Skip to main content

Posts

Showing posts from August 9, 2020

తక్కువ ధరతో పోకో ఇస్తున్న బెస్ట్ ఫోన్ !

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫోన్ లు లాంచ్ చేసింది.. అలాంటి ఈ పోకో బ్రండ్ ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ ని లాంచ్ చేసింది.. అదే పోకో ఎం2 ప్రో అనే కొత్త స్మార్ట్ ఫోన్ . ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా తక్కువే. మరి ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడతెలుసుకుందాం. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు, ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కవైపు అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది. ఈ పోకో ఎం2 ప్రోలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గానూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ అవుట్ ...

పాపడ్ తో కరోనా తగ్గుతుందని చెప్పిన మంత్రికి పాజిటివ్

 కరోనా తగ్గుతుందని చెప్పిన మంత్రికి పాజిటివ్…… కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో 2 సార్లు కరోనా టెస్ట్ చేయించుకోగా, రెండోసారి పాజిటివ్ గా తేలినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మంత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.  తనను కలిసిన వారు, తనతో సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అర్జున్ రామ్ మేఘ్వాల్‌ బిక‌నీర్ నుంచి బిజెపి ఎంపిగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ కంపెనీ త‌యారు చేసిన పాపడ్‌ తింటే శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.,

టాలీవుడ్ లో దుమారం..! సినిమా షూటింగులపై వాస్తవాలు దాచారా…? |

  కరోనా కాటు వేసింది. నిజమే..!  సినీరంగంలో చాలా మందికి కరోనా సోకింది. నిజమే..! షూటింగులు ఆగిపోయాయి. నిజమే…! షూటింగులుకి అనుమతులు ఇవ్వాలంటూ చిరు, నాగార్జున కేసీఆర్ తో భేటీ వేశారు. నిజమే…!! ఇన్ని నిజాలు వెనుక మరో కఠోర నిజమూ ఉంది. షూటింగుల అనుమతుల్లో మతలబు ఉంది.., సీనియర్లు దాచిపెట్టిన తతంగమూ ఉంది. తెరబయట చర్చల్లో బయటపడని రహస్యము ఉంది.. అది ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నోటా, ఈ నోటా పాకుతుంది. కానీ ఎవ్వరూ ఏమి అనలేక, చేయలేక గమ్మునున్నారు. ఇంతకూ ఏమిటా నిజం అంటే…!! కేసీఆర్ పెట్టిన మెలిక ఏమిటి…? చిరు, నాగార్జున బృందం కేసీఆర్ తో భేటీ అయిన వార్త పాత అంశమే. కానీ దీనిలో దాచిన పాయింట్లే ఇప్పుడు కొత్తవి. అవే ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. “కేసీఆర్ తో భేటీ సందర్భముగా షూటింగులకు అనుమతులు ఇవ్వాలి అంటూ నటులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కాస్త ఆలోచించిన కేసీఆర్ 60 ఏళ్ళ పైబడిన వారు తప్ప… ఈ వయసు లోపు ఉన్న వాళ్లకు అనుమతులు ఇస్తాము అన్నారు. కానీ ఈ మెలిక మనోళ్లకు నచ్చలేదు. ఎందుకా అని ఆరాతీస్తే … భేటీకి వెళ్లిన చిరంజీవి వయసు 65 .., నాగార్జున వయసు 61 ....

టిక్ టాక్ ను చేజిక్కించుకునేందుకు ట్విట్టర్ యత్నం!

  ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను చేజిక్కించుకునేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ మీడియా సంస్థ 'బ్లూంబెర్గ్' ఆసక్తికర కథనం వెలువరించింది. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కూడా టిక్ టాక్ ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. ట్విట్టర్ భారీ విలీనానికి సన్నద్ధమవుతోందని, చైనా సంస్థ బైట్ డ్యాన్స్ కు చెందిన టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని వివరించింది. అయితే, మైక్రోసాఫ్ట్ వంటి ట్రిలియన్ డాలర్ల దిగ్గజాన్ని కాదని, 29 బిలియన్ డాలర్ల విలువైన ట్విట్టర్ ఏ విధంగా టిక్ టాక్ ను టేకోవర్ చేస్తుందన్న సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సెప్టెంబరు 15 నాటికి టిక్ టాక్ తో తమ సంప్రదింపులు, చర్చలు పూర్తవుతాయని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కోసం ట్విట్టర్ ప్రయత్నిస్తోందన్న 'బ్లూంబెర్గ్' కథనం ఆసక్తి కలిగిస్తోంది.  

మహేష్ కి జరిమానా..!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆదివారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు మొక్కలు నాటారు. అయితే ఆయన మొక్కలు నాటుతున్న సందర్భంలో మాస్కును ధరించలేదు. దాంతో బహిరంగ ప్రదేశంలో మాస్క్ లేకుండా తిరిగినందుకు ఆయనకు వెయ్యిరూపాయలు జరిమానా విధించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 24 గంటల్లో  3.1 కోట్ల ట్వీట్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రిన్స్ కు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 

జగన్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి : కేటీఆర్‌

    ఆస్క్‌ మీ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని అన్నారు. అంతే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని మరి కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వసతులు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 23వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆ సంఖ్యను త్వరలో 40వేలకు పెంచుతామని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైనదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అన్ని ఏరియా ఆస్పతుల్లో ఐసీయూ యూనిట్స్‌ మొదలుపెట్టామని, ఉచితంగా డయాలసిస్‌ కూడా నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నార...

ముంబయిలో సరికొత్త టెక్నాలజీ.... వాయిస్ టెస్ట్ చేసి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు!

  దేశంలో కరోనాతో అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో ముంబయి మహానగరం ఒకటి. నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ముంబయిలో కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరిందన్న అభిప్రాయాల నేపథ్యంలో, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించుకుంది. కరోనా రోగులను గుర్తించేందుకు ఇప్పటివరకు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాల్సి వస్తోంది. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఓ వ్యక్తి వాయిస్ టెస్ట్ చేసి అతడికి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు. కరోనా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని సెల్ ఫోన్ లో గానీ, కంప్యూటర్ ద్వారా గానీ మాట్లాడితే, ఆ మాటలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తారు. ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి, అతడి రోగ లక్షణాలను అంచనా వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో అభివృద్ధి చేశారు. సాధారణంగా ఓ వ్యక్తి బలంగా మాట్లాడాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యమే కీలకం. కరోనాతో ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు ఆ వ్యక్తి గొంతుక నుంచి వచ్చే బలహీన ధ్వనులను ఈ ట...

రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్ ను పూర్తిగా నిలిపివేసిన రిజర్వ్..

  గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక్క 2 వేల రూపాయల నోటును కూడా ముద్రించ లేదు. ఈ విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానంగా స్వయంగా ఆర్బీఐ తెలియజేసింది. నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి, ఆపై రూ. 2000 నోటును కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ గత సంవత్సరం మాత్రం ఎటువంటి ముద్రణా కార్యకలాపాలు చేపట్టలేదు. ఇదే సమయంలో రూ. 500 నోట్ల ముద్రణ మాత్రం గణనీయంగా పెరిగింది. 2016-17లో ముద్రితమైన రూ. 429.22 కోట్ల విలువైన 500 నోట్లతో పోలిస్తే, గత సంవత్సరం దాదాపు రెట్టింపుగా రూ. 822.77 కోట్ల విలువైన ముద్రణ జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు, రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ఇక 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసింది. అన్ని రకాల నోట్లనూ కలిపి గత నాలుగేళ్...

అదరగొట్టే బీజీఎంతో 'సర్కారు వారి పాట'...మోషన్ పోస్టర్ ఇదే!

  టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉదయం ఆయన 25వ చిత్రం 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆపై నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్ గా మారింది. ఈ మోషన్ పోస్టర్ లో రూపాయి నాణాన్ని చూపిస్తూ, దాన్ని మహేశ్ బాబు గాల్లోకి ఎగరవేస్తూ కనిపిస్తారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా 'సర్కారు వారి పాట' హుక్ లైన్ చిన్న బీట్ గా వినిపిస్తుంది. ఇందులో మహేశ్ ముఖం కనిపించక పోవడం మాత్రం ఫ్యాన్స్ ను ఒకింత నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టెయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

అందం, అభినయం నీకు దేవుడిచ్చిన వరం:మహేశ్ బాబును ఉద్దేశించి చిరంజీవి!

  నేడు సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు పుట్టిన రోజు కారణంగా పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ కు శుభాభినందనలను ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించారు.  "అందం, అభినయం మీకు భగవంతుడు ఇచ్చిన వరం. మరెన్నో మరచిపోలేని పాత్రలు మీరు చేయాలని, మీ కలలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే టూ మహేశ్. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.  

విజయవాడ అగ్నిప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం జగన్‌కి మోదీ ఫోన్‌

 విజయవాడలోని కోవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు  రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, అగ్ని ప్రమాదంపై సీఎం జగన్‌కు  ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్‌ను ప్రైవేటు ఆసుపత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని మోదీకి సీఎం చెప్పారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని ప్రధానికి వివరించారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని ఆయన అన్నారు. కాగా, రమేశ్ ఆసుపత్రి లీజుకు తీసుకున్న ఆ హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌  కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.  

విజయవాడ కొవిడ్ చికిత్సా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం!

తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోంది. ఈ భవంతిలో ప్రస్తుతం దాదాపు 40 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది వరకూ వైద్య బృందం ఉన్నట్టు తెలుస్తోంది. మంటలతో భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించగా, ఊపిరాడని బాధితులు కిటికీల వద్దకు వచ్చి కేకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు బాధితులు ఇప్పటికే సొమ్మసిల్లి పడిపోగా, వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.