Skip to main content

ఇది నాగరిక రాజ్యమా? కాలకేయ రాజ్యమా?: చంద్రబాబు

Image result for CHANDRABABU
వైసీపీ అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఏమిటీ నిరంకుశత్వమని నిలదీశారు. ఇది నాగరిక రాజ్యమా? కాలకేయ రాజ్యమా? అంటూ ఫైర్ అయ్యారు.
 
‘‘వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here