ఏపీ రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలపై మాట్లాడిన జీఎం కొత్త రైళ్లు, పెండింగ్ పనులు, ఆర్ఓబీ, ఆర్యూబీపై ప్రతిపాదనలు వచ్చాయని, రైల్వేస్టేషన్లలో సదుపాయాలు, స్టాంపుల పెంపుపై చర్చించామన్నారు. ఎంపీలు లేవనెత్తిన సమస్యలలో తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామన్న జీఎం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వాల్తేరు డివిజన్ ను విశాఖలో ఉంచాలని ఎంపీలు కోరారని అది రైల్వే బోర్డు పరిధిలోని అంశమన్నారు.
Comments
Post a Comment