Skip to main content

Posts

Showing posts from August 23, 2020

దేశంలో సినీ, టీవీ షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 కరోనా దెబ్బకు స్తంభించిపోయిన సినీ, టీవీ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. తాజాగా అన్ లాక్-3లో భాగంగా కేంద్రం సినీ, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే, అనేక నిబంధనలను విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన చేశారు. కెమెరా ముందు ఉండే నటీనటులు తప్ప మిగతా వాళ్లందరూ మాస్కులు వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు

చిరుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోహ‌న్‌బాబు

మెగాస్టార్ చిరంజీవి  శ‌నివారం(ఆగ‌స్ట్‌22) 65వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీ నుండే కాదు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చిరంజీవికి సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పుట్టిన‌రోజుకి చిరు చిర‌కాల మిత్రుడొక‌రు ఆయ‌న‌కు కొయ్య‌తో చేసిన‌ బుల్లెట్‌ను కానుక‌గా పంపించారు. ఇంత‌కూ చిరుకు కానుక పంపిన ఆ చిరకాల మిత్రుడెవ‌రో కాదు.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు. ఆ విష‌యాన్ని చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశారు.  ‘‘నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... థాంక్యూ మోహన్‌బాబు’’ అంటూ మెసేజ్‌తో పాటు మోహ‌న్‌బాబు పంపిన గిఫ్ట్‌ను ఫొటోను కూడా షేర్ చేశారు. 

కరాచీలోనే దావూద్‌.. అంగీకరించిన పాక్‌‌! అండర్‌ వరల్డ్‌ డాన్‌పై ఆర్థికంగా ఆంక్షలు

  అండర్‌ వరల్డ్‌ డాన్‌పై ఆర్థికంగా ఆంక్షలు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, అధోజగత్తు నేత (అండర్‌ వరల్డ్‌ డాన్‌) దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాక్‌ ఎట్టకేలకు అంగీకరించింది. దావూద్‌ తమ దేశంలో లేడని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న ఆ దేశం ఈ విషయాన్ని ఎట్టకేలకు అంగీకరించింది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) విధించిన గ్రే లిస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తాజాగా 88 నిషేధిత ఉగ్ర సంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావూద్‌ పేరు ఉండడంతో ఇన్నాళ్లు దాచిన నిజం బయటకొచ్చింది. పారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను 2018లో గ్రే లిస్ట్‌లో పెట్టింది. 2019 చివరి నాటికి ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించింది. ఈ క్రమంలో గ్రే లిస్ట్‌ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తాజాగా ఆ దేశంలో ఈ నెల 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో నిషేధిత ఉగ్రవాద సంస్థలు సహా, వాటి నేతల ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. వారి స్థిర, చరాస్తులను జప్తు‌ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తున్నట్లు పేర...

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు

  కరోనా కారణంగా వాయిదా పడిన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు.  కరోనా కారణంగా వాయిదా పడిన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. దానికి తగ్గట్టుగానే పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్‌ను కూడా సిద్ధం చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. ఇక ఈ కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2020-21లో 181 రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి. అటు సెలవులను కూడా తగ్గించింది. దసరా పండుగకు (అక్టోబర్ 22 నుంచి 26 వరకు) ఐదు రోజులు ఇవ్వనుండగా.. సంక్రాంతికి (వచ్చే ఏడాది జనవరి 12 నుంచి జనవరి 17 వరకు) ఆరు రోజులు ఇవ్వనున్నారు.  ఇక క్రిస్మస్‌కు డిసెంబర్ 24 నుంచి 28 వరకు.. అలాగే వచ్చే ఏడాది వేసవి సెలవులు 2021, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చారు. కాగా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు...

చర్మం కింది పొరకు టీకా... భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు కేంద్రం మరో కీలక అనుమతి!

  కరోనా మహమ్మారిని అడ్డుకునేలా భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ ను చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రొటోకాల్ నిబంధనలను సడలించాల్సివుంటుంది. ఇందుకోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని నుంచి తుది అనుమతుల కోసం సంస్థ చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ తో సంబంధం లేకుండా విడిగా ఈ విధానంలో టీకా పనితీరును పరిశీలించాలన్నది సంస్థ అభిమతం. ఏదైనా టీకాను పలు మార్గాల ద్వారా శరీరంలోకి పంపుతారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాల ద్వారా వేసే టీకాలను ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. మరో విధానం పేరే ఇంట్రాడెర్మల్ రూట్. దీనిలో భాగంగా చర్మం కింది పొరకు టీకాను ఇస్తారు. ఈ విధానంలో టీకాను ఇస్తే, చాలా స్వల్ప మోతాదు సరిపోతుంది. ఫలితంగా మరింత మందికి టీకాను ఇవ్వడంతో పాటు, ధర కూడా తగ్గుతుంది. ఉదాహరణకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ను తీసుకుంటే, కండరాలకు ఇచ్చే వ్యాక్సిన్ తో పోలిస్తే, చర్మం ద్వారా ఇస్తే, 80 శాతం తక్కువ డోస్ సరిపోతుంది. దీనివల్ల ఒక ఇంజక్షన్ డోస్, నలుగురి నుంచి ఐదుగురికి ఇవ్వచ్చ...

కరోనాకు చెక్ పెట్టేందుకు ఎవరెవరు మాస్క్ ధరించాలంటే?: మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

 కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మందు మాస్క్ ధరించడం. ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా ఈ వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అందరూ మాస్కులు ధరిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కుల విషయంలో తాజాగా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు పెద్దలకు మాదిరిగానే కరోనా వచ్చే అవకాశాలు ఉండడంతో వారు పెద్దలు ధరించినట్టుగానే మాస్కులు ధరించాలని పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లలు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని, వీరికి కరోనా సోకే ప్రమాదం తక్కువని పేర్కొంది. 6 నుంచి 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వివరించింది. పిల్లలు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని స్పష్టం చేసింది.  

ఎంత వద్దని చెబుతున్నా వినని హైదరాబాద్ ప్రజలు... తలపట్టుకుంటున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు రావద్దని, ఆన్ లైన్ లోనే పూజలు, దర్శనం చేసుకోవాలని గణేశ్ ikఉత్సవ కమిటీ ఎంతగా విజ్ఞప్తి చేసినా, భక్తులు వినలేదు. ప్రతియేటా పెట్టే 60 అగుడుల భారీ విగ్రహం స్థానంలో, ఈ సంవత్సరం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేసినా, తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలన్న ఆలోచన లేకుండా, సెల్ఫీలకు ఎగబడ్డారు. పలువురు కనీసం మాస్క్ లు కూడా ధరించక పోవడం గమనార్హం. వీరిని నియంత్రించలేక ఉత్సవ కమిటీ ఇబ్బందులు పడింది. కాగా, ఈ సంవత్సరం ధన్వంతరి నారాయణ గణపతిగా, చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో స్వామి కనిపిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా దర్శనం లేదని, దూరం నుంచి స్వామిని చూసి వెళ్లిపోవాలని నిర్వాహకులు పదేపదే చెబుతున్నా, ఎవరూ వినే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు.  

మెగా కుటుంబంలో మరో హీరోకి పెళ్లి.. సారీ ప్రభాస్‌ అన్న అంటూ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన సాయితేజ్

  ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి.... More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020  టాలీవుడ్ యంగ్‌ హీరోలకి వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మొదట నిఖిల్‌ పెళ్లి చేసుకున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్‌ బై చెప్పాడు. ఆ తర్వాత నితిన్‌కి పెళ్లి అయిపోయింది. సింగిల్‌ లైఫ్‌కి టాటా చెప్పేసి ఇంటివాడయ్యాడు. ఆ తర్వాత రానా కూడా అదే దారిలో పయనించాడు. ఇప్పుడు మెగా హీరో సాయి తేజ్ వంతు వచ్చేసింది. టాలీవుడ్‌లో పెళ్లి కాని హీరోల జాబితాలో ప్రభాస్‌ను ఒంటరి చేసి సాయి తేజ్‌ కూడా సారీ చెప్పేసి బ్యాచిలర్ లైఫ్‌ నుంచి లెఫ్ట్‌ అయిపోతున్నాడు. ప్రస్తుతం 'సోలో బతుకే సో బెటరు' సినిమాలో నటిస్తోన్న సాయి తేజ్ నిజ జీవితంలో మాత్రం ఆ బతుకుకి టాటా చెప్పేయనున్నట్లు స్పష్టమైపోయింది. తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను రేపు ఉదయం 10 గంటలకు చేస్తానంటూ ఈ కుర్ర హీరో ఓ క్లూ ఇస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు....

ESI కేసు నిందితుడు అచ్చెన్నాయుడు NRI హాస్పిటల్ కు తరలింపు.*

  గుంటూరు నగరములో రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్యెల్యే అచ్చెన్నాయుడును మంగళగిరి సమీపాన నున్న NRI హాస్పిటల్ కు రమేష్ అంబులెన్స్ ద్వారా తరలించారు.