Skip to main content

అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం

పాకిస్తాన్ గూఢచర్య సంస్థ.. ఐఎస్ఐ.. అల్‌-ఖైదా మిలిటెంట్ సంస్థకు శిక్షణ ఇచ్చిందని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు.
సోవియట్ సైన్యంతో పోరాడటానికి అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ బృందాలను పాక్ తయారు చేసిందని ఆయన ఒప్పుకున్నారు.
9/11 దాడుల తర్వాత అమెరికాకు సహకరించి పాకిస్తాన్ పెద్ద తప్పు చేసిందని కూడా ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
న్యూయార్క్‌లో 'కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్)' అనే ఓ మేధో సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
''నేను ఎదుర్కొన్న అన్ని దేశాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది పాకిస్తానే' అని అమెరికా మాజీ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ గతంలో వ్యాఖ్యానించారు.
ఈ అభిప్రాయంపై స్పందన కోరినప్పుడు, ''పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ఎందుకు పెరిగిందో, మాటిస్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారనుకుంటా'' అని ఇమ్రాన్ అన్నారు. 80వ దశకంలో ఏర్పడిన పరిస్థితుల గురించి మాట్లాడారు.
''1980లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది. అమెరికాతో కలిసి పాకిస్తాన్ దీన్ని ప్రతిఘటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటెంట్లను పిలిపించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జిహాద్ చేసేందుకు సిద్ధం చేసింది. ఇలా మిలిటెంట్ సంస్థలను తయారుచేసింది'' అని ఇమ్రాన్ వివరించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.