Skip to main content

టైమింగ్ ఉన్న నటుడు వేణుమాధవ్... పవన్ కళ్యాణ్ సంతాపం

pawan kalyan condolence on venu madhav deathసినీ నటుడు, టాలీవుడ్ కమెడియన్  వేణుమాధవ్ బుధవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్... ఈ రోజు తుది శ్వాస విడిచారు. కాగా.. వేణుమాధవ్ మృతిపై పవన్ స్టార్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
వేణుమాధవ్ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చనిపోయారనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ చెప్పారు. హాస్యం పండించడంలో వేణుమాధవ్ టైమింగ్ ఉన్న నటుడని పవన్ కొణియాడారు. 
కాగా... పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహితుల్లో వేణుమాధవ్ కూడా ఒకరు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పవన్ చాలా సినిమాల్లో వేణుమాధవ్ స్నేహితుడి పాత్రలో నటించి అలరించారు. తొలి ప్రేమ చిత్రం నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం ఉంది.
1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన 'సంప్రదాయం' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్. 'తొలిప్రేమ' సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Comments