Skip to main content

హైదరాబాద్‌‌పై వరుణుడు పగ... మరో మూడ్రోజులు కుండపోతే...!

హైదరాబాద్‌‌పై వరుణుడు పగబట్టాడు. రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. కుంభవృష్టితో మొత్తం నగరమే అల్లకల్లోలంగా మారుతోంది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలైతే జలమయం కాగా, పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. శివారు ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో హైదరాబాదీల బాధలు వర్ణణాతీతంగా మారాయి.
ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, అమీ‌ర్‌‌పేట్‌, పంజగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌, ముషీరాబాద్‌, గాం‎ధీనగర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, యూసుఫ్‌గూడ, బోరబండ, నాంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్‌, నేరేడ్‌మెట్, ఏఎస్‌రావు, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, దిల్‌సుఖ్‌‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్... ఇలా అన్ని ప్రాంతాల్లోనూ 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్లు దాటి వర్షం పడింది.
ఇక, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. అలాగే, మూసాపేట్ దీన్‌దయాల్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాద్‌లోని షిర్డీనగర్, బాలానగర్ మెయిన్‌రోడ్‌లోని నార్సాపూర్ క్రాస్‌రోడ్స్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ ఫ్రూట్‌మార్కెట్, అల్వాల్ రాజీవ్‌నగర్ కాలనీ, తార్నాక క్రాస్‌రోడ్స్, ఆలుగడ్డబావి ఓల్‌ఫెంటా బ్రిడ్జీ, సికింద్రాబాద్ కర్బలా మైదాన్ తదితర ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచింది. అదేవిధంగా కాచిగూడ, భోలక్‌పూర్ పద్మశాలికాలనీ తదితర ప్రాంతాల్లో సైతం పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చిచేరింది. దాంతో జీహెచ్‌ఎంసీ రెస్పాన్స్ టీమ్స్‌ రంగంలోకి దిగి నీటిని తొలగించాయి. పలుచోట్ల నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహానికి పార్కింగ్ చేసిన బైక్స్ కొట్టుకుపోయాయి.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here