Skip to main content

ట్రంప్‌తో భేటీ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం ఎదురైంది. పాక్ జర్నలిస్ట్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ ట్రంప్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు . ట్రంప్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందనేది డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమ్యారు. భేటీ ముగిసిన వెంటనే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ట్రంప్ కు పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు విసుగెత్తించే ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై మీ వైఖరి ఏంటి అంటూ  ట్రంప్ ను పదేపదే ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన ట్రంప్.. సదురు జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వేలు ఇమాన్ ఖాన్ వైపు చూపుతూ నీవు ఆయన టీమ్ కు చెందిన వ్యక్తివా ? అని ప్రశ్నించారు. ఇంతటితో ట్రంప్ ఆగకుండా డైరక్ట్ గా ఇమ్రాన్ ఖాన్ తో ఇలాంటి ...వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇమ్రాన్ తడబడ్డారు . ట్రంప్ రియాక్షన్ తో పాక్ ప్రధాని ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. 
ఇప్పటికే అనేక వేదికలగా కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ట్రంప్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య శాంతియుత వాతావారణాన్ని విషయంలో తమ సాయం అందిస్తామన్నారు తప్పితే కశ్మీర్ అంశాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ఇప్పుడు  పాక్ జర్నిలిస్ట్ పదే పదే ఇలా కశ్మీర్ పై స్పందించాలని ప్రశ్నించడంతో ట్రంప్ ఈ మేరకు అసహనాన్ని ప్రదర్శించారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.