బుల్లితెర ప్రముఖ నటి, ‘వదినమ్మ’ ఫేం శివపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె కోలుకుని నిన్న రాత్రే ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తాను అనుభవించిన మానసిక సంఘర్షణకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ‘వదినమ్మ’ యూనిట్‌పైనా, ఆ సీరియల్‌ను నిర్మిస్తూ, నటిస్తున్న ప్రభాకర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా బారినపడి రెండు ఆసుపత్రులు మారిన విషయం ప్రభాకర్‌కు, యూనిట్‌కు తెలుసని, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన గురించి పట్టించుకోలేదని, కనీసం ఎక్కడ ఉన్నాను? ఎలా ఉన్నానన్న విషయం గురించి కూడా ఎవరూ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదని, పైపెచ్చు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు. తనకు కనుక ఈ పరిస్థితి రాకుంటే ఎవరెలాంటివారన్న విషయం తెలిసేది కాదని శివపార్వతి తెలిపారు. ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా ప్రాణం ఒకటేనని, ఆపద కూడా ఒకటేనని పేర్కొన్న ఆమె.. కరోనా వైరస్ అనేది చిన్న విషయం కాదన్న విషయం మొత్తం ప్రపంచానికి తెలుసన్నారు. ఆర్టిస్టుల మధ్య ఓ అనుబంధం ఉంటుందని, కలిసి పనిచేస్తున్నప్పుడు...