Skip to main content

రవి గాడు వెదవ అంటూ రెచ్చిపోయిన పునర్నవి

Bigg Boss 3: Punarnavi fires on ravikrishnaబిగ్ బాస్ సీజన్ 3 మంగళవారం నాటితో 66వ ఎపిసోడ్‌ లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ లో సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రాసెస్ గురించి బాబా భాస్కర్, వరుణ్ చర్చించుకున్నారు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనకు భాష రాదని విమర్శించడం తనకు నచ్చలేదని వరుణ్ తో అన్నారు బాబా భాస్కర్. 
జనాలు, హౌస్ మేట్స్ పది వారాలుగా తనను చూస్తున్నారని.. అలాంటిది హౌస్ మేట్ లో ఒకరు ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని అందుకే వదిలేశానని బాబా భాస్కర్ అన్నారు. మరోపక్క పునర్నవి కూడా రాహుల్ తో నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంది.
సీన్ లోకి వరుణ్, వితికాలు ఎంటర్ అవ్వడంతో పునర్నవి రెచ్చిపోయింది. 'నువ్ రవితో మాట్లాడావా..?' అంటూ వరుణ్.. వితికాని అడగడంతో 'నేను ఎందుకు మాట్లాడతా..' అని వితికా చెప్పేలోపు పునర్నవి కల్పించుకుని 'వాడా...? ఆ రవిగాడా.. వాడొక వెదవ.. ఆ వెదవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు' అంటూ తెగ రెచ్చిపోయింది.
సెన్స్ లెస్ ఆర్గ్యుమెంట్ చేసే అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడి బతుకులో  ఎప్పుడైనా తన ఒపీనియన్‌ని చెప్పాడా? అంటూ చాలా మాటలు అనేసింది. 

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.