Skip to main content

కోడెల ఆత్మహత్యపై నోటీసులు: 11 రోజుల గడువు అడిగిన ఫ్యామిలీ

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే  11 రోజుల తర్వాత విచారణఖు హాజరుకానున్నట్టుగా కోడెల  శివప్రసాద్ రావు కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.

ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని తన నివాసంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ కేసుకు సంబంధించి కుటుంబసభ్యులను విచారణ చేయాలని  హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు.

ఈ విషయమై  కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు పోలీసులు విచారణకు రావాలని కోరారు. అయితే  11 రోజుల తర్వాత విచారణకు హాజరు అవుతామని  కోడెల శిప్రసాద్ రావు కుటుంబసభ్యులు చెప్పారు.

ఆత్మహత్యకు ముందు కోెల శివప్రసాద్ రావు తన గన్‌మెన్‌కు ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకొన్న రోజున కోడెల శివప్రసాద్ రావు ఎవరెవరికి ఫోన్ చేశాడనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు. 

మరో వైపు అంతకుముందు కూడ ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల తిన్న టిఫిన్ తో పాటు ఇతర విషయాలపై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్న గదిని కూడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు ఇంటికి ఎవరు వచ్చినా కూడ తమకు సమాచారం ఇవ్వాలని కూడ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

కోడెల శివప్రసాద్ రావు సెల్‌ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకొన్న రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు కోడెల శివప్రసాద్ రావు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసు విషయమై ఆయన మేనల్లుడు గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును  ఆ జిల్లా పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు.


Comments