Skip to main content

కొండెక్కిన ఉల్లిధర: దళారులపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా ఉల్లిధర కొండెక్కింది. ఉల్లిని ఉత్ప్పత్తి చేసే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు సంభవించడంతో ఉల్లిధర కొండెక్కి కూర్చోంది. ఉల్లిధర ప్రస్తుతం సెంచరీ సైతం కొట్టేసేలా ఉంది. 
ఉల్లిధర కొండెక్కడంతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి కొరతను కృత్రిమంగా సృష్టించేందుకు కొందరు దళారులు ప్రయత్నిస్తున్నారని తనకు సమాచారం వచ్చిందని అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. 
బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించేందుకు ఉల్లిని దాచివేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.  ఉల్లిని అత్యధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరదల ప్రభావంతో ఉల్లి రేట్లు పెరిగిందని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. 
ఇప్పటి వరకు 50వేల టన్నుల ఉల్లి ఉందని దాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాఫెడ్, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ద్వారా ఉల్లిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఉల్లి కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 
గత నెలతో పోలిస్తే ఈనెల 300శాతం ధర పెరిగిపోయిందని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిణామాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. దేశరాజధాని న్యూఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఆకస్మాత్తుగా ఉల్లిధర ఆకాశాన్నంటిందని తెలిపారు. కేజీ ఉల్లి ధర రూ.70 నుంచి 80 రూపాయల వరకు పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.