అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్ ఈ రోజు మృతి చెందాడు. ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అతడికి ఉస్మానియాలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. కాసేపట్లో అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నారు. సురేశ్ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే తనపై తానే పెట్రోల్ పోసుకున్నట్లు చెప్పాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం.