Skip to main content

రేవంత్ రెడ్డికి సోనియా షాక్: హుజూర్ నగర్ టికెట్ ఉత్తమ్ భార్యకే

కాంగ్రెస్  పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డికి షాకిచ్చింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి టిక్కెట్టు కేటాయిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకొన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ మాటే నెగ్గింది. కాంగ్రెస్ నాయకత్వం ఉత్తమ్ వైపే నిలిచింది. రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.

ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పద్మావతి పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఆమె కోదాడ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారుహుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఇటీవల చర్చించింది.ఈ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొన్నారు.ఉత్తమ్ భార్య పద్మావతిని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బరిలో దింపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు.హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బరిలోకి ఎవరిని దింపాలనే విషయమై పార్టీలో చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు అసలు పార్టీలో చర్చించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్ధిని ప్రకటించారని రేవంత్ రెడ్డి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడ ఆయన డిమాండ్ చేశారు.అంతేకాదు హుజూర్‌నగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డికి హుజూర్‌నగర్ అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని కూడ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కూడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది.ఈ విషయమై ఎఐసీసీకి నివేదికను కూడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంపింది.మరో వైపు తనకు హుజూర్‌నగర్ ‌అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించాలని యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు ఈ నెల 21వ తేదీన లేఖ రాశాడు.కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు కూడ హుజూర్‌నగర్ లో పద్మావతి పేరును సమర్ధించారు. ఉత్తమ్ భార్య పద్మావతిని బరిలో దింపడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఉత్తమ్ కు మద్దతుగా నిలిచింది. అయితే ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments