Skip to main content

Posts

Showing posts from August 1, 2020

మాణిక్య6 మృతి పై జనసేన సంతాపం

విశాఖ రాజధాని శంకుస్థాపనకు మోదీ వస్తారా? రారా..?? |

ప్రధాని మోదీ ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఏమనుకుంటున్నారు. తన చేతులతో స్వయంగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన నీరు మట్టి తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మళ్లీ ఇప్పుడు మరో రాజధాని విశాఖ శంకుస్థాపనకు వస్తారా? వచ్చే అవకాశం ఉందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలను పక్కన పెట్టి పద్ధతి ప్రకారం ఒక రాష్ట్ర కొత్త రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రిని పిలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వైసిపి ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ఆహ్వానిస్తుంది. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు. మరి మోదీ వస్తారా? రారా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. రాకపోతే ఒక తంటా!.. వస్తే మరో తంటా ! ఇది మోడీ పరిస్థితి !! ఆగస్టు 15న అధికారికంగా విశాఖ రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నిర్మాణాలు, పూర్తిస్థాయి కట్టడాలు ప్రస్తుతానికి ఏమీ ఉండవు గాని పరిపాలన భవనం, సీఎం క్యాంప్ ఆఫీస్, అధికారుల భవనాలుగా మాత్రం కొన్ని ప్రైవేటు భవనాలను వాడుతుంటారు. మరి వీటి ప్రారంభోత్సవానికి, శంకుస్థాపన కు మోదీని ఆహ్వానిస్తారు. సరిగ్గా ఐదేళ్ల క్రిందట 2015 అక్టోబర్ లో అమరావ...

వైజాగ్ లో క్రేన్ ప్రమాదం 11 మంది మృతి

మ్యూజిక్ ఇష్టపడే వారికి ఫేస్ బుక్ గుడ్ న్యూస్

త్వరలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో మరో కొత్త ఆప్షన్ రానుంది. మ్యూజిక్ ప్రియులను అలరించేందుకు ఫేస్ బుక్ తన అధికారిక సెక్షన్లో ఇండియా, తో పాటు థాయ్లాండ్ దేశంలో మ్యూజిక్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని ఫేస్ బుక్ వెల్లడించింది మ్యూజిక్ కి సంబంధించిన వీడియోలను అందించనుంది దీని కోసం టీ సిరీస్, జీ మ్యూజిక్ లాంటి పలు మ్యూజిక్ సంస్థలతో ఫేస్ బుక్ ఒప్పందం కుదుర్చుకుంది అని సమాచారం

మోదీ శపథం.. 28 ఏళ్ల తర్వాత తొలిసారి

ప్రధాని మోదీ ఈ నెల 5న అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేయనుండగా.. దాదాపు 28 ఏళ్ల తర్వాత మోదీ అయోధ్యకు వస్తుండటం గమనార్హం. అయోధ్యలో రామాలయం నిర్మించండి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోదీ 1992లో అయోధ్యలో తిరంగా యాత్ర చేపట్టారు. అప్పటి లో ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఆ మరుసటి రోజున అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషితో కలిసి అయోధ్య వెళ్లి, అక్కడ స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం జరిగే రోజున తిరిగి అయోధ్యలో అడుగుపెడతానని, అప్పటి వరకు అయోధ్యలో అడుగుపెట్టనని చెప్పారు. 28 ఏళ్ల తరువాత ఆ కల నెరవేరబోతున్నది. మళ్లీ అయోధ్యకు వస్తే మందిర నిర్మాణం జరిగాకే వస్తానని మోదీ అప్పట్లో శపథం చేయగా..అయోధ్య రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజను చేయబోతున్నారు. ఈ విధంగా మోడీ రెండోసారి అయోధ్యకు వస్తున్నారు. నాడు ఆయన పర్యటించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

మోహన్ బాబు ఇంటి ముందు ఆగంతకుల హల్ చల్

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటి ముందు ఈ సాయంత్రం కొందరు ఆగంతకులు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం ఇలా వుంది. ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో వున్న ఓ ఇన్నోవా కారు నగర శివార్లలో వున్న మంచు మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చింది. ఆ సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు అంతా జిమ్ లో వుండి వర్కవుట్ లు చేస్తున్నారు. ఇన్నోవా కారు కావడంతో, గార్డ్ కొత్తవాడు కావడంతో గేటు తీసి లోపలకు వదిలినట్లు బోగట్టా. కారు తిన్నగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చిన తరువాత అందులోంచి దిగిన ఆగంతకులు గట్టిగా కేకలు వేసి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం లాంటి కేకలు వేసినట్లు బోగట్టా. కారులో వచ్చిన వారు కాస్త మద్యం సేవించి వున్నట్లు తెలుస్తోంది. ఇలా కాస్సేపు కేకలు వేసాక, వాళ్లంతట వాళ్లే కారులోకి ఎక్కడి, రివర్స్ చేసుకుని స్పీడ్ గా వెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ మేరకు మోహన్ బాబు పోలీసులుకు విషయం వివరించారని, ఫిర్యాదు చేయబోతున్నారని, సిసి ఫుటేజ్, కారు నెంబర్ అన్నీ వున్నాయని తెలుస్తోంది

అప్పుల అంబానీ రఫేల్ డీల్ తో కోలుకుంటారా?

   భారత దేశానికి ఫ్రాన్స్ దేశం తయారు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు డెలివరీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీ సంస్థ పాత్రపై మరోసారీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. రఫేల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ దస్ ఏవియేషన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్  లిమిటెడ్ ను తన ఆఫ్ సెట్ భాగస్వామిగా చేసుకుంది. దీనిపై దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దేశ రక్షణ రంగానికి విమానాలు తయారు చేసే ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ ఉండగా దివాలా తీసిన అంబానీ సంస్థతో ఏకంగా దస్ ఏవియేషన్ రూ.30000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తన దగ్గర ఏవీ లేవని.. దివాళా తీశానని ఓ కేసులో లండన్ కోర్టులో రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీ చేతులెత్తేశారు. మరి ఈ కీలకమైన రక్షణ ఒప్పందంలో అనిల్ ఎలా భాగస్వామి అయ్యారు.? ఎందుకు ఇందులో చేర్చుకున్నారన్నది పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రక్షణ రంగంలో అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అవినీతే అని.. ఇందులో మోడీ సర...

5జీ వచ్చేస్తుంటే.. ఇంకా 2జీ సేవలెందుకు? చరిత్రలో కలిపేయాలి ఇంటర్నెట్‌కు దూరంగా 30 కోట్ల మంది వినియోగదారులు ముకేశ్‌ అంబానీ

దేశంలో 2జీ సేవలు నిలిపివేసేందుకు సత్వరం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కోరారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలను చరిత్రలో భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో తొలి మొబైల్‌కాల్‌ ఆరంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముకేశ్‌ అంబానీ మాట్లాడారు. మిగిలిన ప్రపంచంతో పాటు భారత్‌ కూడా శరవేగంతో డేటా సేవలు లభించే 5జీ కి సిద్ధమవుతున్నా, ఇంకా 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలకు కూడా దూరంగానే ఉన్నారని ముకేశ్‌ అంబానీ వివరించారు. అందువల్ల సత్వరం 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 1995లో దేశీయంగా మొబైల్‌ సేవలు ఆరంభించాక, ఇప్పటివరకు ఎంతో పురోగతి ఏర్పడిందని గుర్తు చేశారు. తొలుత కాల్‌ చేసినవారు నిమిషానికి రూ.16, కాల్‌ అందుకున్నవారు నిమిషానికి రూ.8 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని, ప్రస్తుతం 4జీ కాల్స్‌ ఉచితంగా చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ల్యాండ్‌లైన్‌ ఫోన్లు ఉన్నా కొంతవరకే  సమాచార సౌలభ్యం ఏర్పడిందని, మొబైల్‌ వచ్చాకే ‘ఎక్కడి నుంచి ఎక్కడికైనా’ సమాచార సేవలు లభ...

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...

ఇక హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫికేషన్ తప్పనిసరి!

ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలకు గురికాకుండా, తప్పనిసరిగా బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) ప్రమాణాలకు అనుగుణంగా హెల్మెట్లను తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. దీనిపై ఆసక్తిగలవారు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, 2016 ప్రకారం తప్పనిసరిగా ద్విచక్ర వాహనాల రైడర్ కోసం రక్షణ హెల్మెట్లను తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తే లోకల్ హెల్మెట్లను ధరించే ద్విచక్ర వాహనదారులు చలానా చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లనే తయారు చేసి, భారత దేశంలో విక్రయించవలసి ఉంటుంది. బీఐఎస్ సర్టిఫైడ్ కానటువంటి హెల్మెట్లను తయారు చేసే కంపెనీల యాజమాన్యాలు కూడా జైలు శిక్ష, జరిమానాలకు పాత్రులవుతారు.

ఆహా యాప్‌లో విడుద‌ల కానున్న‌ జ్యోతిక ‘మ‌గువ‌లు మాత్ర‌మే’

కరోనా వైరస్ కారణంగా ప్ర‌స్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్లు కూడా ఓపెన్ కాక‌పోవ‌డంతో.. ద‌ర్శ‌క నిర్మాత‌లంద‌రూ ఓటీటీ వేదిక‌ల‌గానే త‌మ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా చిత్రాల‌ను కూడా రిలీజ్ చేశారు. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. కాగా ఇక ఈ మ‌ధ్యే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోకి వ‌చ్చిన ‘ఆహా యాప్’ కూడా మంచి స్పంద‌న లభిస్తుంది. తాజాగా మ‌రో కొత్త సినిమా ఆహా యాప్‌లో రిలీజ్ కాబోతుంది. ప్ర‌ముఖ న‌టి జ్యోతిక న‌టించిన ‘మ‌గువ‌లు మాత్ర‌మే’ అనే చిత్రం ఆగ‌ష్టు 7వ తేదీన‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా యాప్‌లో విడుద‌ల కాబోతంది. ఇటీవ‌లే జ్యోతిక ప్ర‌ముఖ పాత్ర‌లో న‌టించిన ’36 వ‌య‌సులో’ సినిమా కూడా ఆహాలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌గువ‌లు మాత్ర‌మే మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఊర్వ‌శి, నాజ‌ర్‌, భాను ప్రియ‌, మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ సినిమాకు గిబ్ర‌న్ సంగీతం అందించారు.

కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చేరతా: మంత్రి తలసాని

 తనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లనని.. గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో సుమారు రూ.700కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తలసాని తెలిపారు. నాటి సీఎం డాక్టర్ చెన్నారెడ్డి సైతం సనత్ నగర్ నుంచి గెలిచి ఇంతలా చేయలేదని వివరించారు. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు.. పట్టణ ఆరోగ్యకేంద్రాలు బస్తీ దవాఖానాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించేలా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

ప్రజారాజ్యంలో బావరాజ్యం' వార్తలపై ఆర్జీవీ కామెంట్...!

  వివాదస్పసద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'పవర్ స్టార్' అనే సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేసిన వర్మ ''మర్డర్'' ''థ్రిల్లర్'' అనే మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేసారు. ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ - ఒమేగా స్టార్ - సీబెఎన్ - లాకేష్ - వై ఎస్ జగన్ - KCAR - KTARలు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని చెప్పుకొచ్చారు. వర్మ చెప్పకపోయినా అవన్నీ నిజజీవితంలో పాత్రలను పోలి ఉన్నవని అందరికి తెలుసు. దీంతోపాటు అల్లు అరవింద్ పై సెటైరికల్ గా ''ప్రజారాజ్యంలో బావరాజ్యం'' అనే సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవీ ఈ వార్తలపై స్పందించారు. ఆర్జీవీ ...

ప్లాస్మా దాతకు 5 వేలు

  ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి రూ.5000 ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కొవిడ్‌ బాధితుల్ని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ముఖ్యమని, కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా దా నానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాం పు కార్యాలయంలో కొవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, వైద్య విద్యా వ్యవస్థలోని నా డు-నేడుపై సీఎం జగన్‌ సమీక్షించారు. ప్లాస్మా థెరపీపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దాతలకిచ్చే రూ.5 వేలు మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉండరాదని సూచించారు. బెడ్ల వివరాలను హెల్ప్‌డె్‌స్కలో ఉంచాలని, ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ కేటాయించేలా అక్కడ నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. ౅హెల్ప్‌ డెస్క్‌లో సక్రమంగా విధులు నిర్వహిస్తే చాలా వరకూ సమస్యలు తగ్గుతాయన్నారు. కరోనా కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై జాయింట్‌ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.  రాజధానుల బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తర్వాతి పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ రెడ...

గూగుల్ బంపర్ ఆఫర్.. ‘ఉచితంగా బ్యాకప్’

ఫ్రీగా డేటా బ్యాక్‌అప్‌’ను గూగుల్ ప్రకటించింది. క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీస్‌ ‘గూగుల్‌ వన్‌’ ఇక మీ ఐఓఎస్ (IOS)‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని డేటాను ‘ఫ్రీగా బ్యాక్‌అప్’‌ చేయనుంది. ఈ ఫ్యూచర్‌ను 2018 లో గూగుల్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటేనే ‘డేటా బ్యాక్‌అప్’‌ సౌకర్యం ఉంటుంది. అయితే గూగుల్‌ ఇందులో మార్పులు చేసింది.ఇప్పుడు ఐఓఎస్ (IOS)‌‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోని డేటాను గూగుల్ ఖాతాతో ఉచితంగా బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంది. ఐఓఎస్(IOS) యాప్‌ ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను బ్యాకప్ చేస్తుంది. ఇప్పటికే బ్యాకప్ చేయగల ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ఇప్పుడు ‘గూగుల్ వన్’ రిజిస్టేషన్లే లేకుండా బ్యాకప్‌ను అందిస్తుంది. బ్యాకప్ ఫీచర్‌తో పాటు మొబైల్‌లో స్టోర్‌ అయిన ఫైల్‌ల నిర్వహణను ‘గూగుల్‌ వన్‌’ వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. ఈ భద్రపరుచుకునే సౌకర్యాన్ని మొబైల్స్‌తోపాటు వెబ్ ‘ప్లాట్‌ఫామ్’‌లకు అవకాశం ఇచ్చంది.  జీ మెయిల్‌(gmail), ఫోటోలు, డ్రైవ్ నుంచి ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

మాణిక్యాలరావు మృతితో తీవ్ర విషాదంలో ఏపీ బీజేపీ వర్గాలు

ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి కన్నుమూయడం తెలిసిందే. ఆయన మృతితో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో తీవ్ర విచారం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ, మాణిక్యాలరావు అకాల మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. దశాబ్దాల పాటు బీజేపీకి విశేష సేవలు చేశారని, మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. మాణిక్యాలరావు మృతి పట్ల ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. కరోనాను జయించి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని భావించామని తెలిపారు. మిత్రుడు మాణిక్యాలరావు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని కన్నా వివరించారు.  

చైనా, రష్యా దేశాలు వ్యాక్సిన్ ను రూపొందిస్తే వాటిని తాము ఉపయోగించేది కష్టమేనంటున్న అమెరికా!

అమెరికాలో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అంటురోగాల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా దేశాలు తయారుచేస్తున్న వ్యాక్సిన్లపై ఆందోళన వ్యక్తం చేశారు.  చైనా, రష్యా వంటి ఇతర దేశాలు రూపొందించే వ్యాక్సిన్లను అమెరికా ఉపయోగించబోదని భావిస్తున్నట్టు తెలిపారు. పాశ్చాత్య దేశాల కంటే ఆయా దేశాల్లో ఔషధ నియంత్రణ వ్యవస్థలు పారదర్శకతకు దూరంగా ఉంటాయని, ఇలాంటి దేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్ ను అమెరికా వినియోగించడం కష్టమేనని ఫౌచీ అభిప్రాయపడ్డారు. కాగా, కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా అనేక దేశీయ ఫార్మా సంస్థలకు భారీగా నిధులు గుమ్మరిస్తోంది. సనోఫీ, జీఎస్కే వంటి దిగ్గజ ఫార్మాసంస్థలకు 2.1 బిలియన్ డాలర్లు అందిస్తోంది.  

కరోనాతో ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు కన్నుమూత

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా వల్ల కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన... నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

షిప్ యార్డు మృతుల్లో ఎక్కువమంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు... ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  ఈ ప్రమాదంలో మరణించినవారిలో ఎక్కువమంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని తెలిసిందని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి షిప్ యార్డు సంస్థ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎల్జీ పాలిమర్స్, సాయినార్, రాంకీ సెజ్ వంటి దుర్ఘటనలు కళ్ల ముందు మెదులుతుండగానే, క్రేన్ ప్రమాదం జరగడం విచారకరం అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.  

విశాఖ రాజధాని ఎఫెక్ట్ ప్రారంభం.. భూముల విలువను 50 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదనలు!

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే... విశాఖలో సందడి ప్రారంభమైంది. భూముల విలువను పెంచుతూ నిన్న సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో గరిష్టంగా 50 శాతం, కనిష్టంగా 5 శాతం భూముల విలువను పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. వ్యవసాయ భూముల విలువను కూడా పెంచబోతున్నారు. భీమిలి ప్రాంతంలోని వ్యవసాయ భూములను 50 శాతం, ముడసర్లోవ ప్రాంతంలో 27 శాతం పెంచనున్నారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్లో ఉంచారు. ఈ రోజు నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి... 10వ తేదీ నుంచి కొత్త విలువను అమలు చేయనున్నారు. మరోవైపు, నెల రోజుల క్రితం నుంచే భూముల విలువను పెంచడంపై అధికారులు కసరత్తు చేశారని తెలుస్తోంది. పెరిగిన విలువతో భీమిలిలో ఎకరం భూమి ధర రూ. 3 కోట్లకు చేరనుంది.

అమర్ ‌సింగ్‌ కన్నుమూత

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ ఇక లేరు. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌..  గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబం కూడా ఐసీయూ పక్కనే ఓ గది తీసుకొని ఉంటున్నట్టు సమాచారం. అమర్‌ సింగ్‌ వయస్సు 64 ఏళ్లు.  2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 జూన్‌లో, తాజాగా 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పార్లమెంటరీ ...