కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇండియా గాంధీ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ తెలుసు.. ఈ ఇండియా గాంధీ ఎవరూ అనే సందేహం మీకు కూడా కలిగిందా..? శశిథరూర్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇది.
ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు. ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.
ఆ విషయం పక్కన పెడితే... తమ పార్టీ పెద్దల గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలనే తాపత్రయంలో శశిథరూర్ పెద్ద మిస్టేక్ చేశారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారికి దక్కిన గౌరవం ఇది అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే... ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ లో ఇందిరా గాంధీ పేరును తప్పుగా పేర్కొన్నారు.
ఇందిరాగాంధీకి బదులు ఇండియా గాంధీ అని పేర్కొన్నారు. అంతే... ఆ తప్పును గమనించిన నెటిజన్లు.. శశిథరూర్ ని ఏకిపారేస్తున్నారు. ఎవరీ ఇండియా గాంధీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే... కాంగ్రెస్ నేతలకు ఇందిరా గాంధీనే ఇండియా గాంధీ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖుల పేర్లు మార్చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తాన్ని తప్పుడు ట్వీట్ తో శశిథరూర్ అడ్డంగా బుక్కయ్యారు.
Comments
Post a Comment