ప్లాస్మా దానం. కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. అసలు ప్లాస్మా అంటే ఏంటి? ప్లాస్మా అన్నది ఇప్పుడు ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చింది? కోవిడ్ పేషెంట్ల పాలిట ప్లాస్మా ఒక సంజీవనిలా ఎందుకవుతోంది? ఇవన్నీ ఖచ్చితంగా ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సి యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాలోనూ ఇలాంటి యాంటీబాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు, ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, డాక్టర్లు ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ప్లాస్మా దానం చేసిన వారికి 5వేల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించారు. ఇంతకూ ప్లాస్మా అంటే ఏంటి? రక్త...