విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సమీక్షించేందుకు ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 63 జీవోను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఇప్పటికే పీపీఏలపై ఏపీ ప్రభుత్వం తీరును కూడ కేంద్రం కూడ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
చంద్రబాబునాయుడు సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చకు రావాలని 63 జీవోను ఇచ్చింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
ఇప్పటివరకు నిర్ణయించిన ధరల ప్రకారంగానే ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కూడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఏపీఈఆర్‌సీకి కూడ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ వివాదాన్ని ఆరు మాసాల్లో పరిష్కరించాలని కూడ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమైకేంద్రం కూడ ఏపీ సర్కార్ తీరును తప్పుబట్టింది.
కేంద్ర మంత్రి కూడ ఇటీవల హైద్రాబాద్‌లో ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం పీపీఏలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై కేంద్రం వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.
Comments
Post a Comment