ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ అత్యధికంగా ఖర్చు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రూ. 131 కోట్లను ఖర్చు చేసింది. వైఎస్ఆర్‌సీపీ కేవలం రూ.86 కోట్లను మాత్రమే ఖర్చుచేసినట్టుగా ప్రకటించింది.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై ఎక్కువగా ఖర్చు చేసింది. ఎస్ఎంఎస్‌లు, యూట్యూబ్, వెబ్‌సైట్ల ద్వారా టీడీపీ ఎక్కువగా తమ పార్టీ కార్యక్రమాలను ప్రచారంం చేసింది. వైఎస్ఆర్‌సీపీ మాత్రం సోషల్ మీడియాపై తక్కువగానే ఖర్చు పెట్టింది. ఆ పార్టీ కేవలం రూ. 35 కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసింది.
టీడీపీ, వైఎస్ఆర్‌సీపీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు ఎన్నికల్లో తాము చేసిన ఖర్చును ఎన్నికల సంఘానికి అందించాయి.తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఈ నెల 23వ తేదీ వరకు మాత్రం ఎన్నికల సంఘానికి తమ ఎన్నికల ఖర్చులను ఇవ్వలేదు.
ఏ రాజకీయ పార్టీయైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లకు, సీనియర్ పార్టీ లీడర్ల ప్రచారం కోసం, మీడియా అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం, పబ్లిసిటీ మెటీరియల్ కోసం, పబ్లిక్ మీటింగ్ ల కోసం ఖర్చు చేస్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ మీడియా అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం రూ. 49 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో వార్తా పత్రికలు, టీవీ చానెల్స్, బల్క్ ఎస్ఎంఎస్ లు, కేబుల్ టీవీల్లో ప్రచారం, వెబ్ సైట్, యూట్యూబ్ ద్వారా ప్రచారం కోసం ఖర్చు చేశారు. టీడీపీ ప్రచార సామాగ్రి కోసం రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.
మరో వైపు టీడీపీ అనుసరించిన విధానాన్నే వైఎస్ఆర్‌సీపీ పాటించింది. ఈ రెండు పార్టీలు డిజిటల్ పద్దతిలో ప్రచారం కోసం గత ఎన్నికల కంటే ఎక్కువ నిధులను ఖర్చు చేశాయి.
2014 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆన్‌లైన్ ప్రచారం కోసం రూ.400-500 కోట్లు ఖర్చు చేశారు. ఇది 2019 నాటికి రెట్టింపు అయింది.గూగుల్ పొలిటికల్ అడ్వర్‌టైజ్ మెంట్ ట్రాన్స్‌పరన్సీ రిపోర్ట్ ప్రకారంగా దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు రూ.86,311,600 కోట్లను ఖర్చు చేసినట్టుగా వెల్లడించింది. ఇది గతంతో పోలిస్తే ఎక్కువ అని ఆ సంస్థ ప్రకటించింది.
Comments
Post a Comment