అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియా'గా వర్ణించారు.
మోదీ, ట్రంప్ మధ్య మంగళవారం న్యూయార్క్‌లో అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు "భారత్‌లో ఇంతకు ముందు( మోదీ పాలనకు ముందు) ఎలా ఉండేదో నాకు గుర్తుంది. అక్కడ అనైక్యత, విభజన ఉండేది. మోదీ ఒక తండ్రిలా అందరినీ ఏకం చేశారు. ఆయన బహుశా ఇండియాకు తండ్రి లాంటి వారు. నేను మోదీని 'ఫాదర్ ఆఫ్ ఇండియా' అంటాను" అన్నారు.
నరేంద్ర మోదీ అంటే తన మనసులో చాలా గౌరవం ఉందని, ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ అన్నారు.
తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దే సామర్థ్యం ఆయనకు ఉందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
Comments
Post a Comment