హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రిషికేశ్ లో ఫ్రాన్స్ కు చెందిన ఓ యువతి వివస్త్రగా నిలబడి వీడియో తీసుకుందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి గంగా నదిపై నిర్మించిన లక్షణ్ జులా (వంతెన)పై నిలబడిన ఆమె, సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆమె పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫ్రాన్స్ కు చెందిన 27 ఏళ్ల మేరీ హెలెనే అనే యువతిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయి, విమర్శలు వచ్చిన తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తానేమీ పూర్తిగా వివస్త్రను కాలేదని, లైంగిక అఘాయిత్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశానని తెలిపింది. తాను నెక్లెస్ లను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటానని,దానికి ప్రమోషన్ నిమిత్తం ఈ పని చేశానని తమ విచారణలో పేర్కొందని స్థానిక పోలీసు అధికారి పీకే సక్లానీ వెల్లడించారు. తాను ఈ వంతెనపై నడుస్తున్నప్పుడల్లా, పురుషుల నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని, భారత సోదరీమణులు, ఇతర మహిళలు కూడా ఇక్కడ ఇదే విధమైన వేధింపులను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని మేరీ పేర్కొంది....