Skip to main content

Posts

Showing posts from October 14, 2019

కెసిఆర్ పైన కోదండరాం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పైన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మరోసారి విరుచుకుపడ్డారు టిఎస్ ఆర్టిసి సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రవాణా మంత్రి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అని ప్రశ్నించారు credit: third party image reference తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంటే చోద్యం చూసిన వారు ఇప్పుడు సీఎం కేసీఆర్ కి దగ్గర అయ్యారు అని విమర్శించారు మన ఓట్ల కి పుట్టిన వాడిని అడిగే హక్కు తనకుందని అంతేకానీ మనం మనుషులం కాదంటే ఊరుకుంటామా అని కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు credit: third party image reference కేసీఆర్ నోటి మాటగా మీ ఉద్యోగాలు లేవు అంటే లేకుండా పోతాయా అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణాలో కెసిఆర్ మర్చిపోయారని కార్మికులను మర్చిపోలేదు అన్నారు ఉద్యమ సమయంలో తెలంగాణాలో ఆర్టీసీని బాగు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

కేసీఆర్ కి అంత పెద్ద మనసు లేదు

ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య కానీ… వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైందని ఎద్దేవా చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని, కేసీఆర్ కి అంత పెద్ద మనసు లేదని అన్నారు. ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే… బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని అన్నారు విజయశాంతి.

అనూహ్యరీతిలో తెరపైకి గంగూలీ పేరు.... బీసీసీఐ అధ్యక్ష పదవికి ముంబయిలో నామినేషన్ దాఖలు

  టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం లాంఛనమే. కొద్దిసేపటి క్రితమే ముంబయిలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నది గంగూలీ ఒక్కరే. బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న నిర్వహించనున్నారు. నామినేషన్లకు అక్టోబరు 14 తుది గడువుగా విధించారు. వాస్తవానికి కర్ణాటకకు చెందిన బ్రిజేశ్ పటేల్ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయమని నిన్నటివరకు అందరూ భావించారు. కానీ, కొన్నిగంటల్లోనే పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ బీసీసీఐ చీఫ్ రేసులో ముందు నిలిచాడు. ఇక, ఇతర పదవుల విషయానికొస్తే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శి పదవికి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారి పదవికి, కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయేశ్ జార్జ్ సంయుక్త కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, గంగూలీ రాకతో రేసు నుంచి తప్పుకున్న బ్రిజేశ్ పటేల్ ను ఐపీఎల్ చైర్మన్ గా చేసేందుకు పావులు చకచకా కదులుతున్నాయి   

భార్యతో కలిసి నోబెల్ కు ఎంపికైన ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

  ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైకేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ప్రపంచ పేదరికాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే అంశంలో ఈ త్రయం పరిశోధనాత్మక దృక్పథంతో పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేసింది. వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ పురస్కారం వరించింది.

ఆ పదాన్ని లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన ఘనత చంద్రబాబుదే: ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘యూ-టర్న్’ అనే పదం వాడుకలోకి వచ్చిన తర్వాత ఆ పదాన్ని ఇప్పటిదాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని సెటైర్లు విసిరారు. అవకాశవాదం, కాళ్లుపట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు బాబే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కోసం ఏపీ సీఎం జగన్ రూ.5510 కోట్లు విడుదల చేశారని, 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ.12,500 చొప్పున సాయం అందుతుందని అన్నారు. చంద్రబాబుకు నోరు పెగలడం లేదని, రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని బాబు కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు. 

రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పెంపు

ఏపీలో రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట రైతులకు రూ.13,500 పెట్టుబడి రూపేణా అందించనున్నారు. రైతు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పేరుతో అమలు చేయనున్నారు. అయితే రైతులకు అందించే ఈ పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. విడతల వారీగా రైతు భరోసా ఇవ్వాలని రైతు ప్రతినిధులు కోరారని ఆయన వెల్లడించారు. రైతు భరోసా పథకాన్ని నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లపాటు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లక్షలమంది రైతులకు నేరుగా పెట్టుబడి అందుతుందని అన్నారు. రైతులకు మే నెలల్లో రూ.7,500 అందిస్తామని, ఖరీఫ్ పంటల కోత సమయంలో, రబీ అవసరాల నిమిత్తం మరో రూ.4000 ఇస్తామని చెప్పారు. సంక్రాంతి వేళ చివరి విడతగా రూ.2000 అందిస్తామని మంత్రి కన్నబాబు వివరించారు. ప్రస్తుతం 40 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నామని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును మరింత పెంచుతున్నామని చెప్పారు. నవంబరు...

చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను మాకు పంచుతూ ఉండాలి: జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. తన సతీమణి సురేఖతో కలసి వచ్చిన చిరంజీవికి జగన్ దంపతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. విందు భోజనం ఆరగించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జగన్ పంచుకున్నారు. 'సైరా'తో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు. 'చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి' అంటూ ఆకాంక్షించారు.

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద

కర్ణాటక ఎగువ ప్రాంతంలోని కృష్ణ పొంగి ప్రవహించడంతో శ్రీశైల జలాశయం కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం కు ఇన్‌ఫ్లో లక్ష.42.435 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుని నిండు కుండలా మారింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 7 పాయింట్లు, నాలుగు టీఎంసీలు మాత్రమే తక్కువగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం శనివారం ఉదయం కు 884.30 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదయ్యాయి. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 45,439 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 24345 క్యూసెక్కులు, సుంకేసుల మీదుగా రోజా నుంచి తుంగభద్రకు 75 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

కోడెల ఆత్మహత్య కేసు విచారణ... కీలక విషయాలు చెప్పిన శివరామ్

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలాంటి విషయాలపై శివరామ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్‌మెన్‌లను విచారించి పోలీసులు స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా గతంలోనే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తండ్రి అపరకర్మలు నిర్వర్తించాల్సి ఉన్నందున ఇప్పుడే తాను రాలేనని, కొంత సమయం కావాలని కోడెల కుమారుడు శివరాం పోలీసులను కోరారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులే గుంటూరుకు వచ్చి కోడెల శివరాంని విచారణకు పిలిపించారు. విచారణకు హాజరైన శివరాం తన తండ్రి శివప్రసాదరావు కేసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తండ్రితో ఎలాంటి విభేదాలు లేవని, అంతా కలిసే ఉంటామని పోలీసులకు శివరాం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ...

గోదావరిలో బోటు వెలికితీత... లోపల అంతా బురదే...

తూర్పు గోదావరి జిల్లా... కచ్చులూరు దగ్గర ప్రవాహం దాటికి నీటిలో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు మళ్లీ ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. ఈ ఉదయం క్రేన్లు, సరంజామాతో వచ్చిన నిపుణులు... ఇనుప వైర్లను గోదావరిలోకి వదులుతున్నారు. నిజానికి ముంబై నుంచీ వచ్చిన ఓ టీమ్... అత్యాధునిక టెక్నాలజీతో బోటును వెలికి తీయాలని నిర్ణయించి... తీరా అది సాధ్యం కాదని చెప్పి... తిరిగి వెళ్లిపోయింది. ఇందుకు కారణం... బోటు 200కు పైగా ఆడుగుల లోతున ఉందని భావించడమే. ఐతే... ధర్మాడి సత్యం టీమ్‌కి ఇలాంటి పడవల్ని బయటకు తీసిన అనుభవం ఉండటంతో... ప్రభుత్వం రూ.22 లక్షల కాంట్రాక్ట్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ బృందం క్రేన్లకు ఇనుప వైర్లు కట్టి... ఆ వైర్లకు యాంకర్ వేసి... నీటిలోకి వదులుతోంది. లంగర్‌కి బోట్ తగిలితే... బయటకు లాగాలన్నది ప్లాన్. ఐతే... బోటు పూర్తిగా బురదలో కూరుకుపోయినట్లు తెలిసింది. ప్రమాదం జరిగి... నెల కావడంతో... ఇప్పుడా బోటును బయటకు లాగితే... అది బురదలో పూర్తిగా నానిపోయి... ముక్కలైపోతుందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ బోటును బయటకు తీసి తీరతామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. వారం కిందట కూడా ఇలాంటి ప్రయత్నాల...

ఆ వీడియోలో ఏంటీ దారుణం ... మోదీని ప్రశ్నిస్తూ రష్మీగౌతమ్ భావోద్వేగం

గుజరాత్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తున్నారు. గతంలో సింహాలను పట్టుకుని ఇలాగే కొందరు హింసించారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.దీనిపై ప్రధాని నరేంద్ర మోదీని జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. "గుజరాత్ లో ఏమి జరుగుతుంది , మనకు డిజిటల్ ఇండియా, మోడర్న్ ఇండియాతో పాటు సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి .. నాకు ఈ వీడియో పూర్తిగా చూడాలన్న కూడా బాధ, భయం రెండూ వేశాయి అంటూ భావోద్వేగానికి లోనవుతూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. రష్మీ గౌతమ్ చేసిన ఈ ట్వీట్‌కు అమె అభిమానులు అంతా లైకులు కొడుతున్నారు. రష్మీకి జంతువుల పట్ల ఎంత ప్రేమ అంటూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధానిని ప్రశ్నించిన రష్మీ ధైర్యాన్ని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు. మరీ రష్మీ ట్వీట్‌కు పీఎం మోదీ స్పందిస్తారో లేదో చూడాలి.

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అంతా చెబుతున్నా... ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా మారబోతోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సైరా సినిమాను చూడాలని కోరేందుకే చిరంజీవి సీఎం జగన్‌ను కలవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సమావేశంలో చిరంజీవి ముందు సీఎం జగన్... సీఎం జగన్ ముందుకు చిరంజీవి పలు ప్రతిపాదనలు పెట్టే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసలు సీఎం జగన్, చిరంజీవి సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది. సైరాకు పన్ను మినహాయింపు:  చారిత్రక కథాంశంతో తెరకెక్కిన సైరా సినిమాను చూడటంతో పాటు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని చిరంజీవి సీఎం జగన్‌ను కోరే అవకాశం ఉందని సమాచారం. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన అంశాన్ని చిరంజీవి జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గంటా అంశం:  టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరొచ్చని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిరంజీవి మార్గన...

సీఎం కేసీఆర్, ముగ్గురు మంత్రులపై... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రుల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, దయాకర్ రావు, గంగుల కమలాకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ పదోరోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ పలు ఆందోళనలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు బైఠాయింపు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఏపీఎస్‌ ఆర్టీసీకి దసరా ధమాకా

దసరా సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) భారీగా ఆదాయం ఆర్జించింది. ఈ సీజన్‌లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. గతఏడాది దసరా సీజన్‌ కంటే ఈసారి రూ.20 కోట్లు అధికంగా రావడం గమనార్హం. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండక్కి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) ఏకంగా 103 శాతంగా నమోదైంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులకు ఆదరణ మరింత పెరిగింది. మొత్తం పండగ సీజన్‌లో సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 13వ తేదీ వరకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ గణనీయమైన ఆదాయాన్ని రాబట్టింది. ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసి.. ప్రణాళికాబద్ధంగా సర్వీసులు నడపడంతో మంచి రాబడి లభించింది. ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రతిరోజూ సాధారణంగా రూ.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 71 లక్షల మంది ప్రయాణిస్తారు. కలిసొచ్చిన టీఎస్‌ ఆర్టీసీ సమ్మె దసరా సీజన్‌ ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర ఆ...

దోచేస్తున్నారు

జ్వరం వస్తే మందు బిళ్ల వేసుకునేవాళ్లం.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంజక్షన్‌ వేసుకుంటే రెండు, మూడు రోజుల్లో నయం అయ్యేది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం కూడా ఖరీదైన వ్యాధిగా మారింది. కొందరు ప్రైవేట్‌ వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకుల పుణ్యమా అని జ్వరం పేరు చెబితే భయపడే రోజులు వచ్చాయి. కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు మొదలు కొని వృద్ధుల వరకు జ్వరాలతో బాధ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు దోచుకునే పనిలో పడ్డాయి.    టైఫాయిడ్, మలేరియా, సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా నీరసంగా ఉంటుంది. ఈ కారణంగా ప్లేట్‌లెట్‌ కౌంట్స్‌ తగ్గుతాయి. అయితే జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి కేసుకు ప్రైవేట్‌ ఆస్పత్రులు, అనుబంధ ల్యాబ్‌ నిర్వాహకులు డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తకణాలు తగ్గాయని వారిని భయపెడుతూ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుంటున్నారు. రోజుకు రెండు సార్లు రక్తపరీక్షలు చేస్తూ రోగిని పిప్పి చేస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించే క్రమంలో రోగులకు డెంగీ పాజిటివ్‌ వచ్చినట్ల...

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది.

అక్టోబర్‌ 25, 2018 : గురువారం మధ్యాహ్నం ♦  ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒకింత సమయం ఉండటంతో వీఐపీ లాంజ్‌లో వైఎస్సార్‌ సీపీ నేతలతో భేటీ అయ్యారు. ♦  అధినేతకు కాఫీ తెచ్చేందుకు పార్టీ నేతలు యత్నించగా... బయటి నుంచి తీసుకువచ్చేందుకు అనుమతి లేదని అధికారులు ఖరాకండిగా చెప్పడంతో పక్కనే ఉన్న టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరికి చెందిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ నుంచి కాఫీ ఆర్డర్‌ చేశారు. ♦  కాఫీ తెచ్చే సాకుతో రెస్టారెంట్‌లో కుక్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు వచ్చి.. ప్రతిపక్ష నేత జగన్‌పై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అక్టోబర్‌ 11, 2019 : శుక్రవారం రాత్రి ♦  ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒకింత సమయం ఉండటంతో వీఐపీ బ్లాక్‌లోనే టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ♦  నలుగురైదుగురు నేతలు కాదు.. ఏకంగా 30 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీఐపీ లాం...

హిమాల‌యాల్లో... గుర్రంపై ర‌జ‌నీ స్వారీ

మేకప్ తీసేస్తే  ఓ సాదా సీదా మనిషిలా మంచితనంతో మూర్తీభవించిన ఉన్నతమైన వ్యక్తి ర‌జ‌నీ కాంత్‌. త‌ను సూపర్ స్టార్ అయిన‌ప్ప‌టికీ  ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకు ఏడాదికి ఒకసారి సమయం దొరికినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతంగా దైవారాధన చేసుకొని చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసుకొని తీరిగ్గా వస్తారు. ఇందులో భాగంగా రజినీకాంత్ 10 రోజులు హిమాలయాలకు వెళ్లిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గుర్రం మీద ప్ర‌యాణిస్తున్న ఫోటోలు నెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. 

చంద్రబాబును టార్గెట్ చేసిన‌ బీజేపీ

టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేసింది. ఈ మేరకు అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, పోలవరం టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని బీజేపీ నేతలు బాబుపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందని, దశాబ్దాలుగా కమలం పార్టీ ఎదగకుండా చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ మైత్రిబంధం కలవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంతో విభేధించి నష్టపోయామని, పట్టుదలకు పోకుండా ఉంటే అంత ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి లాభం జరగలేదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. 

నేడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ప్రముఖ సినీనటుడు చిరంజీవి భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ప్రముఖ సినీనటుడు చిరంజీవి భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ను చిరంజీవి, ఆయన కుమారుడు, సినీనటుడు రామ్‌చరణ్‌ మర్యాదపూర్వకంగా కలువనున్నారు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. వాస్తవానికి ఈ భేటీ నాలుగురోజుల ముందుగానే జరగాల్సి ఉంది. అయితే సీఎం ఢిల్లి పర్యటన నేపథ్యంలో భేటీ సోమవారానికి వాయిదా పడింది

మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనన్న సీఎం జగన్

మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నవంబర్ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభo. వచ్చే నాలుగేళ్లలో  అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలని  సర్కార్ లక్ష్యం. ప్రతి ఏడాది 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న సర్కార్ . ప్రైవేటు కాంట్రాక్టర్ లతో కాకుండా... కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిన దేశంలోనే తొలిసారి అమలు చేయాలని జగన్ నిర్ణయం. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి స్కూల్ ఆధునికీకరణ. నేడు స్కూల్ ఎలా ఉంది.. నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో ఫొటోలతో ప్రజల ముందుంచాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని అవలంభిస్తున్న జగన్.

ఆర్టీసీ సమ్మె మరింత ఉద్ధృతం...కండక్టర్‌ ఆత్మహత్య

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్ గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమ్మెకు జ్వరం కారణంగా వారం రోజులు సెలవులో ఉన్న సురేందర్.. గత నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసి తీవ్రంగా కలతచెందారు. ఏడాది కిందట కుమార్తెకు వివాహం చేసిన సురేందర్‌గౌడ్.. ఇందుకు స్టేట్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతినెల వచ్చిన జీతంతో వాయిదాలు చెల్లిస్తుండగా, సెప్టెంబరు మాసం వేతనం ప్రభుత్వం చెల్లించకపోవడంతో చెక్కు బౌన్స్ అయ్యింది. ఈ మేరకు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని, రుణం ఎలా తీర్చాలనే ఆందోళనకు గురైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సురేందర్‌గౌడ్‌ ఉద్యో...