టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఊరట లభించింది. అధికారులను దూషించిన కేసులో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. తనను మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమారర్ దూషించారంటూ బుజ్జిలి ఎంపీడీవోదామోదరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కూన రవికుమార్ తోపాటు 11 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు...10 మందిని అరెస్ట్ చేసి ఆముదాలవలస కోర్టులో హాజరుపరిచారు. వారందరికి జూనియర్ సివిల్ జడ్జి బి.జ్యోత్స్న సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు.
మరోవైపు కూన రవికుమార్ అరెస్ట్ పై శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూనను అరెస్ట్ చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు.
గాలింపు చర్యలు చేపడుతున్నారు. కూన రవికుమార్ బంధువుల గురించి ఆరా తీస్తున్నారు. తన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment