ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు, తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్, పొరుగు సేవల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్, సాధారణ పరిపాలన శాఖ అజమాయిషీలో పొరుగు సేవల కార్పొరేషన్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ పథకానికి రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాగా ఉన్నట్టు చెప్పారు. వైఎస్సార్ చేనేత నేస్తం కింద ఒకేసారి రూ.24 వేలు సాయం చేయాలని, ఏటా డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనేందుకు నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని, హోంగార్డులకు ఇచ్చే రోజువారీ జీతభత్యం రూ.710కు, మధ్య...