Skip to main content

పెరిగిన రేటు... రూ.8లక్షల విలువచేసే ఉల్లి చోరీ





onion theft in bihar after its price soarsప్రస్తుతం దేశంలో ఉల్లి ధర బాగా పెరిగింది. కేజీ ఉల్లి ధర దాదాపు రూ.80 పలుకుతోంది. దీంతో... దొంగల కన్ను ఇప్పుడు ఉల్లిపై పడింది. రేటు అమాంతం పెరగడంతో... ఉల్లి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిహార్ రాష్ట్రం పట్నాలో దాదాపు రూ.8లక్షల విలువచేసే ఉల్లిని చోరీ చేశారు.
గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.
కాగా... ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వీడియో ఫుటేజీని కూడా పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా... ఉల్లిని పోగొట్టుకున్న వ్యాపారి ధీరజ్ కుమార్ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉల్లిని దొంగతనం చేస్తారని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాపారి ధీరజ్ కుమార్ పేర్కొన్నారు. మొత్త 328 బ్యాగుల ఉల్లి చోరీకి గురైందని అతను చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఉల్లి ధర కేజీ రూ.50 ఉందని అతను చెబుతున్నారు. నా ఉల్లి దొంగతనంతో... ఇతర వ్యాపారుల్లో కూడా కంగారు మొదలైందని అతను చెప్పడం విశేషం. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...