Skip to main content

Posts

Showing posts from August 28, 2020

టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుమలఅన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్సారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి అధిక స్థాయిలో ఉందని.. ఈ పరిస్థితుల్లో స్వామివారి వాహన సేవలు మాఢవీధుల్లో నిర్వహించే పరిస్థతి లేదన్నారు. బ్రహోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. అధిక మాసం కారణంగా రెండు సార్లు బ్రహోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే.. యథాతధంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. టీటీడీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు.. విజయవాడ సమీపంలోని పోరంకిలో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించడానికి అంగీకరించారు. తిరుమలలోని చెత్తను కంపోస్ట్‌గా మార్చి రైతులకు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. కొండ మీద టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని దాన్ని వెంటనే తరలించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రతీ నెల డిపాజిట్ల ద్వారా వ...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

  కరోనా కష్టకాలంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న ప్రభుత్వ వైద్యుల కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు కోవిడ్ డ్యూటీ చేస్తూ కరోనాతో మృతి చెందితే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ చనిపోయిన వెంటనే జిల్లా వైద్యాధికారికి వివరాలు పంపించాలని, అవి వచ్చిన వెంటనే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది

చిరు, విజయశాంతిలను అనుకరిస్తూ దంపతుల డ్యాన్స్.. చూసి ఆశ్చర్యపోయి, అభినందించిన మెగాస్టార్‌!

MEGASTAR's response for a mini attempt! #MegastarChiranjeevi garu for a reason!🙏🏻Sir, you are so kind! We love you so much ♥️♥️ @KChiruTweets With this energy you gave, I shall work much more harder Sir! Thank you #megafans for a blockbuster response #HarikaSandepogu #Chiranjeevi pic.twitter.com/QDNUJ9bx8r — Sudhakar Komakula (@UrsSudhakarK) August 28, 2020 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..అనంతరం పలు సినిమాలు చేసి టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలోని ఓ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. 'ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన.. గగన జఘన సొగసు లలనవే.. ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా' అంటూ ఆ భార్యాభర్తలు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఛాలెంజ్‌ సినిమాలో ఈ పాటకు చిరుతో కలిసి విజయశాంతి డ్యాన్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ దంపతులు వారిని అనుకరిస్తూ డ్యాన్స్‌ చేసి చిరుకి గిఫ్ట్ ఇచ్చారు. దీంతో దీనిపై చిరంజీవి స్పందించారు. ...

టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో మరో దిగ్గజ సంస్థ!

  భారత్‌లో నిషేధానికి గురై తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని వాల్‌మార్ట్‌ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్‌ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ వంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. వాల్‌మార్ట్‌ ప్రకటనపై ఇటు మైక్రోసాఫ్ట్‌ కానీ, టిక్‌టాక్ కానీ  స్పందించలేదు. టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అధ్యక్షుడు ట్రంప్‌ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే అమెరికాలో కార్యకలాపాల్ని విక్రయించాలని.. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అందుకు సెప్టెంబరు 15 గడువుగా విధించారు. 

డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు జరిపితీరాల్సిందే!: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

 దేశ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ఫైనలియర్, సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చివరి ఏడాది పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉందని తెలిపింది. అయితే, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయం తీసుకుని వాటిని వాయిదా వేయవచ్చని పేర్కొంది. పరీక్షలు రాయకుండా  మాత్రం ఎవరినీ పాస్ చేయవద్దని సూచించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే యూజీసీ గైడ్‌లైన్స్‌ని‌ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని, వాటి ఆధారంగా తుది పరీక్షల ఫలితాలు ప్రకటించాలని కోరిన  పిటిషన్ల వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.  పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదింపులు జరిపి పరీక్షల నిర్వహణ  తేదీలను ఖరారు చేయవచ్చని పేర్కొంది. యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును మాత్రం  రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది. పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ జారీ ...

అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

 టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది. ఇటీవలే అచ్చెన్న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, అచ్చెన్నకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి

సినీ పరిశ్రమలో నెపోటిజం.. బాలకృష్ణ, నాగార్జున, తారక్ లను ఉదహరించిన నాగబాబు!

 బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు ఇండస్ట్రీలోని నెపోటిజం (బంధుప్రీతి) కారణమంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీపై కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై తాజాగా నాగబాబు స్పందించారు.  తమ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడి పైకి వచ్చారని ఆయన అన్నారు. చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయితేజ్ లతో పాటు నిహారిక కూడా సినీ పరిశ్రమలో ఎదగడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. వీరంతా తమ కెరీర్ కోసం ఎంతో శ్రమిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ కుమారుడు కాబట్టే బాలకృష్ణ స్టార్ అయ్యారని, నాగేశ్వరరావు కొడుకు కాబట్టే నాగార్జున అగ్ర నటుడు అయ్యారని చెప్పుకోవడం హాస్యాస్పదం అని నాగబాబు అన్నారు. వీరంతా తమ టాలెంట్ తోనే గొప్ప నటులయ్యారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో తాను స్వయంగా చూశానని అన్నారు. 'అరవింద సమేత' షూటింగ్ లో 44 డిగ్రీల ఎండలో షర్ట్ లేకుండా తారక్ ఫైట్ చేయడాన్ని తాను కళ్లారా చూశానని చెప్పారు. తొలి రోజుల్లో మహేశ్ బాబు లావుగా ఉండేవాడని... కానీ, సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజు రన్నింగ్ చ...

నేను కలలో కూడా ఊహించని వీడియో ఇది: ఆనంద్ మహీంద్రా

వీడియో చూడండి: Click here తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను వెంటనే పంచుకునే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో వినూత్న వీడియోను పోస్ట్ చేశారు. స్టాండ్ వేసివున్న బైక్ ను స్టార్ట్ చేసి గేర్ లో ఉంచి, వెనుక చక్రాన్ని తిప్పుతూ, మొక్కజొన్న పొత్తులను దానికి ఆనించి పట్టుకోగా, విత్తనాలన్నీ చాలా సులభంగా విడిపోతూ కింద పడుతున్నాయి. ఈ చక్రం తిరిగే వేగానికి పది సెకన్లలోపే ఓ కండె నుంచి విత్తనాలను వేరు చేస్తున్నారు. చక్రానికి ఇరువైపులా ఇద్దరు కూర్చుని టకటకా పనిచేస్తున్నారు. ఇక ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వద్దకు చేరగా, ఇటువంటి సృజనాత్మకతను తాను కలలోనైనా చూడలేదన్నారు. "మన వ్యవసాయ విధానంలో బైకులు, ట్రాక్టర్లను వాడుతూ ఎన్నో రకాల పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. ఈ వీడియో నేను కలలో కూడా ఊహించనిది. ఇకపై ''కార్న్ టినెంనల్" అనే ప్రత్యేక బ్రాండ్ ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో" అని వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిస వీడియోను మీరూ చూడవచ్చు.

నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి

విద్యార్థులకు అండగా సోనూ సూద్ సౌకర్యాల లేమి కారణంగా ఏ ఒక్కరూ ఎగ్జామ్ మిస్ కావొద్దు! కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన  బాలీవుడ్ నటుడు సోనుసూద్    ప్రస్తుత పరిస్థితుల రీత్యా తనదైన శైలిలో కార్య రంగంలోకి దిగిపోయారు. ఈ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న సోనూ సూద్ అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు.   ఒకవైపుకోవిడ్-19 రిస్క్, మరోవైపు తండ్రి పేదరికం, లోన్ల బెడద తదితర ఆర్థిక కష్టాల నేపథ్యంలో చాలాదూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలి.. దయచేసి సాయం చేయండి అంటూ కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థి ఆవేదనను  సోనూ షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్  తాజా నిర్ణయం తీసుకున్నారు.   నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖాయమైతే..ఆయా ప్రాంతాల విద్యార్థులు...