Skip to main content

డోనల్డ్ ట్రంప్: ‘నేను పాకిస్తాన్‌కు స్నేహితుణ్ణి.. ఇమ్రాన్ ఖాన్ గొప్ప నాయకుడు.. మోదీ ప్రకటన దూకుడుగా ఉంది’

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, అమరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం న్యూయార్క్‌లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తనను తాను పాకిస్తాన్‌కు స్నేహితుడిగా అభివర్ణించుకున్న ట్రంప్.. ఇమ్రాన్ ఖాన్ ‘గ్రేట్ లీడర్’ అని చెప్పారు.
ఆ సమావేశానికి ముందు ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ ఒక మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో 59 వేల మంది సమక్షంలో చాలా దూకుడుగా ప్రకటన చేశారు" అని చెప్పారు.
"భారత్, ప్రధానమంత్రి మోదీ వైపు నుంచి నిన్న చాలా అగ్రెసివ్ ప్రకటన విన్నాను. నేను అక్కడే ఉన్నాను. నేను అలాంటి ప్రకటన వింటానని అనుకోలేదు. అక్కడున్న వారందరికీ అది బాగానే అనిపించింది. కానీ అది చాలా దూకుడుగా ఉంది" అని ట్రంప్ అన్నారు.
నరేంద్ర మోదీ ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా "సొంత దేశాన్నే నడపలేని వారికి, భారత్ తీసుకునే నిర్ణయాలతో ఇబ్బంది వస్తోందని, వారు తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారని" చెప్పారు.
పాకిస్తాన్, భారత్‌తో కలిసి వస్తామని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యంగా ఉండేలా ఏదైనా చేయగలమని ట్రంప్ ఈ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుందన్న ఆయన, దీనిని కూడా ఏదో ఒకవిధంగా పరిష్కరించవచ్చని అన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.