Skip to main content

అక్రమాలు బయటపెట్టిన విలేకరిపై దాడి చేస్తారా : చంద్రబాబు

వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, అందుకు ఉదాహరణ చీరాల విలేకరిపై జరిగిన దాడి అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. ‘చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషమని, అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికి వెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?’ అని విరుచుకుపడ్డారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here