బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇండియాలో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్ ని వరించింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు.
తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని మొట్టమొదట 1969లో ప్రారంభించారు. హిందీ నటి దేవిక రాణి మొదటి అవార్డుని సొంతం చేసుకున్నారు.
ఇండియన్ స్క్రీన్ పై అమితాబ్ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేస్తూ.. లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండు జనరేషన్స్ కి ఆదర్శంగా నిలిచిన నటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీ ఆయన్ని యునానిమస్ గా ఎంపిక చేసింది. ఇది దేశంతో పాటు అంతర్జాతీయ సినీ ప్రముఖులు కూడా గర్వించే విషయం.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న అమితాబ్ కు నా శుభాకాంక్షలు అని ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు.
Comments
Post a Comment