వార్షిక కౌలు చెల్లింపు కోసం డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు నిన్న విజయవాడలో ముట్టడికి యత్నించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామని, కానీ విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల రైతులకు కౌలు చెల్లించడంలో ఆలస్యమైందని వెల్లడించారు. కాగా, అమరావతి కౌలు రైతులకు పెన్షన్ రూ.5 వేల వరకు పెంచాలని భావించినా, ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంలో వీలుపడలేదని బొత్స వెల్లడించారు. అందువల్లే ఈసారి రూ.2,500 చెల్లించామని వివరించారు.