Skip to main content

Posts

Showing posts from August 10, 2020

సీనియర్ సిటిజన్స్ కు e SANJEEVANI

  కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం మరియు ఇతర పౌరులందరికీ ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది ~ పథకం పేరు * eSANJEEVANI. * ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు రెగ్యులర్ మెడిసిన్ తీసుకునే వారు ఒపిడి కోసం వెంటనే ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్లలేరు. వెళదాము అన్నా ప్రమాదం ఎక్కువ. తలనొప్పి, శరీర నొప్పి వంటి చిన్న సమస్యలకు, వారు ఆసుపత్రికి వెళ్లడానికి వారు ఇష్టపడక ఇంట్లో ఉండవచ్చు. ఇప్పుడు, వారికోసం  eSANJEEVANI వెబ్‌సైట్ ఉంది, ఇది సులభమైంది.  దీన్ని Google Chrome ద్వారా చేరుకోవచ్చు. ఆ వెబ్ సైట్ లో ఈ క్రింది విధంగా చెయ్యాలి. 1. రోగుల నమోదును ఎంచుకోండి. 2. మీ మొబైల్ నెం. మరియు వెబ్‌సైట్‌ లోకి వెళ్లడానికి OTP ను పొందండి. 3. రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి. ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో వైద్యుడికి కనెక్ట్ అవుతారు. అప్పుడు, వీడియో ద్వారా, మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు. డాక్టర్ ఆన్‌లైన్‌లో మందులు సూచిస్తారు. మీరు దానిని మెడికల్ షాపులో చూపించి  మందులు పొందవచ్చు. * ఇది పూర్తిగా ఉచితం. క్వాక్ డాక్టర్లు బెడద ఉండదు.*  * ఆదివారంతో స...

భార్య లేదని.. ఆమె మైనపు విగ్రహంతో గృహప్రవేశం..

  వీడియో చూడండి:  https://youtu.be/i5oGL8THq4Q భార్య చనిపోతే ఆవిడా జ్ఞాపకాల తో ఇలా … తన భార్య ఓ రోడ్ ప్రమాదం లో చనిపోతే గృహాప్రేవేశానికి భార్య మైనం విగ్రహాన్ని తయారుచేయించి ఆ విగ్రహం తో కొత్త ఇంటి గృహప్రవేశ శుభకార్యం. చేసుకొన్నా ఓ సంఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించి కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. క్రితం గుప్తా సతీమణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య అంటే ఆయన ఎనలేని ప్రేమ. ఉన్నన్ని రోజులు దేవతలా చూసుకున్నారు.ఐతే ఇటీవల ఆయన ఇంట్లో గృహప్రవేశ వేడుక జరిగింది. భార్య లేకపోవడంతో.. ఆమె మైనపు బొమ్మను చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.గృహ ప్రవేశానికి వచ్చిన గుప్తా బంధువులు ఆమె మైనపు విగ్రహాన్ని చూసి ఆశ్చర్య పడ్డారు , ఆ తర్వాత కాస్త భయపడ్డారు, చివరికి అది మైనపు విగ్రహం అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు.గుప్తా సర్‌ప్రైజ్‌కు అందరి కళ్లో నీళ్లు తిరిగాయి. గుప్తా భార్యను స్మరించుకొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆమె మీద తన ప్రేమ ను ఆలా పంచుకొన్నార

పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా ‘వైయ‌స్సార్ వన్’

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నూత‌న పారిశ్రామిక పాల‌సీ పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ‘వైయ‌స్సార్ వన్’ పేరిట కొత్త విధానం తెచ్చామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. నూతన పారిశ్రామిక పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు.  సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా .. గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోనే సాధ్యం కాద‌ని మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి అన్నారు.  అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామన్నారు. కోవిడ్ పరిస్థితి ల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు. క‌నీసం ప‌ది...

ప్రధాని మోదీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు‌

లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ నిధి రైతులు పండించిన పంటలకు విలువను జోడించడానికి మరియు స్థిరమైన ఉన్నత స్థాయి ఆదాయాలు పొందటానికి వీలు కల్పిస్తుందని అన్నారు. తద్వారా మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడేందుకు తోడ్పడుతుందని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాక్షించారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.   కాగా, వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి కేంద్రం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. దీనిద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2 వేల రూపాయల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. 

ఇక 45 నిమిషాల్లోనే గ్రోసరీ డెలివరీ... స్విగ్గి ఇన్ స్టా మార్ట్ సేవలు!

ఇండియన్ గ్రోసరీ డెలివరీ సేవల రంగంలో పోటీ అధికమవుతోంది. ఇప్పటికే దిగ్గజాలు ఉన్న ఈ రంగంలోకి తాజాగా రిలయన్స్ జియో మార్ట్ ప్రవేశిస్తుండటంతో పోటీ మరింత పెరిగిపోతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న వారే కాకుండా... కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే కంపెనీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లో అగ్రగామిగా ఉన్న స్విగ్గి... త్వరలోనే గ్రోసరీ డెలివరీ లోకి పూర్తిస్థాయిలో రంగ ప్రవేశం చేయాలని భావిస్తోంది. అది కూడా అత్యంత వేగంగా డెలివరీ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అదే జరిగితే వినియోగదారులకు గ్రోసరీల కొనుగోలు చాలా సులువు అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఒకే రంగంలో ఎక్కువ మంది ప్లేయర్లు సేవలు అందిస్తే తప్పనిసరిగా అక్కడ ఆఫర్ల వెల్లువ కొనసాగుతుంది. కాబట్టి, దాని ప్రయోజనం వినియోగదారులకు లభిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో ఈ కామర్స్ రంగంలోనూ, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లోనూ అదే జరిగింది. ఆఫర్లు ఎక్కడ ఉంటే అక్కడే ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు అలవాటుపడిపోయారు. దీంతో రూ వందల, రూ వేల కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. 45 నిమిషాల్లోనే డెలివరీ... ఇన్ స...

మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీం నోటీసులు

  మార్గదర్శి కేసులో  రామోజీరావుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  పిటీషన్ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను, సుమారు రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజి కృష్ణంరాజు  ఫిర్యాదు చేశారు. ఉమ్మడి హిందూ కుటుంబం  (హెచ్.యు.ఎఫ్) ద్వారా డిపాజిట్ల సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీ రావు వాదనలు వినిపించారు. ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్.యు.ఎఫ్) ఒక వ్యవస్థ కాదు, ఒక కంపెనీ కాదు,  ఒక ఫరమ్ కాదు, వ్యక్తుల సమూహం కూడా కాదు. కాబట్టి, “ఆర్బీఐ చట్టం” సెక్షన్ 45 ( ఎస్) నిబంధనలు  వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పును, ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి, కోర్టు ను ఆశ్రయుంచడంలో  266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని ...

డర్టీ పిక్చర్` చేస్తానంటే తిట్టారు: విద్యా బాలన్

అప్పటివరకు పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో కనిపించిన విద్యా బాలన్ `డర్టీ పిక్చర్`తో ఒక్కసారిగా గేర్ మార్చింది. ఆ సినిమాలో అత్యంత హాట్‌గా నటించి అందరికీ షాకిచ్చింది. అలనాటి శృంగార తార సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విద్య అత్యద్భుతంగా నటించి మెప్పించింది.  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో `డర్టీ పిక్చర్` గురించి విద్య మాట్లాడింది. `నేను `డర్టీ పిక్చర్`కు సంతకం చేశానని తెలిసి చాలా మంది తిట్టారు. నాకు పిచ్చి పట్టిందనుకున్నారు. `నవ్వు ఇలాంటి పాత్రలు చేయకూడద`ని కొందరు చెప్పారు. కానీ, నాకు సినిమాపై నమ్మకముంది. ఆ సినిమా నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఓ మహిళే. ఆ సినిమా చెత్తగా ఉండదని నాకనిపించింది. `డర్టీ పిక్చర్` సినిమా కథ మా తల్లిదండ్రులకు చెప్పి.. `చేయాలా? వద్దా?` అని అడిగాను. `నీకు సరైనదని అనిపిస్తే కచ్చితంగా చెయ్యి` అని వాళ్లు చెప్పారు. దాంతో నేను ఆలోచించుకుని ఆ సినిమాకు ఓకే చెప్పాన`ని విద్య తెలిపింది. 

నేనెంత అదృష్టవంతుడినో.. : మహేష్ బాబు

ఆగస్ట్ 9న పుట్టిన రోజు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు, మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా పంపిన మీ విషెస్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మరియు ఫ్యాన్స్‌కు మీరు పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. - ప్రేమతో మీ మహేష్ బాబు.’’ అని మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 60.2 మిలియన్ ట్వీట్స్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్ మహేష్ బర్త్‌డే ట్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ అభిమానులు ట్విట్టర్‌లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. 60.2 మిలియన్ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్‌‌గా రికార్డ్ సృష్టించింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్‌లో ఈ వరల్డ్ రికార్డ్ సాధించడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ గ్రీ...

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు

పీఎంయూ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా  పీఎంయూను ఏర్పాటు చేశారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు.  సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు. ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్డు సచివాలయాల ని...

Amazon Freedom Sale బంపర్ అఫర్: కేవలం రూ.6,999 రూపాయలకే FHD LED TV

Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది Freedom Sale సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది. చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి. ఆగష్టు 15 సందర్భంగా, Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది. ఈ సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు ఇప్పటికే ప్రకటించింది. చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి. Sanyo (24 Inches) Full HD LED TV  ( Buy Here ) MRP : Rs. 9, 990 అఫర్ ధర : Rs. 6, 999 Sanyo Full HD LED TV ప్రత్యేకతలు Sanyo కంపెనీ యొక్క ఈ Full HD LED TV 24 అంగుళాల పరిమాణంలో వస్తుంది మరియు ఒక సాధారణ బెడ్ రూమ్ ల్లో సరిగ్గా సరిపోతుంది. ఈ FHD LED టీవీ కాబట్టి, మంచి సినిమా అనుభవం ఈ టీవీ ద్వారా మీకు కలుగుతుంది. అలాగే...

Mi 10 Ultra మరియు Redmi K30 Ultra ఆగష్టు 11 న విడుదలకు సిద్ధం

Xiaomi 10 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా Xiaomi Mi 10 Ultra మరియు Redmi K30 Ultra స్మార్ట్ ఫోన్లను ఆగస్టు 11 న చైనాలో విడుదల చేయబతోంది. షియోమి ఈ రెండు ఫోన్స్ ‌విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది మరియు స్టోరేజ్ వేరియంట్స్ మరియు కలర్ ఆప్షన్స్‌తో పాటు మరికొన్ని కీలక వివరాలను ఇప్పటికే ప్రకటించింది. కేవలం, స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా షియోమి 55-అంగుళాల OLED TV మరియు 55W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌ను కూడా విడుదల చేయనుంది. మి 10 సిరీస్ మరియు రెడ్‌మి కె 30 సిరీస్ రెండూ కూడా ఈ ఏడాది ప్రారంభం మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడ్డాయి. అయితే, ఈ కొత్త ‘అల్ట్రా’ వేరియంట్లను  అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు బాక్స్ తో పాటుగా అడ్వాన్స్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వంటి కొత్త అప్డేట్స్ ను కూడా అందించాలని చూస్తోంది. రాబోయే ఈ మి ​​10 అల్ట్రా యొక్క కొన్ని పోస్టర్లు ఇప్పటికే Leak అయ్యాయి. ఇందులో, 120 Hz లేదా 144 Hz హై-రిఫ్రెష్-రేట్ డిస్ప్లే మరియు 120x డిజిటల్ జూమ్ పెరిస్కోప్ కెమెరాతో తీసుకువస్తోంది. అదేవిధంగా, రెడ్‌మి కె 30 ప్రో లోని 90 హెర్ట్జ్ ప్యానెల్ నుండి 120 హెర్ట్జ్ ...

తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో సుశాంత్ మనస్తాపం చెందాడన్న శివసేన నేత.. ఆగ్రహం వ్యక్తం చేసిన సుశాంత్ సోదరుడు

  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటి నుంచి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.  సుశాంత్ తండ్రి కేకే సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ వివాహం కారణంగా సుశాంత్ తన తండ్రిపై వ్యతిరేకతతో ఉన్నాడని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సుశాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని అన్నారు. సుశాంత్ చనిపోయిన 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చారని, సుశాంత్ ముంబయిలో చనిపోతే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు. దీనిపై సుశాంత్ సోదరుడు నీరజ్ మండిపడ్డారు. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ రౌత్ చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదని, దీనిపై రౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అటు రౌత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ విభేదించారు. సుశాంత్ వ్యవహారంలో రౌత్ చేస్తున్న వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయని అన్నారు. ఇది ఎంతో సున్నితమైన అంశం...

చంద్రబాబూ, విజయవాడ ప్రమాద ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలి?: నిలదీసిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  చంద్రబాబు నిర్వహించే జూమ్ యాప్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనే రమేశ్ చౌదరి నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.  విజయవాడలో నిన్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించడం తెలిసిందే. ఈ హోటల్ ను స్థానిక రమేశ్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించుకుంటోంది. ఈ హాస్పిటల్ అధినేత రమేశ్ చౌదరి విషయంలో చంద్రబాబు మౌనం వెనుక అర్థం ఏమిటని శ్రీకాంత్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు... రమేశ్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. "మీ పార్టీకి సంబంధించిన వాళ్లు చేస్తే ఒకరకంగా, ఇతరులు చేస్తే ఒకరకంగా స్పందించడం మీ నైజం... మీ నైజాన్ని బయటపెట్టేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఓ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసే వ్యక్తి ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు. అందరికీ అతీతంగా వ్యవహరించినప్పుడే మనం నాయకులం అవుతాం. అలాంటి ఉద్దేశం నీకే కోశానా లేదు. నీకు తెలిసిందల్లా ప్రతిదానికీ కుల రాజకీయాలు చేయడమే! తప్పు చేసిన వాళ్లను...

తల్లి కోసం చేపల వేపుడు చేసిన చిరంజీవి... వీడియో ఇదిగో!

వీడియో చూడండి:  https://youtu.be/vvos3-aaQnk  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖాళీ సమయాల్లో చేసే పనుల్లో కుకింగ్ కూడా ఉంటుంది. తాజాగా ఆయన తన తల్లి అంజనాదేవి కోసం చిన్న చేపల వేపుడు చేశారు. వాస్తవానికి దీనికి సంబంధించిన వీడియోను నిన్న సాయంత్రమే విడుదల చేస్తానని చిరంజీవి ప్రకటించినా, విజయవాడ అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో ఆ వీడియోను ఇవాళ ఉదయం రిలీజ్ చేశారు. చెప్పినట్టుగానే చింత తొక్కుతో చిన్న చేపలను మారినేట్ చేసి, వాటిని ఎంతో నేర్పుగా వేపుడు చేసి తల్లికి వడ్డించారు. తన చేతి వంటను ఎంతో ఇష్టంగా తింటున్న మాతృమూర్తిని చూస్తూ చిరంజీవి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా

  కరోనా విజృంభణ పెరిగిపోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులు కూడా కొవిడ్‌-19 బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వేరే పరీక్షల కోసం తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా ఐసొలేషన్‌లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ ప్రణబ్‌ ముఖర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నూటికి నూరుపాళ్లు న్యాయం అమరావతి రైతుల పక్షానే ఉంది: రఘురామకృష్ణంరాజు

  ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని, శాసనసభకు గాని లేదని విభజన చట్టం ద్వారా అర్థమవుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఏ క్యాపిటల్ (a capital), ది క్యాపిటల్ (the capital) అంటూ రాజధాని అంశంపై విభజన చట్టంలో పొందుపరిచారని రఘురామ వివరించారు. రాజధాని కోసం కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే, ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటే ప్రజలే ఎన్నికల్లో రాజకీయ నేతలను పిచ్చివాళ్లను చేస్తారని, ప్రజలు చాలా తెలివైన వాళ్లని అన్నారు. నూటికి నూరు పాళ్లు న్యాయం అమరావతి రైతుల పక్షానే ఉందని స్పష్టం చేశారు. ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం న్యాయపరంగా సరికాదన్నది తన నిశ్చితాభిప్రాయం అని, ఒకవేళ రాజధానికి సంబంధించి విభజన చట్టంలోనే ఏదైనా మార్పు చేయాలనుకుంటే, మళ్లీ పార్లమెంటులోనే బిల్లు తీసుకురావాలని తాను గట్టిగా నమ్ముతున్నానని రఘురామ వివరించారు. ఇలాంటి న్యాయపరమైన సలహాలకు రాష్ట్ర ప్రభుత్వంలా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే సత్తా త...

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు*

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. *పూర్తిస్థాయి నీటి మట్టం 590.00* అడుగులకు గాను... *ప్రస్తుత నీటిమట్టం 559.90 అడుగులకు చేరింది.* అలాగే ఇన్ ఫ్లో 42,378 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 8,373 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 232.1418 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

శ్రీశైలం జలాశయానికి భారీ వరద*

 రాష్ట్రాలలో భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 94 టీఎంసీల నీరు  నిల్వ ఉంది. పైన ఉన్న జూరాలకు 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 28 గేట్లు ఎత్తి 2,23,948 క్యూసెక్కులను శ్రీశైలం, పరిసర కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇందులో 2,13,486 క్యూసెక్కులు డ్యాంకు చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 856 అడుగుల వద్ద 94.68 టీఎంసీల నిల్వలు నమోదు అయ్యాయి.  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత!

  మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  ఎనిమిది పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ఆయన, రెండుసార్లు మంత్రిగానూ పనిచేశారు. 1958లో సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన, 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 1989-94 కాలంలో రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అందులోనే కొనసాగారు.  

ఐదు దేశాల్లో మరో కొత్త వ్యాధి... జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరిక...

ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడి పోతున్నది.  కరోనా నుంచి బయటపడేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నది.  కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియడం లేదు.  ఇలాంటి సమయంలో అమెరికా మరో హెచ్చరిక చేసింది.  అమెరికాలో కరోనాతో పాటు మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ గుర్తించింది.  ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో అధికంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జ్వరంగా మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలను దెబ్బతీస్తోందని, ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, చర్మంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెప్తున్నది.  కరోనా వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువుగా ఈ లక్షణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాతో పాటుగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ లో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది.  అమెరికాలో ఇప్పటి వరకు 600 పిల్లలకు ఈ వ్యాధి సోకింది.  దీని కారణంగా...

రెండు కోట్లు దాటిన కరోనా కేసులు.. భార‌త్‌లో య‌మ స్పీడ్‌..!

  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఏకంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది... ఇక‌, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భార‌త్‌లోనే క‌రోనా కేసులు సంఖ్య య‌మ స్పీడ్‌గా దూసుకెళ్తోంది.. ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ 60 వేలకుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఏకంగా పాజిటివ్ కేసులు 62 వేలు దాటిపోయింది.. క‌రోనా గ‌ణాంకాల ప్రకారం ప్రపంచ‌వ్యాప్తంగా 2,00,23,016కు చేర‌గా.. ఇప్పటివరకు మృతిచెందిన‌వారి సంఖ్య 7,33,973కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గడ‌చిన‌ 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రోవైపు, క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఇప్పటి వరకు 1,28,97,813 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారిన‌ప‌డ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075గా ఉంది. ఇప్ప...

వరల్డ్ రికార్డు సృష్టించిన మహేశ్ బాబు 'హ్యాష్ ట్యాగ్'!

  మహేశ్ బాబు కొత్తం చిత్రం ట్రైలర్లు, టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు రికార్డులు సృష్టించడం సాధారణ విషయమే. అయితే ఆయన తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఉపయోగించిన #HBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ తో ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టేశారు. ట్విట్టర్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తూ 24 గంటల వ్యవధిలో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయట. ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ అని, ఇది ప్రపంచ రికార్డు అని మహేశ్ బాబు పీఆర్ టీమ్ వెల్లడించింది. ఇవాళ మహేశ్ బాబు పుట్టినరోజు కావడంతో ఇంకా ట్వీట్లు వస్తూనే ఉన్నాయని, ఈ ట్వీట్ల సంఖ్య దూసుకుపోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

బుద్ధుడి జన్మస్థలం నేపాలే... వివాదానికి పుల్ స్టాప్ పెట్టిన కేంద్రం!

  గౌతమ బుద్ధుడి జన్మస్థలం విషయంలో నెలకొన్న వివాదానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పుల్ స్టాప్ పెట్టింది. బుద్ధుడి జన్మస్థలం నేపాల్ లోని లుంబినీయేనని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ఓ వెబినార్ లో జైశంకర్ మాట్లాడుతూ, బుద్ధుడూ, మహాత్మా గాంధీలు అనుసరించిన మార్గం, చేసిన బోధనలు అందరికీ ఆచరణీయమని అన్నారు. ఇదే సమయంలో బుద్ధుడు భారతీయుడని జై శంకర్ వ్యాఖ్యానించినట్టు నేపాల్ మీడియా కథనాలు రాసింది. దీనిపై వివాదం చెలరేగగా, మంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇరు దేశాల మధ్యా బౌద్ధమత వారసత్వం ఉందని, గౌతమ బుద్ధుడు నేపాల్ లోనే జన్మించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. అంతకుముందు నేపాల్ విదేశాంగ శాఖ జై శంకర్ ప్రసంగాన్ని తప్పుబట్టింది. బుద్ధుడు నేపాల్ లోనే జన్మించారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎవరూ కాదనలేరని పేర్కొంది. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని నేపాల్ విదేశాంగ శాఖ గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశంలో పర్యటించిన వేళ, పార్లమెంట్ లో మాట్లాడుతూ, ఇదే విషయాన్...

అమరావతి రైతులకు మద్దతు పలికిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ... సస్పెండ్ చేసిన సోము వీర్రాజు

  ఏపీ బీజేపీ నేతల మధ్య రాజధాని అమరావతిపై భేదాభిప్రాయాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడిన మరో నేతను బీజేపీ నుంచి సాగనంపారు. బీజేపీ విధానాలకు విరుద్ధంగా  వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ డాక్టర్ ఓవీ రమణను పార్టీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని ఓవీ రమణ ఓ వ్యాసం రాయడం సస్పెన్షన్ కు దారితీసింది. కాగా, వెలగపూడి గోపాలకృష్ణ రాజధాని రైతుల పక్షాన మాట్లాడుతూ, అమరావతి కోసం 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు బీజేపీ మద్దతుగా నిలవలేకపోతోందని అన్నారు. ఆపై, తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.

అయోధ్య రామాలయంలో రెండు టన్నులకు పైగా బరువైన భారీ గంట!

  అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో 2.1 టన్నుల బరువుండే భారీ గంట ప్రధాన ఆకర్షణ కానుంది. ఉత్తరప్రదేశ్ లోని జలేసర్ లో ఈ గంటను దావూ దయాల్ అనే హిందూ ఫ్యామిలీ సిద్ధం చేస్తోంది. ఈ గంటను నైపుణ్యవంతులైన ముస్లిం కార్మికులు తయారు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.  బంగారం, వెండి, రాగి, సీసం, పాదరసం, ఇనుము తదితర అష్టధాతువులతో దీన్ని తయారు చేశామని, ఈ గంటలో ఎటువంటి అతుకులు ఉండవని, ఇదే దీని ప్రత్యేకతని దయాల్ వెల్లడించారు. గతంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి టన్ను బరువైన గంటలు తయారు చేశామని, ఆ అనుభవంతోనే ఇప్పుడు దీని తయారీకి సిద్ధమయ్యామని వెల్లడించారు. ఈ గంట తయారీకి రూ. 21 లక్షలు ఖర్చవుతుందని, 25 మంది నిపుణులు, నాలుగు నెలల పాటు శ్రమించాలని అన్నారు.