఇంటి ముట్టడికి రెడీ!

  ఓ వ్యాపార సంస్థ రూపొందించిన మండి యాప్‌లో నటించిన తమిళ నటుడు విజయ్ సేతుపతిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ నటించిన ఆ యాప్ చిరు వ్యాపారుల పొట్ట కొట్టేలా ఉందని మండిపడుతున్నారు. అందులో నటించిన విజయ్ సేతుపతి కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువులు ఆ యాప్‌లో దొరకుతాయని, ఆన్‌లైన్‌లో ఇంటి వద్ద నుంచే కొనుగోలు చేసుకోవచ్చని ప్రచారం చేశాడు. తమ పొట్టకొట్టేలా ఉన్న ఈ యాప్‌లో విజయ్ సేతుపతి నటించడంపై మండిపడుతున్న వ్యాపారులు అతడి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని చిరు వ్యాపార సంఘాల నాయకుడు ఒకరు తెలిపారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఇలాంటి వాటిని తాము అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.

కొత్త మ్యాప్ విడుదల చేసిన కేంద్రం.. అమరావతి గల్లంతు!

కేంద్రం తాజాగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గల్లంతైంది. జమ్మూకశ్మీర్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఏడు నుంచి 9కి పెరిగింది. దీంతో వాటిని చేరుస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఆ మ్యాప్‌లోని అన్ని రాష్ట్రాలు.. వాటి రాజధానులను చూపించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మాత్రం గుర్తించలేదు. ఏపీ రాజధానిని చూపించే ఎటువంటి సూచికలు ఆ మ్యాప్‌లో లేకపోవడం వివాదాస్పదమవుతోంది. మ్యాప్‌లో అసలు అమరావతి పేరే లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి ఐదేళ్లు దాటినా కేంద్రం దానిని గుర్తించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.